[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘నెరసిన ప్రేమ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ర్థం చేసుకొనే నీ కోసం
గడ్డాలు.. మీసాలు
నెరసి పోవచ్చు
వలపు ఆవిరులు
తలపు భావలలో
రగులుతూనే ఉంటాయి
నీ కోసం
వెన్నెల కాలాలు
కంటిముందే
కరిగిపోనూ వచ్చు
ప్రేమ మేఘాలు
వర్షిస్తూనే ఉంటాయి
నీ కోసం
రుతువులు రాగాల
పల్లకీ తీసుకొస్తూ పోతూ ఉండొచ్చు
నిత్య వసంతం
యవ్వన గీతం పాడుతూనే ఉంటుంది
నా నెరసిన ప్రేమ.. కూడా
వలపుల చకోరి ఎక్కడుందో.. అని