Site icon Sanchika

‘ఆదికావ్యంలో ఆణిముత్యాలు..’ – వ్యాస పరంపర – ప్రకటన

[dropcap]రా[/dropcap]మాయణం గురించి, రాముడి గురించి సంచికలో మరో కొత్త వ్యాస పరంపర.

~

రామాయణం తెలియని భారతీయుడుండడు.

కానీ ఎంతమందికి రామాయణం తెలుసు?

ప్రపంచంలో రామాయణం గురయినన్ని దుర్వ్యాఖ్యానాలకు మరే గ్రంథం  గురికాలేదు.

రాముడి గురించి ఉన్నన్ని అపోహలు మరే పురాణ పురుషుడి గురించి లేవు.

ఎవరి జ్ఞానాన్ని అనుసరించి వారు,  ఎవరి సంస్కారాన్ని అనుసరించి వారు, ఎవరి ప్రయోజనాలను అనుసరించి వారు, రాముడి గురించి, రామాయణం గురించి మాట్లాడతారు. ప్రాంతాన్నిబట్టి, కాలాన్ని బట్టి మారుతున్న రామాయణంలో ఏది అసలు రామాయణం? ఎవరు అసలు రాముడు?

ఎలాగయితే, వేదాన్ని అర్ధం చేసుకునేందుకు షడంగాలున్నాయో, అలాగే, రామాయణాన్ని అర్ధం చేసుకునేందుకు ఆధారాలు రామాయణంలోనే వున్నాయి. ఆ ఆధారాల ద్వారా రామాయణాన్ని విశ్లేషించే ప్రయత్నం ఇది.

  కార్టూన్లు, బొమ్మల కథలు, ఆధునిక టీవీ సీరియళ్ళు చెప్పేదే రామాయణమని నమ్మే తరాలకు  అసలయిన రామాయణాన్ని, అసలయిన రాముడిని ఉన్నదున్నట్టు, క్షీరనీర న్యాయాన్ని పాటిస్తూ వివరించే వ్యాస పరంపర.. సంచికలో…

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు..’

రచనః ప్రముఖ రచయిత, శ్రీ వేదాంతం శ్రీపతి శర్మ

వచ్చే వారం నుంచి..

Exit mobile version