ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-1

0
2

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

[dropcap]‘ప్రా[/dropcap]చీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే అంశము గూర్చి చర్చించినపుడు తొమ్మిది మంది వాగ్గేయకారులలో ఒకే లక్షణాన్ని అందరిలోను నేను గ్రహించాను. వాగ్గేయకారుల తల్లిదండ్రులు, ముత్తాతలు వీరందరూ కూడా  శాస్త్ర కోవిదులు. వారి సంతతి కూడా  శాస్త్ర నిష్ణాతులు; పండితులు కావడం,  అలాగే వారిలో కళకు ప్రేరణ కలగటం, ఆ ప్రేరణ కలలో యోగుల మూలంగా గాని, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని వారిలో యుండే మణిని వెలికితీసి సానబెట్టి, ప్రకాశవంతం చెయ్యడం,  అలాగే వారు ఒక క్రమ పద్ధతిలో పండితులు అంటే అన్ని విభాగాలు జ్యోతిష్, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంత ఇలా అన్ని రంగాలలో నిష్ణాతులైన వారి వద్ద విద్యను అభ్యసించి, దానిని వారి శక్తి, సామర్థ్యాలనుగుణంగా మలచుకొని, వారి ఇష్ట దేవతాస్తుతి గాని లేక నరస్తుతి చేయడం గాని వారి వారి రచనా శైలిలో మనకి ఆ రచనా వైవిధ్యం గోచరిస్తుంది.

ఇంకొక గమనిక:

ఒక వాగ్గేయకారునికి, మరొక వాగ్గేయకారుని మధ్య  లక్షణకారుల గ్రంథములు వచ్చాయి. ఆ గ్రంథాలలోని విషయము ఆ వాగ్గేయకారునికి సంబంధితాంశంగా వుండడం జరిగింది. ఉదాహరణకి భరతుని నాట్య శాస్త్రము – జయదేవుని గీత గోవిందం – రెంటికీ సంబంధం  వుంది.

తన భార్య పద్మావతీ దేవి నాట్య విన్యాసమే తన గ్రంథానికి మూలం అని జయదేవుడు నొక్కివక్కాణిస్తాడు.

అలాగే చాలామంది వాగ్గేయకారులకు, గ్రంథకర్తల గ్రంధాలకు సమన్వయ సంబంధం వుంటుందని మనకు తెలుస్తుంది. ఆనాటి రచనలు లిపిబద్ధం కాకపోవటం, ఎవరి శైలిలో వారు రచనలు సాగించటం జరిగింది. వాటికి కారణాలు చాలా ఉండవచ్చు. సరియైన భద్రత కల్పించే సంఘాలు లేకపోవటం గాని, సరియైన ఎక్కువ మంది శిష్యు, ప్రశిష్యులు లేకపోవటం గాని, ఆ నాటికి లిపి తెలిసిన, వ్రాయుటకు అవకాశం, ఆస్కారం లేక పోవటం గాని, లేక దానిమీద వారికి శ్రద్ధ లేకపోవటం గాని, కారణం ఏదైనా అవచ్చు. కాని ఇప్పటికి కొంతమంది  రచన శైలిని, వారి, స్వర, సంగీత, లయ విన్యాసాలని లిపిబద్ధం చేసి,  మనకందించిన సంగీత, సాహిత్య సేవ చాలా గొప్పది. ఈ నాటికి వారి రచనల యొక్క సంగీతం చిరస్థాయిగా ప్రజానీకంలో ఇంకా గోచరిస్తుందంటే, అది గొప్పతనమే కాని మరి ఏది కాదు.

అలా వారు ఇప్పటి తరం వారికి సంగీతంలో పేరు  ప్రతిష్ఠలు తెప్పించి పెడుతున్నారు. చక్కటి గాత్ర సంపదలతో, అర్థ సాహిత్యాలతో, మంచి సాంప్రదాయ బాణిలో తమకంటూ ఒక రకమైన ఫణితిని ఏర్పరుచుకున్న ఇప్పటి మహా మహా విద్వాంసులందరికీ ఈ సంగీతము వారి ఆర్థిక సమస్యను తీరుస్తూ, మోక్ష ప్రదంబైన మార్గాన్ని చూపిస్తూ, వారికి సంగీత భిక్ష పెట్టుననుటలో ఎలాంటి సందేహము లేదు అని అనిపిస్తుంది నాకు.

ఈ రచనలో ప్రస్తావించబోయే అంశాలు:

  • పరిచయం
  • వాగ్గేయకార లక్షణం
  • వాల్మీకి
  • జయదేవుడు
  • అన్నమాచార్యులు
  • పురందర దాసు
  • నారాయణ తీర్థులు
  • క్షేత్రయ్య
  • శ్రీ రామదాసు
  • మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
  • సదాశివ బ్రహ్మంద్రస్వామి
  • ఇతర వాగ్గేయకారులు
  • వాగ్గేయకారుల పట్టిక

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here