[శ్రీ ఇంద్రగంటి శ్రీనివాస శాస్త్రి రచించిన ‘ఆకాశంబున నుండి..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]మే[/dropcap]డమీద నిలబడ్డ మెరుపుతీగెను చూసి
దడదడ వచ్చిన జడివాన
తడిసిన గుడిసెలో కమ్ముకున్న గుబులును చూసి
వెలవెలబోతూ వెలిసిపోయింది
మనుషుల సేద తీర్చడానికి
జల్లులా విచ్చేసిన వర్షం
మనసులలోని కుళ్ళుని చూసి
వెల్లువై పొంగింది ఉగ్రరూపంతో