[box type=’note’ fontsize=’16’] “తిరిగొస్తుందేమో కాలం ఒడిలో ఇంకిపోయే నమ్మకం” అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆశుతోష్ పాత్రో “మట్టి మనిషి” కవితలో. [/box]
[dropcap]రా[/dropcap]త్రుల గుండెల్లో ప్రతిరోజు నిద్రపోతాడు
అలసిపోయిన దినకరుడు
నింగి నీడల్లో
ముఖము దాచుకుంటుంది విశ్వాసం
ముక్తి కటకటాలు పగలకొడుతుంటాడు
మట్టి మనిషి
ఖండ విఖండమౌతుంది మనిషి మనసు
దారుణాల అనుభవాలతో
స్వేద ఘోష వినిపిస్తున్నడు
మట్టినుంచి ఎదిగి శీర్ణమైపోయిన
బుభుక్ష అక్షరాలు
అనుబంధాల నెత్తురుతో
రూపొందుతోంది ఇంకో అమరవీరుని చిత్రం
ఒక ఆశ… ఓ తపన… ఓ ఆరాటం…
తిరిగొస్తుందేమో
కాలం ఒడిలో ఇంకిపోయే నమ్మకం
మళ్లీ ఉదయిస్తాడేమో
అస్తమయంలో ఇరుక్కున్న సూర్యుడు
ముక్తాకాశం కింద
రక్తకన్నీరుతో తడిసే మట్టిపై నిల్చున్న మనిషి
చెయ్యచాచి పిలుస్తుంటే
నిర్వికారంగా చూస్తుండిపోయింది ఆకాశం
రక్తంతో తడిసె మట్టిని
మట్టిపై నిల్చోని విలపిస్తున్న
మట్టి మనిషి ఛాతిని