[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘కీచకపర్వం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ధ[/dropcap]ర్మ నిరతిలోనే ప్రతి అడుగు
ధర్మరాజు అన్న పేరు జగత్విదితం
ఆటైనా మాటైనా కట్టుబడిగా ఉండటమే
కట్టుబట్టలతోనైనా నిష్కమించడమే
ఆ ఐదుగురూ ధీరోదాత్తులు,పరాక్రమవంతులు
పంచ పాండవులుగా ప్రతీతి
మహాభారతాన్ని నడిపంచిన త్యాగశీలురు
సంయమనంతో సాగిన బాటలో
ఒకే మాటగా కదలిన మహాపురుషులు
పధ్నాలుగేళ్ళ వనవాసానంతరం విరాట కొలువులో
అజ్ఞాతంలో ఒక సంవత్సర కాలం
గుట్టుగా సాగుతున్న క్రమంలో కీచక పాత్ర ఆవిర్భావం
అక్కా.. సైరంధ్రిని మద్యంతో మా మందిరానికి పంపు
ఆజ్ఞాపనతో కీచకుడు
చీకటి చాటున వెలువడిందో స్వభావం
సైరంధ్రీ.. మా తమ్ముడి మందిరంలో ఈ మద్యం పాత్ర ఇవ్వు
రాణీ గారి ఆదేశం, చెమర్చిన కళ్ళలో పొడచూపిందో భావం
సాయుధులైన ఐదుగురు గంధర్వ పతులున్నారన్న ధైర్యం.
Image Source: Internet