Site icon Sanchika

ఆశ ఆవిరై

[dropcap]వె[/dropcap]చ్చని గుక్కతిప్పని ఆవిరిని చూసి
ఆకాశం హత్తుకొని
భుజాన మోస్తూ ఊర్లన్నీ తిప్పుతూ
పచ్చదనం చూపింది
కొండల్ని పరిచయం చేసింది
పొలాల్లో తిప్పింది
పట్నం సంధుల గుండా
పల్లెటూర్లని చూపింది.

నల్లని మేఘమై
కురిసే ఈడు వచ్చాక
భుజం నుండి దించాలని
చల్ల గాలిని తోడు రమ్మని పిలిచింది.

ఆవిరి వేడికి నిద్ర కరువైన గాలి
ఒక్క ఉదుటున విసురుగా కదిలి
మబ్బు ఒళ్ళు కందిపోయి
కన్నీళ్లతో మనసు చెదరి
ఎటు వైపుకో కొట్టుకోపోయింది.
తుప్పరగా, చిరుజల్లుగా
నేల పాదాన్ని తాకి
తృప్తి లేకుండానే తనువు చాలించింది.
ఊరు, పొలం, పల్లె, పట్నం
ఎండిన గొంతులతో
ఆవిరైన ఆశతో
బాధ ముసురు పట్టి
కన్నీరు వానతో
ఆకాశం వైపు చూస్తున్నాయి.

Exit mobile version