[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ నేను లేననీ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]దేంటో
నీతో పరిచయమయ్యాక
నా తీరే వేరుగా వుంది
కళ్ళు మాట్లాడుతున్నాయి
హృదయం చూస్తోంది
పెదవులు మౌనమయ్యాయి
చెవులకు నీ పేరే
తప్ప ఏదీ వినిపించడంలా
ఇంకా చెప్పాలంటే
ఒళ్ళంతా కళ్ళయ్యాయి
మనసంతా వేణువైంది
ఇలా ఏదేదో జరిగిపోతోంది
మరేది తెలియకపోయినా
ఒకటి మాత్రం తెలుస్తోంది
నీవుంటేనే నేనున్నానని
నీవయ్యాకనే నేను లేనని