Site icon Sanchika

ఆ నీడ నను జేర్చు తండ్రీ..

[శ్రీ ఇక్బాల్ పాషా రచించిన ‘ఆ నీడ నను జేర్చు తండ్రీ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

బేస్ లెస్ థాటే
బే సబూదే..
ఏమైనా మరేమైనా
కావొచ్చు కానీ..

గాయాల బాల్యం
గడపదాటే వేళ..
దరిలేని ఊబి
దిగమింగునపుడు..

చిన్నారి మెదడులో
వెలసిన పాదులో..
ఆశ కాసిన మొగ్గ
అమ్మెంటె పోవాలని..

తెగ నరికినా
తనువే తగలేసినా
ఉద్యమ చిగుర్లతో
ఉబికి లేసే బంజరులా

తలెత్తుకోవడానికి
తపన పడుతూ..
తెగువచాటే తమిళ
టైగర్ల పోరులాగా..

సంకలో బిగగట్టి
సమరాన్ని ఈదిన..
ఝాన్సెంట బిడ్డలా
అమ్మెంటే సాగాల..

దేవుడూ దయ్యమూ
ఎరకతెలియని ఈడు..
ఎందుకొస్తుడెనో సోఁచ్
అమ్ముంటెనే బతుకాని..

ఇనేండ్ల వయసొచ్చె
అయినా అదే ధ్యాస..
నాలోన నా లోపము
కోరల్సాచే లోకాననా..

పురిటి పరిమళము
వొడిసిపోని వనము..
తనివితీరా విరబూసె
పూలవన్నెల నింగేడనో..

అమ్మఒడిలాంటి జాగ
లోకాన ఏడున్నదో..
యాడున్నదో ఆ తోవ
ఆ నీడ నను జేర్చు తండ్రీ

Exit mobile version