ఆ కత

10
2

[dropcap]”నే[/dropcap]ను అడిగింది చెప్పనేలేదు కదనా?”
“మరిస్తినిరా, ఇబుడే చెప్తాను ఇనుకోరా. నీళ్ల నింకా
చెట్టు నేలపైనకి వొచ్చి నిలుసుకొనె. నాకి ఆడ కన్నా ఈడే బాగుందని
తలసి పెరిగి పెద్దదాయె. పువ్వులు పండ్లు యిడసి సువాసనని
వెదజల్లె. ఆ వాసన పట్టిన పులుగు (క్రిమి) ఆ చెట్టుని నాకి
నక్కి (తిని), ఆడే కాపురం పెట్టి కళకళలాడే, తళతళ
మెరిసె. దాని తళుకులు చూసిన గువ్వ (పక్షి) ఆ పులుగుని
తిని మిరమిర మెరసె. ఆ మెరుపు చూసిన జంతువు ఆ
గువ్వని తిని జీర్ణము చేసుకొనె. అదె పొద్దుకి మనిషికి
ఆకలి ఆయే. మనిషి ఆ జంతువుని తిని తన ఆకలి
తీర్చుకొనె….. మనిషిలా ఆకలి సచ్చిపొయె.
మనిషి సచ్చిపోయ. మన్ను ఆకలి తీర్చెకెమో మంట్లాకి
పోయె ఇదేరా.”
“సరేనా”

***

ఆ కత = ఆ కథ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here