ఆచార్యదేవోభవ-19

1
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

[dropcap]ప్ర[/dropcap]తిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ప్రభవించి తొమ్మిది దశాద్బులైంది (1931-2021). గురువులకే గురువైన (పరమ గురువు) ఆచార్య పింగళి లక్ష్మీకాంతంతో బీజప్రాయంగా మొదలైన తెలుగు శాఖ 90 సంవత్సరాలలో ఒక మహా వృక్షమై వందలాది అధ్యాపకులను, ఇతర ఉద్యోగులను తయారు చేసింది. గతం నుండి నేటి వరకు శాఖాధ్యక్షులైన ఆచార్య పరంపర ఇది.

1. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం – 1931 – 1949

2. ఆచార్య గంటిజోగి సోమయాజి – 1949 – 1963

3. ఆచార్య కె.వి. రామనరసింహం – 1963 -1974

4. ఆచార్య తూమాటి దోణప్ప – 1974 – 1976

5. ఆచార్య యస్.వి. జోగారావు – 1976 – 1979

6. ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి – 1979 – 1982

7. ఆచార్య చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి – 1982 – 1985

8. ఆచార్య లకంసాని చక్రధరరావు – 1985 – 1988

9. ఆచార్య కోలవెన్ను మలయవాసిని – 1988 – 1991

10. ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి – 1991 – 1993

11. ఆచార్య పల్లికొండ ఆపదరావు – 1993 – 1996

12. ఆచార్య మర్రెబోయిన జయదేవ్ – 1996 – 1999

13. ఆచార్య బాల అరుణకుమారి – 1999 – 2001

14. ఆచార్య పర్వతనేని సుబ్బారావు – 2001 – 2004

15. ఆచార్య ఎలవర్తి విశ్వనాథరెడ్డి – 2004 – 2007

16. ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు – 2007 – 2010

17. ఆచార్య గజ్జా మోహన్ బాబు – 2010 – 2013

18. ఆచార్య సజ్జా మోహన్ రావు – 2013 – 2016

19. ఆచార్య మర్రెబోయిన జయదేవ్ – 2016 -2018

20. ఆచార్య జర్రా అప్పారావు – 2018 – నేటి వరకు

అతిరథ మహారథులు:

శాఖాధ్యక్షులే కాక తెలుగు శాఖలో అధ్యాపకులుగా పని చేసిన అతిరథ మహారథులు మరెందరో. వారిలో సంస్కృత అధ్యాపకులు (తెలుగు శాఖ) మధుసూదన షడంగి, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి, రాంభట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రి, మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ తదితరులు ప్రముఖులు.

తెలుగు అధ్యాపకులుగా/రీడర్లుగా మహామహులు పని చేశారు. డా. ఎక్కిరాల కృష్ణమాచార్య (వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ స్థాపకులు), వ్యాకరణ విజ్ఞాన ఖని దువ్వూరి వెంకట రమణ శాస్త్రి, డా. జోస్యుల సూర్య ప్రకాశరావు (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కూడా పని చేశారు). అత్తలూరి నరసింహారావు ప్రభృతులు తమదైన ముద్ర వేశారు.

శ్రీ దాశరథి, ఇతర దిగ్దంతులు

ఇతర శాఖలు:

డా. వెలమల సిమ్మన్న దూరవిద్యా కేంద్రంలో పని చేసి ఆంధ్ర సాహిత్య చరిత్ర గ్రంథం ప్రచురించారు. ఇతర శాఖలలో ఆచార్య ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు, ఆచార్య బి. సర్వేశ్వరరావు, ఆచార్య ఏ. ప్రసన్నకుమార్, ఆచార్య వై. సింహాద్రి ప్రముఖులు.

ఇక్కడి ప్రొఫెసర్లు ఇతర విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్స్‌లర్లు అయ్యారు.

1. ఆచార్య ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు – ఆం. ప్ర. సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాదు

2. ఆచార్య బి. సర్వేశ్వరరావు – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

3. ఆచార్య వై. సింహాద్రి – ఆంధ్రా, పాట్నా, బెనారస్ విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం (నాలుగు విశ్వవిద్యాలయాలు)

4. ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి – శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

5. ఆచార్య తూమాటి దోణప్ప – తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు

6. ఆచార్య బాలమోహనదాసు – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

7. ఆచార్య సుదర్శనరావు – విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు

8. ఆచార్య వి. వీరయ్య – విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు

9. ఆచార్య రామకృష్ణారావు – కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం

10. ఆచార్య నిరూపరాణి – నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం

11. ఆచార్య యస్.వి. సుధాకర్ – బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం

12. ఆచార్య యన్. వెంకటరావు – బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం

13. ఆచార్య యం.యస్. ప్రసాదరావు – గీతం యూనివర్శిటీ, బెంగుళూరు

14. ఆచార్య ఆర్. వెంకటరావు – నేషనల్ లా యూనివర్శిటీ, బెంగుళూరు

15. ఆచార్య ఏ.వి. ప్రసాద రావు – రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు

16. ఆచార్య జె. వి. ప్రభాకరరావు – రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు

17. ఆచార్య జె.బి.వి.జె. రాజు – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

18. ఆచార్య యం. జగన్నాథరావు – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

19. ఆచార్య జి. సుబ్రహ్మణ్యం – గీతం విశ్వవిద్యాలయం, విశాఖ

20. ఆచార్య రామ్‌జీ – బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం

21. ఆచార్య శిల్లం అప్పారావు – జె.ఎన్.టి.యు – కాకినాడ

22. ఆచార్య యస్. రామకృష్ణారావు – కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం

23. ఆచార్య వై. సత్యనారాయణ – సంజీవయ్య లా విశ్వవిద్యాలయం, విశాఖ

24. ఆచార్య ఏ. రాజేంద్ర ప్రసాద్ – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

25. ఆచార్య జార్జి విక్టర్ – నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం

26. ఆచార్య యం. జగన్నాథరావు – నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

27. ఆచార్య కె. చెంచురెడ్డి – ఛాన్స్‌లర్, రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఇడుపులపాయ

28. ఆచార్య తాతాజీ – రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు, హైదరాబాదు

[మరికొందరు నా పరిశోధనలో లభించని వారుండవచ్చు. ఈ విషయ సేకరణలో బాల్యమిత్రులు, ఆత్మీయులు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య సి.ఆర్. విశ్వేశ్వరరావు సహకారం అధికం].

అప్పటి మహారాష్ట్ర గవర్నరు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్ది గారితో రచయిత

కూర్మా వేణుగోపాల స్వామి:

కూర్మా వేణుగోపాల స్వామి (1903-1983) ఆంధ్రా యూనివర్శిటీ లా ప్రొఫెసర్‍గా చాలా కాలం పని చేశారు. థియేటర్ ఆర్ట్స్ విభాగం ప్రారంభించినప్పుడు గౌరవ ఆచార్యులుగా వ్యవహరించారు. మదరాసు ప్రెసిడెన్సీ గవర్నరు కె. వి. రెడ్డి నాయుడు కుమారులు. వేణుగోపాల స్వామి సుదీర్ఘ కాలం 1942-1964 మధ్య 22 సంవత్సరాలు రిజిస్ట్రార్‌గా వున్నారు. తండ్రి ఛాన్స్‌లర్‌గా, కుమారుడు రిజిస్ట్రార్‌గా వ్యవహరించడం ఆ విశ్వవిద్యాలయ చరిత్రలో విశిష్టత. కావలి జవహర్ భారతి కళాశాలలో గోపాలస్వామి కొంతకాలం వ్యవహారాలు పర్యవేక్షించారు. ఆయన శతజయంతి 2003లో వై.సి. సింహాద్రి (ఉపాధ్యక్షులు) ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 1977లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

యం.వి. రాజగోపాల్, ఐ.ఎ.ఎస్., 1964-65 మధ్య రిజిస్ట్రార్‌గా ఉన్నారు. డా. యం. గోపాలకృష్ణారెడ్డి 1967-1991 మధ్య సుదీర్ఘ కాలం రిజిస్ట్రార్. 1991 నుండి 1997 వరకు వైస్-ఛాన్స్‌లర్.

దువ్వూరి – తెలుగు వ్యాకరణ ‘సూరి’:

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో వ్యాకరణం అధ్యాపకులుగా చిరకీర్తి గడించిన ‘రమణీయ’ వ్యాఖ్యాత దువ్వూరి వెంకట రమణ శాస్త్రి. ఆయన చిన్నయ సూరి రచించిన బాల వ్యాకరణాన్ని కథాకథనంలాగా అనేక ఉదాహరణలతో అద్భుతంగా పాఠం చెప్పేవారు. సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాప్రపూర్ణ గ్రహీత.

విలంబి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. వీరిది తూర్పు గోదావరి జిల్లా మసకపల్లి గ్రామం. విద్యాభ్యాసం తాతగారు రామచంద్రుడు వద్ద జరిగింది. వివాహం 15 ఏళ్ళ వయసులో కోనసీమలోని అమలాపురం తాలూకా ఇందుపల్లిలో జరిగింది.

అప్పట్లో విజయనగర సంస్కృత కళాశాల ప్రిన్సిపిల్ గుదిమెళ్ల వరదాచార్యులు చాలా ప్రసిద్ధులు. వెంకటరమణ శాస్త్రి 1914లో ఆ కళాశాలలో విద్యార్థిగా చేరారు. అక్కడ , కిళాంబి రామానుజాచార్యులు, వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు వీరి అధ్యాపకులు. ‘కట్టు శ్లోకాలు’ – విచిత్రమైన సారస్వత క్రీడా ప్రవీణులు శాస్త్రి.

దువ్వూరి వెంకట రమణ శాస్త్రి

1918లో మదరాసు విశ్వవిద్యాయంలో విద్వాన్ పట్టభద్రులయ్యారు. 1923 నుండి 1941 వరకు 18 సంవత్సరాలు చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలో పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యులుగాను, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు గాను ఉన్నారు. మూడేళ్ళలో ఇద్దరు వి.సి.లు. ఒకరు రామలింగారెడ్డి, మరొకరు రాధాకృష్ణన్. బోర్డ్ ఆఫ్ స్టడీస్‍లో సభ్యులుగా చేశారు. 22 ఏళ్ళు ఓరియంటల్ కళాశాలల్లో పని చేశారు.

1941 జూన్‍లో వాల్తేరు యూనివర్శిటీ కాలేజి తెలుగు డిపార్ట్‌మెంటులో ఆనర్సు పండితులుగా నియమించబడ్డారు. అప్పుడు సూరి భగవంతం కళాశాల ప్రిన్సిపాల్. అప్పుడు పింగంళి లక్ష్మీకాంతం, గంటిజోగి సోమయాజి, మధుసూదన షడంగి అక్కడ అధ్యాపకులు. జపాన్ బారి బాంబు దాడి భయంతో యూనివర్సిటీని గుంటూరుకి మార్చారు. మళ్ళీ వాల్తేరుకు 4 ఏళ్ళకు మార్చారు. 1963లో శాస్త్రి గారు రిటైరయి విశాఖలో స్థిరపడ్డారు. 1972లో గుంటూరులో చిన్నయసూరి సంస్మరణోత్సవాలకు అతిథిగా వెళ్ళి అనారోగ్యం పాలై కుదుటపడ్డారు. తమ స్వీయ చరిత్రను సరళ సుందర వ్యావహారిక భాషలో వ్రాశారు. 23 ఏళ్ళు యూనివర్శిటీలో చేశారు.

1970లో కందుకూరు ప్రభుత్వ కళాశాలలో నేను పని చేస్తున్నప్పుడు వారు నెల్లూరులో ఒక సభకు వచ్చారు. నేను వారిని మా కళాశాలకు ఆహ్వానించి తీసుకొచ్చాను. మా ఇంట్లోనే బస. ఏది మాట్లాడినా వ్యాకరణ పరిభాషయే. వారి వయస్సుని బట్టి నా శ్రీమతి శోభాదేవి అన్నం మెత్తగా వండింది. ఆయన ఇలా చమత్కించారు: “అమ్మా! నాకు దంత్యములు పనికిరావు. తాలవ్యములు ఫర్వాలేదు. ఇది మరీ కంఠ్యంగా వుంది”. మా గురువు గారు అన్నం విషయంలో ఇచ్చిన సూచనను నేనామెకు చెప్పగా, జాగ్రత్తగా వండిన అన్నానికి ఆయన ఇచ్చిన కితాబు అది. అంతటి చమత్కారి వారు.

1976 మార్చి 6న కాకినాడలో 78వ ఏట గతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here