ఆ వెచ్చని స్పర్శ కోసం

0
2

[dropcap]ని[/dropcap]ర్జన నిశ్శబ్ద నీరవ నిశీధిలో
నీ తలపుల కొలిమిలో కాగుతున్నాను!
నీ కోసం పరితపిస్తున్నాను, పలవరిస్తున్నాను!
మనం గడిపిన మధుర క్షణాలు
నన్ను వెంటాడుతున్నాయి
ఈ నిరామయ గాడాంధకారంలో
అందుకే నీకై ఈ ఆవాహన!
ఒహ్! ఒక్కసారి వచ్చిపో కనికరంతో
నిద్రలేమి దాని పాత్రను సక్రమంగా పోషిస్తుంది
సజల నయనాలు చెక్కిళ్ళను నిమురుతున్నాయి
ఇప్పుడు మన మధ్య అనుసంధాన కర్తలెవ్వరూ లేరు
ఈ సంభాషణ ఇరు ఆత్మల తంతిలోనే!
నా యెద నిండా నువ్వే నిండాక
ఇక నాకోసం యోచించే తావెక్కడిది?
నీవు నీ స్మృతులే నాకిప్పుడు పంచప్రాణాలు
నీ ఊసులూ, బాసలే అన్నపానాలు
నా మనోవేదనను ఉపశమింపజేసి
శాంతినీ, క్రాంతినీ కలిగించేది – నీ రాకే!
నా దుఃఖాన్ని దిగమ్రింగేది – నీ వెచ్చని స్పర్శే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here