[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘ఆకాశంలో తలుపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నిం[/dropcap]గిలోకి తలెత్తి చూస్తూ ఉన్నా
నీలి రంగు తెర పరచినట్టు లేదూ
కల్మషం లేని ఆకాశం ఖాళీగా ఉందా
నిశితంగా చూడు పరిశీలనగా చూడు
ఆకాశంలో తలుపు కనిపిస్తోంది
తలుపు అంటోంది నా తలపులో
ఉన్న వారికే కనిపిస్తానంటు
తడితే తెరుచుకుంటుందట నింగి ద్వారం
విశ్వాంతరాళంలోని దివ్య శక్తి
ఆ తలపు గుండా నీ తలలో
చేరి దైవత్వం నింపుతుంది నీలో
ఎటు చూడూ దివ్యానందం
అపుడే నీ తలలో తలుపు తెరుచుకొని
మానవత్వం దైవత్వం ఒకటేనని
గుడి గంటలు నీ గుండెలోనే ఉన్నాయని
అవి మోగితే దైవం దిగి వస్తుందని
ఆకాశంలో తలుపు తెలిపింది
ఆ తలుపును చేరాలంటే నీవు
చెడు తలపులు వదిలి ప్రేమను
పది మందికి పంచాలి ఓ నరుడా