[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. ఆనందం
మనసు కొలనులో
ఎవరో విసిరిన రాయిని
బయటకు విసిరేశాక
అల లేదు అలజడి లేదు
రాయి తడిచింది!
~
2. చీకటి
వెన్నెల రేయిలో
మనసంతా చీకటి
మనిషి జాడ లేదు!
~
3. కర్తవ్యం
నువ్వేంటి నేనేంటి
కర్మలో
కర్తవ్యమే కీలకం
~
4. దగ్గర
దూరమైన నిదురలో
దగ్గరగా ఉన్నావు
నాలో ఉన్న నీవు
నాతో ఉన్నావని నీకే తెలియట్లేదు