ఆజ్ఞ మేరకు!

0
3

[గిద్దలూరు సాయి కిషోర్ గారు రచించిన ‘ఆజ్ఞ మేరకు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

సూర్యరశ్మి ఉదయిస్తు
నిద్రను లేపుతూ
నువ్వు అలానే నిద్రకు బానిసైతే
నీ విజయ కెరటం
వెనకాలే ఓ మూలన పడుతుంది
ఇంకెందుకు అలానే కళేబరంలా
పడిపోయావు లేవ్వు మరి
దినకరుడుని దర్శించుకో
లేచి నడువు నీ మెదుడుకు
పదునుపెడితే తప్ప
నువ్వు అనుకున్న
ఏ విజయమైనా సాధించగలవు
బయలుదేరు నీ పయనం ఆపద్దు
శ్వాస ఉన్నంత వరకే కదా
ఈ విజయాలు, స్నేహాలు
తరువాత నువ్వెవరు నేనెవరినో
ఇక వెళ్ళొస్తా మరి నాకు వేళయింది
యమధర్మరాజు గారు
కబురు పంపారు
ఇట్లు నీ మిత్రుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here