[dropcap]గా[/dropcap]లి నుండి బూడిద తీసే
స్వామిని అంతా ఆడిపోస్తారు
శూన్యం నుండి శుష్క సంపద
చూపే నేతని ఏమీ అనరు
వంగి వంగి సలాము చేస్తారు
మౌనంగా ఉండే స్వామిని
మోసగాడు అంటారు లోకులు
మాటల గారడి చేసే బడా నేతను
గద్దె ఎక్కించి గద్దల రాజ్యం తెస్తారు
వేదాంతం చేప్పే యోగిని
ఊక దంపుడు అని అంటారు
వాగ్దానాలు చేసి ఓట్లు గుంజేవాడిని
గొర్రెల మాదిరి వెంట పడతారు
అబ్రకదబ్ర అబ్రకదబ్రా.. గారడి
అంతా ప్రజాస్వామ్యానికి ఆరడి
స్వాముల్ని యోగుల్ని వదిలేసి
నేతల భాగోతం నేత్రాలతో చూడు సోదరా