Site icon Sanchika

ఆశ

[dropcap]ఎ[/dropcap]గురవే కోయిలా ఎగురవే కోయిలా
ఎగిరిపో ఎగిరిపో స్వేచ్ఛగా ఎగిరిపో
చెట్టె నీకూ గూడు, గూడె నీకూ నీడ
ఆ నీడే చాలునే నీబోటి జీవులకు ॥ ఎగురవే ॥

మేడతో మిద్దెతో కరువు తీరదు మాకు
మమతానురాగాలు రావు మా జోలికి
బుడగలాంటి బ్రతుకు కెందుకే ఈ ఆశ ॥ ఎగురవే ॥

రెక్కలున్నా నీకు ఏపూటదాపూటే,
శక్తిలేని మాకు మితిమీరినా కాంక్ష
నీలాగే రెక్కలూ మాకుంటే?
మానవుడే సృష్టికీ ప్రతిసృష్టి చేస్తాడు?! ॥ ఎగురవే ॥

Exit mobile version