Site icon Sanchika

ఆచార్యదేవోభవ-27

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్య వైభవం:

[dropcap]శ్రీ[/dropcap] వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ప్రారంభించిన తొలి దశాబ్దిలో రాయప్రోలు సుబ్బారావు, భూపతి లక్ష్మీనారాయణరావు, పింగళి లక్ష్మీకాంతం, భద్రిరాజు కృష్ణమూర్తి ప్రభృతులు దిశా నిర్దేశం చేశారు. 1959 నుండి 1965 వరకు అది కొనసాగింది. 1965 జూన్‌లో జి.యన్.రెడ్డి శాఖ్యాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో పని చేసి వచ్చిన అనుభవంతో తెలుగు శాఖా పురోగతికి దృక్కోణం మార్చివేశారు. 1965-67 మధ్య తెలుగు ఎం.ఏ చేసిన నాకు ప్రత్యక్షానుభవం.

సహృదయతకు మారు పేరు:

జి.యన్.రెడ్డిలో విజ్ఞత పరోపకార లక్షణం మిక్కుటం. 1927 డిసెంబరు 23న చిత్తూరు జిల్లా మహాసముద్రంలో రైతు కుటుంబంలో జన్మించారు. 1946లో మదరాసు పచ్చయప్ప కళాశాలలో ఇంటర్ చేసి 1949లో మదరాసు విశ్వవిద్యాలయం బి.ఓ.యల్ (ఆనర్సు) చేశారు. తర్వాత తెలుగు సాహిత్యం పై ఆంగ్ల ప్రభావం అనే అంశంపై యం.లిట్ సంపాదించారు (1955). 1957లో అడ్వాన్స్డ్ కోర్సు ఇన్ లింగ్విస్టిక్సు దక్కన్ కాలేజిలో చేశారు.

మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగులో అర్థపరిమామంపై పరిశోధనకు డాక్టరేట్ పొందారు. ఆయన ట్యూటర్ (1950) స్థాయి నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి (1984-87) స్థాయికి ఎదిగారు.

ఉద్యోగ పర్వం:

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రస్థానం:

ఆ తరువాత యు.జి.సి ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. వీరి పర్యవేక్షణలో 40 మంది యం.ఫిల్, పి.హెచ్.డి పొందారు.

భాషా శాస్త్ర పరిశోధకుడిగా ఆయన అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.

తెలుగు శాఖలో 1966లో సెమినార్ పద్ధతి తొలిసారిగా ప్రవేశపెట్టారు. తొలి వక్తగా నేను బాల ప్రౌఢలు సాధింపని ప్రయోగ విశేషాలపై విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో 1966 సెప్టంబరు 5న ప్రసంగించాను.

1999లో లండన్‍లో రచయిత

వారి పరిశోధనా గ్రంధాలు:

  1. The Influence of English on Telugu literature (PhD Thesis)
  2. A Story of Telugu semantics (thesis) ముద్రితం 1966
  3. Selected Essays of C.P.BROWN
  4. Lectures on Telugu Studies.
  5. పొడుపు కథలు (1575 చిత్తూరు జిల్లా పొడుపు కథలు)
  6. భాషావిజ్ఞాన పరిఛయం
  7. ద్రావిడ భాషా విజ్ఞానం

సంపాదకత్వ బాధ్యతలు:

  1. తెలుగు నిఘంటువు (1973, సాహిత్య అకాడమీ)
  2. ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు (1978, సాహిత్య అకాడమీ)
  3. మాండలిక వృత్తి పదకోశం (1976 కుమ్మరం)
  4. తెలుగు పర్యాయపద నిఘంటువు (1987)

పరిశోధకులను, విద్యార్థులను, సహధ్యాపకులను ఎంతో గౌరవంగా, ఆదరంగా పలకరించి వారి బాగోగులు పరిశీలించే స్వభావం వీరిది. 1989 జులై 13న తిరుపతిలో కాలధర్మం చెందారు. వీరి ధర్మపత్ని సునీత తిరుపతి యస్.వి. ఆర్ట్స్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు.

సౌజన్యతా స్ఫూర్తి:

జ.యన్.రెడ్డి దూరదృష్టితో తన సహధ్యాపకలు తనతో సమానంగా ఆచార్య పదవు లలంకరించడానికి ఎంతో దోహదం చేశారు. తెలుగుశాఖలో పని చేస్తున్న జీరెడ్డి చెన్నారెడ్డి శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ డైరక్టరు అయ్యారు. కోరాడ మహాదేవశాస్త్రి అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసరు అయ్యారు. ఆచార్య కె. సర్వోత్తమరావు ‘జి.యన్.రెడ్డిగారితో నా అనుబంధం’ అనే చిరుగ్రంథంలో ఇలా ప్రస్తావించారు (ఉద్యోగంలో చేరిన కొత్తల్లో):

“నా గదికి జి.యన్.రెడ్డిగారు వచ్చి కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల గురించి వాకబు చేసి ‘ఎలాంటి సలహాలు గాని, ఆర్థిక సహాయం గాని మొహమాటం లేకుండా అడగండి’ అన్నారు. భార్యాభర్తలం ఉద్యోగులం కనుక నాకు ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పాను. వారెంతో ఆప్యాయంగా అడగడం నన్ను కంటతడి పెట్టించింది.”

తిరుపతిలో తెలుగు శాఖ నుండి వి.సి అయిన తొలి వ్యక్తి జి.యన్.రెడ్డి. అప్పట్లో వీరి పదవీ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వి.సి పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు శాఖకు వచ్చి కొంత కాలం పని చేశారు. నిగర్వి జి.యన్.రెడ్డి. వీరి హితైషులు జి.యన్.రెడ్డి సాహిత్య పీఠం ఏర్పాటు చేశారు.

1993లో నెల్లూరులో వర్ధమాన సమాజం వారిచే సన్మానం

మలితరం అద్యాపకులు

డా. మద్దురి సుబ్బారెడ్డి 1966 శాఖాధ్యక్షులు 1982-84
డా. గూడూరు నాగయ్య 1966 శాఖాధ్యాక్షులు 1984-86
డా. తుమ్మపూడి కోటేశ్వరరావు
డా. తమ్మారెడ్డి నిర్మల
డా. పి.సి. నరసింహారెడ్డి 1972 శాఖాధ్యక్షులు 1988-90
డా. కె.సర్వోత్తమరావు శాఖాధ్యక్షలు 1986-88, 1993-96
డా. కొలకలూరి ఇనాక్
డా. కేతు విశ్వనాధరెడ్డి
డా. పి. నరసింహారెడ్డి 1979 శాఖాధ్యక్షులు 1991-93, 1996-99
డా. యన్.జి.డి.చంద్రశేఖర్ 1979 శాఖాధ్యక్షులు 1990-91,1999-2002
డా. జె.ప్రతాపరెడ్డి 1979 శాఖాధ్యాక్షులు 2004, తర్వాత రిజిష్ట్రారు
డా. వి.చంద్రశేఖర రెడ్డి 1985 శాఖాధ్యక్షులు 2004-2006
డా. కె.మునిరత్నం 1985 శాఖాధ్యాక్షులు 2006-2008
డా. గల్లా చలపతి 1985 శాఖాధ్యాక్షులు 2002-2004
డా. గార్లపాటి దామోదరనాయుడు 1989 శాఖాధ్యాక్షులు 2008-2010
డా.కె.ఆనందన్ 1989
డా. కోసూరి దామోదరనాయుడు 1989 శాఖాధ్యక్షులు 2010-2012
డా. పేట శ్రీనివాసులురెడ్డి 1992 శాఖాధ్యక్షులు 2012-2014
డా. యన్. మునిరత్నమ్మ 1992 శాఖాధ్యక్షులు 2014-2016
డా. యస్.రాజేశ్వరి 1992 శాఖాధ్యక్షులు 2016-2017
డా. డి. మహలక్ష్మమ్మ 1992
డా. కె. శారద 1992
డా. మేడిపల్లి రవికుమార్ 1992 శాఖాధ్యాక్షులు 2017-2019
డా. ఆర్.రాజేశ్వరమ్మ 2009 శాఖాధ్యాక్షులు 2019-2021

అస్మద్గురు పర్యవేక్షకులు:

1973-76 మధ్యకాలంలో నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలాధ్యాపకుడిగా పార్ట్ టైం స్కాలర్‌గా కందుకూరి రుద్రకవిపై పరిశోధనకు చేరాను. అప్పుడు నాకు పర్యవేక్షకులు డా. జాస్తి సూర్యనారాయణ (రీడరు). వారు 1956 సెప్టెంబరులో వెంకటేశ్వర విద్యాలయ తెలుగు శాఖ లెక్చరర్‌గా చేరారు. ప్రాచ్య భాషాలపై పట్టు. సుప్రసిద్ధ కవి ఏటుకూరి వెంకట నరసయ్యకు మేనల్లుడు.

సూర్యనారాయణ వద్ద నేను స్కాలర్‌గా చేరే నాటికి మరో ఇద్దరు బి. భాస్కర చౌదరి, మల్లెల గురవయ్య పరిశోధకులు. నేను మూడోవాడిని. రీడరుగా వున్న వారు ముగ్గరికి మించి పర్యవేక్షణకు విశ్వవిద్యాలయం అంగీకరించదు. 1976 ఆగస్టులో సిద్ధాంత వ్యాసం సమర్పించాను. డిసెంబరు 31న ముఖాముఖి.

సూర్యనారాయణ 1981-82 మధ్య శాఖాధ్యక్షులు. దానితో బాటు కర్నూలులో ఏర్పాటు చేసిన పి.జి.సెంటరుకు స్పెషల్ ఆఫీసరు. వారు స్వయంగా ఒక నవల, మరో 8 పరిశోధక గ్రంథాలు వ్రాశారు. వీరి వద్ద 9 పి.హెచ్.డిలు 16 యం.ఫిల్ లు వచ్చాయి. 2008లో స్వల్ప అనారోగ్యంతో కాలధర్మం చేశారు. వీరి అల్లుడు గారపాటి దామోదరనాయుడు తెలుగు శాఖాధ్యక్షులుగా చేశారు. తర్వాత తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకాధికారి. సూర్యనారాయణ వద్ద పి.హెచ్.డి పొందిన తొలి పరిశోధకుడిని నేనే. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో A Study of Telugu Compounds మీద సూర్యనారాయణ భద్రిరాజు కృష్ణమూర్తి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఆ విశ్వవిద్యాలయంలో వీరిదే తొలి పి.హెచ్.డి.(ముద్రితం).

ఢిల్లీ ఆకాశవాణిలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ దేవెగౌడతో రచయిత

ఆచార్య మద్దురి సుబ్బారెడ్డి (1937 జూలై):

సుబ్బారెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి బంధువర్గంలో వారు. నెల్లూరు వి.ఆర్.కళాశాలలో 1963లో ఉపన్యాకులుగా చేరారు. 1966లో విశ్వవిద్యాలయాధ్యక్షులు. ఆచార్య కోరాడ మహదేవశాస్త్రి, తర్వాత జి.యన్.రెడ్డి వీరికి పర్యవేక్షకులు. ఆధునికాంధ్ర కవిత్వంపై జాతీయోద్యమ ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి పొందారు. ఆ గ్రంథం ముద్రించారు. 1982-84 మధ్య శాఖాధ్యక్షులు. వీరి పర్యవేక్షణలో 14 పి.హెచ్.డిలు, 17 యం.ఫి‌ల్‌లు రూపొందాయి. వ్యక్తిగా ఆయన సౌజన్యమూర్తి. ఆకాశవాణి అనంతపురం అనౌన్సర్ ఉద్యోగనియమాక కమిటీలో వారితో పారదర్శకంగా ముగ్గురిని సెలక్టు చేసాము (1991). ఆయన యన్.వి.యూనివర్సిటీ సెనేట్ సభ్యులు. ఆంధ్రసాహిత్య అకాడమీ సభ్యులు. వారి కుమారులు చెన్నారెడ్డి చిన్న వయస్సులో మరణించాడు. వారిని ఖేదానికి గురి చేసింది. సుబ్బారెడ్డి ఉస్మానియాలో ఎం.ఏ తెలుగు చేశారు.

తమ పరిశోధనా గ్రంథాన్ని సుబ్బారెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి రాఘవమ్మ దంపతుల కంకితమిచ్చారు (1982). “ఇతర భారతీయ భాషల్లోని జాతీయోద్యమ కవితా స్వరూపాన్ని ఆవిష్కరించే ప్రామాణిక గ్రంథాలు రచించడానికి ఈ గ్రంథమొక ‘మోడల్’గా కూడ ఉపకరించగలదని నా విశ్వాసం” అని ముందుమాటలో ఆచార్య జి.యన్.రెడ్డి ప్రస్తుతించారు. ఈ సిద్ధాంత గ్రంథం తెలుగులో వ్యావహారికంలో వ్రాసిన తొలి గ్రంథమని – డా. సి.నారాయణ రెడ్డి ప్రశంసించారు. 400 మంది కవులను, వారి కవితలను సుబ్బారెడ్డి ఇందులో అధ్యయనం చేశారు.

Exit mobile version