[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘గాయం భాష తెలిస్తేనే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]కం[/dropcap]టిలో సూటిగా
మాట గుచ్చుకున్నాక
ఎదురుచూపు బతికి ఉంటుందా?
ఒకే ఒక వాక్యానికి
గొంతు బిగిసాక
ముఖంలో ఊపిరి కనిపిస్తుందా?
నిజం అలిగి పారిపోతే
మనసు ఎంత వెతికినా
మనిషిలో విలువ కనిపిస్తుందా?
ఇష్టానికి కష్టమొస్తే
చేర తీసే
మరో మనసుంటూ ఉంటుందా?
గాయం భాష
తెలియకుందా
మనసు బాధ వినగలమా?