[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
టి. రామలింగయ్య గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వశిష్టుని భార్య (3) |
3. చెడ్డపని (4) |
7. మరదలు (3) |
9. పన్ను, దంతము (4) |
10. అగడ్త, ధాన్యం నిలువ చేసే కొట్టు (4) |
12. పావుకోళ్ళు (3) |
13. కష్టజీవి (4) |
16. బక్కచిక్కిన వాడు (3) |
17. వలువ మధ్య మాయం (2) |
18. తడబడిన మయటం (3) |
20. తాడు పేనడానికి శుద్ధి చేసిన పట్ట (2) |
21. పాముపడగ (2) |
22. కుదిరిక (4) |
23. తగినంత బలం, చేవ (2) |
26. హిరణ్యకశిపుని భార్య (4) |
29. అటుగా ఇంటి పూరికప్పు (2) |
31. అపనింద, చెడ్డపేరు (3) |
33. వట్టివేరు (4) |
34 తడబడిన వల్లియ (3) |
35. కోకిల (2) |
నిలువు:
1. మెట్ట తామర (3) |
2. వసురాజు భార్య (3) |
3. వేడిమి (2) |
4. భయపెట్టేవాడు (4) |
5. విష్ణువు ఖడ్గం చివర సున్నలోపం (3) |
6. ఒక రాక్షసుడు (3) |
8. తడబడిన ముత్తిక (3) |
11. వీరుల మరణానికి సంకేతముగా ఊదే బాకా (4) |
12. అనవాలు, జాడ (3) |
14. తెగువ, ధైర్యం (3) |
15. చురుకుదనం లేనివాడు (3) |
16. ప్రతిరోజు (3) |
18. రెండు ముక్కలున్న బట్ట (3) |
19. వెలిగారం (2) |
21. పంట సంవత్సరం (3) |
24. ఆ ప్రక్క (3) |
25. ఆవకాయ పచ్చడి కాదు. వేరొకటి (3) |
27. నానబియ్యం (3) |
28. మేలైన చిత్రాసనం (3) |
30. పండ్ల పాచి (3) |
31. అతిశయం, లాఘవం (2) |
32. శుద్ధ నేల (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను puzzlesanchika@gmail.com కు 2024 జూలై 10వ తేదీలోపు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూలై 2024 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 ఆగస్టు 2024 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- జూన్ 2024 సమాధానాలు:
అడ్డం:
1.ప్రతీచి 3. మానుకోయిల 6. బులియు 7. సవ్యం 9. భవికం 11. నాగరం 13. నంత 14. కాపాడు 16. జమున 18. తిరుముడి 20. వనిత 22. తండు 23. కూన 24. కచం 26. డమ్మీ 28. రుక్క 29. కార్తీకము 30. పవం 31. కీలారం 32. తడిక 33. పులిచెలిక
నిలువు:
1.ప్రలోభనం 2. చిబుకం 3. మాయు 4. కోడిగ 5. లస 8. వ్యంజన 10. వితతి 11. నాడు 12. రంజని 14. కాముడు 15. పాడి 17. ముతక 19. రుతం 20. వనరు 21. బుడతకీచు 25. చంద్రవంక 27. త్తెకలిచె 29. కారంపు 30. పడిద
సంచిక – పదప్రహేళిక- జూన్ 2024కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి. బృందావనరావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కరణం రామకుమార్
- మత్స్యరాజ విజయలక్ష్మి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి. రాజు
- రంగావఝల శారద
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.