సంచికలో సైన్స్ ఫిక్షన్ అనువాద నవల ‘ఆరోహణ’ త్వరలో – ప్రకటన

0
1

[dropcap]సం[/dropcap]చికలో మరో సైన్స్ ఫిక్షన్ నవల అనువాదం ధారావాహికంగా ప్రచురితమవనున్నది.

శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవల అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ నవల హిందీలోనూ, మరాఠీలోనూ అనువాదమై పుస్తక రూపంలో వెలువడింది.

ఇప్పుడు తెలుగులో సంచిక మాసపత్రికలో ధారావాహికగా రానున్నది.

~

‘ఆరోహణ’ మామూలు సైఫి నవల కాదు. పాఠకులకు చిరపరిచితమైన గ్రహాంతర ప్రయాణాలు, వికృత ఆకారాలలో ఉండే మానవ వ్యతిరేక గ్రహాంతరవాసుల క్రూరత్వాలు ఈ నవలలో లేవు. సైన్స్ ఫిక్షన్ లోనూ ఒకే మూసలోని ఇతివృత్తం కాకుండా భిన్నమైన ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు రచయిత్రి.

ఈ నవలలో –  మానవజాతి భూమిని వదిలి వేరే సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన గ్రహంలో స్థిరపడుతుంది. స్త్రీపురుషులు వేర్వేరు ప్రపంచాలలో జీవిస్తారు. మనుగడ కోసం, పునరుత్పత్తి కోసం స్త్రీపురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడకుండా, ఒకరికొకరు తెలియకుండానే, రెండు జాతులుగా జీవిస్తారు. అవసరమైనప్పుడు, క్లోనింగ్ ద్వారా కొత్త జీవిని సృష్టించవచ్చు, శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నా, సమర్థవంతంగా పనిచెయ్యకపోయినా, దానిని పూర్తిగా కొత్త భాగంతో భర్తీ చేయవచ్చు. ముసలితనాన్ని వద్దనుకుని యవ్వనంలోనే ఉండిపోవచ్చు.

ఈ నవలలో, ఈ ఊహ అన్ని సాధ్యమైన అంశాలతో మన ప్రస్తుత ప్రపంచానికి సమాంతరంగా సృష్టించబడింది.

ఒక మరణంతో ప్రారంభయ్యే ఈ నవలలో, ఆ చావు వల్ల – శతాబ్దాల పాటు అత్యంత బలహీనంగా ఉన్న సామరస్యం నశించి – ఇరు జాతులు ఒత్తిడికి లోనవుతాయి. సహజంగానే స్త్రీలు పురుషులను అనుమానిస్తారు, పురుషులు దానిని మహిళల పన్నాగంగా భావిస్తారు. ఇరువైపులా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి..

తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిదాయకం!

~

చదవండి, చదివించండి

సంచిక మాసపత్రికలో ఆగస్టు 2024 నుంచి

‘ఆరోహణ..’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here