తెలుగుజాతికి ‘భూషణాలు’-17

0
3

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

గత సంచికలలో భారతరత్న, పద్మ విభూషణ్ పురష్కారం పొందిన తెలుగువారి జీవనరేఖలు గమనించాం.

ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారం పొందిన తెలుగువారి గురించి తెలుసుకుందాం. 1954 – 2024 మధ్య 70 సంవత్సరాలలో దాదాపు 82 మంది తెలుగువారు పద్మ భూషణులయ్యారు. వారి వివరాలివి:

పద్మభూషణులు-1954-2024

క్రమ సంఖ్య సంవత్సరం పురస్కార గ్రహీత రంగం
1  1954  ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్ శాస్త్ర సాంకేతిక రంగం
2  1954  పి. సత్యనారాయణరావు  సివిల్ సర్వీసు
3  1955  మాడపాటి హనుమంతరావు సామాజిక సేవ
4  1956  జైన్ యార్ జంగ్  ప్రజాసేవ
5  1956  గులాం యాజ్దాని శాస్త్ర సాంకేతిక రంగం
6 1957 శ్రీమతి ఆండాళమ్మ సామాజిక సేవ
7  1960  అయ్యదేవర కాళేశ్వరరావు ప్రజాసేవ
8  1962  మోటూరి సత్యనారాయణ ప్రజాసేవ
9  1962  డా. మహంకాళి సీతారామారావు వైద్యం
10  1963 డా. కె. యల్. రావు సివిల్ సర్వీసు
11  1965  మీర్ అక్బర్ అలీఖాన్ ప్రజాసేవ
12  1967  శ్రీమతి యం.యల్. వసంత కుమారి కళలు
13  1968 యం. చలపతిరావు  విద్య
14  1968  కె. రాధాకృష్ణారావు శాస్త్ర సాంకేతిక రంగం
15  1968  ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య  విద్య
16  1969  హెచ్.కె. షేర్వాణీ  సాహిత్యం
17  1970  విశ్వనాథ సత్యనారాయణ  సాహిత్యం
18  1970  గుర్రం జాషువా  సాహిత్యం
19  1970  యం. రామబ్రహ్మం సివిల్ సర్వీసు
20  1970  సయ్యద్ అబ్దుల్ లతీఫ్  సాహిత్యం
21  1970  జి. నరసింగరావు  సివిల్ సర్వీసు
22  1972  సయ్యద్ హుసేన్ జాహిర్  పారిశ్రామిక రంగం
23  1972  ఎం.బి. రామచంద్రరావు
24  1972  ఏ.యస్. రావు

(అయ్యగారి సాంబశివ రావు)

శాస్త్ర సాంకేతిక రంగం
25  1973  హరీంద్రనాధ చటోపాధ్యాయ  సాహిత్యం
26  1973  వెన్నెలకంటి రాఘవయ్య సామాజిక సేవ
27  1974  బి.యన్.రెడ్డి కళలు
28  1976  ఆలీ యావర్ జంగ్ సామాజిక సేవ
29  1976  దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం
30  1977  డా. పి. శివారెడ్డి  వైద్యరంగం
31  1982  గొట్టిపాటి బ్రహ్మయ్య సామాజిక సేవ
32  1982  ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి  విద్య
33  1984  డా. శ్రీపాద పినాకపాణి  కళలు
34  1985  ఉప్పులూరి గణపతిశాస్త్రి  సాహిత్యం
35  1986  డా. పి. ఎం. భార్గవ  శాస్త్ర సాంకేతిక రంగం
36  1988  అక్కినేని నాగేశ్వరరావు  కళలు
37  1988  డా. పి. తిరుమల రావు  వైద్యం
38  1988  అబిద్ హుసేన్  సివిల్ సర్వీసు
39  1991  డా. ప్రతాప్ సి. రెడ్డి  వైద్యం
40  1992  డా. సి. నారాయణ రెడ్డి  సాహిత్యం
41  1992  ఏ. ఆర్. కృష్ణ  కళలు
42  1992  కె. జగ్గయ్య  కళలు
43  1992  వావిలాల గోపాలకృష్ణయ్య  ప్రజాసేవ
44  1998  డా. పి. వేణుగోపాల్  వైద్యం
45  1998  వెంపటి చిన సత్యం  కళలు
46  2000  రాజారెడ్డి  కళలు
47  2000  రాధారెడ్డి  కళలు
48  2001  రాజ్ రెడ్డి  శాస్త్ర సాంకేతిక రంగం
49  2001  పల్లె రామారావు  శాస్త్ర సాంకేతిక రంగం
50  2001  భానుమతి రామకృష్ణ  కళలు
51  2001  బి. వి. రాజు  పారిశ్రామిక రంగం
52  2001  శివ కె. కుమార్  సాహిత్యం
53  2001  యామినీ కృష్ణమూర్తి  కళలు
54  2001  బోయి భీమన్న  సాహిత్యం
55  2003  స్వప్నసుందరి  కళలు
56  2004  టి. ఎల్. శంకర్  సివిల్ సర్వీసు
57  2004  చెన్నమనేని హనుమంతరావు  సాహిత్యం
58  2005  డా. కె. శ్రీనాధరెడ్డి  వైద్యం
59  2005  డా. కె. ఐ. వరప్రసాదరెడ్డి  శాస్త్ర సాంకేతిక రంగం
60 2006  పవని పరమేశ్వర రావు  ప్రజాసేవ
61 2006  పి. లీల  కళలు
62 2006  కొణిదెల చిరంజీవి  కళలు
63  2007  వి. మోహన గిరి  సామాజిక సేవ
64  2008  పి. సుశీల కళలు
65  2008  కె. పద్మనాభయ్య  సివిల్ సర్వీసు
66  2009  జి. కృష్ణ  కళలు
67  2010  నూకల చినసత్యనారాయణ  కళలు
68  2011  కె. అంజిరెడ్డి పారిశ్రామిక రంగం
69  2011 బి.వి.కె. రెడ్డి  పారిశ్రామిక రంగం
70  2011 యస్. పి. బాలసుబ్రమణ్యం  కళలు
71  2012 పి. చంద్రశేఖర రావు  ప్రజాసేవ
72  2013 డి. రామానాయుడు  కళలు
73  2013 సత్య యన్. అట్లూరి  శాస్త్ర సాంకేతిక రంగం
74  2014 ఏ. రామకృష్ణ  శాస్త్ర సాంకేతిక రంగం
75  2014 పుల్లెల గోపీచంద్  క్రీడలు
76  2016  డా. డి. నాగేశ్వరరెడ్డి  వైద్యం
77  2016  డా. ఏ.వి. రామారావు  శాస్త్ర సాంకేతిక రంగం
78  2016  డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్  సాహిత్యం
79  2020 పి.వి. సింధు  క్రీడలు
80  2022  కృష్ణ ఎల్లా – సుచిత్ర ఎల్లా  పారిశ్రామిక రంగం
81  2022  సత్య నాదెండ్ల  వాణిజ్యం, పరిశ్రమలు
82  2023  చినజియ్యర్ ఆధ్యాత్మిక రంగం

పద్మ భూషణ్ పురస్కారం పొందినవారిలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖులున్నారు. విభాగాల వారీగా విశ్లేషిస్తే కళలకు ప్రథమ స్థానం లభించింది. 18 మంది పొందారు. ఆ తరువాతి స్థానం 12 మందితో సాహిత్యము, 11 మందిలో ప్రజాసేవ సామాజికసేవలకు లభించాయి. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి 10 మందికి, సివిల్ సర్వీస్ అధికారులు ఏడుగురికి ఇచ్చారు. పారిశ్రామిక రంగం తరువాతి స్థానం. 2023లో ఆధ్యాత్మిక రంగానికి చెందిన శ్రీ త్రిదండి చినజియ్యర్ స్వామికి ఫ్రకటించారు. 2024 సంవత్సర పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 22న రాష్ట్రపతి భవనంలో ప్రదానం చేశారు. సంఖ్య రీత్యా రెండు దఫాలుగా ఈ పద్మ పురస్కారాలను సౌలభ్యం కోసం దర్బారు సీట్ల పరిమితిని అనుసరించి అందించడం అనవాయితీ. ముందురోజు గ్రహీతలకు రిహార్సల్స్ జరపడం అలవాటు. హాలులో నడక, అభివాదం చేయడం, ఫోటోకు నిలబడడం, తిరుగు ముఖం పట్టడం ఒకే పద్దతిలో ముందుగా గ్రహీతలకు నేర్పుతారు.

పద్మభూషణులైన ఆంధ్రులు 1954- 2024 (అకారాది క్రమంలో):

అ:

అక్కినేని నాగేశ్వరరావు

అనుమోలు రామకృష్ణ

అయ్యగారి సాంబశివ రావు

ఆ:

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియార్

ఆళ్ల వెంకట రామారావు.

ఉ:

ఉప్పులూరి గణపతి శాస్త్రి

ఎ:

ఏ. ఆర్. కృష్ణ

ఎస్. పి. బాలసుబ్రమణ్యం

క:

కళ్లం అంజిరెడ్డి

కె. యల్. రావు

కొంగర జగ్గయ్య

కొత్త సచ్చిదానందమూర్తి

గ:

గొట్టిపాటి బ్రహ్మయ్య

గోపాల రామానుజం

ఘ:

ఘట్టమనేని కృష్ణ

చ:

చిరంజివి

జ:

జాషువా

ద:

దగ్గుబాటి రామానాయుడు

దబ్బాల రాజ గోపాలరెడ్డి (రాజ్ రెడ్డి)

దేవులపల్లి కృష్ణశాస్త్రి

న:

నూకల చిన సత్యనారాయణ

నోరి గోపాలకృష్ణమూర్తి

ప:

పంచేటి కోటీశ్వరం

పద్మనాభయ్య కె

పల్లె రామారావు

పాటిబండ్ల చంద్రశేఖరరావు (పి. సి. రావు)

పవని పరమేశ్వరరావు (పి. పి.రావు)

పి. వేణుగోపాల్

పి. సుశీల

పుల్లెల గోపీచంద్

పెరుగు శివారెడ్డి

బ:

బి. వి. రాజు

బోయి భీమన్న

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.యన్. రెడ్డి)

భ:

బానుమతి రామకష్ణ

మ:

మాడపాటి హనుమంతరావు

మామిడిపూడి వెంకటరంగయ్య

మోటూరి సత్యనారాయణ

య:

యామినీ కృష్ణ మూర్తి

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

వ:

వావిలాల గోపాలకష్ణయ్య

వి. రామలింగ స్వామి

వెంపటి చినసత్యం

వెన్నెలకంటి రాఘవయ్య

శ:

శ్రీపాద పినాకపాణి

స:

సి. కె. నాయుడు

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here