Site icon Sanchika

కీ.శే. ఆచార్య వెలమకన్ని భరద్వాజ గారి స్మృత్యర్థం నిర్వహించే కథల పోటీకి ఆహ్వానం – ప్రకటన 2

[dropcap]“ఏ[/dropcap]దో ఒక ఉత్తమ సందేశం మనసుకు హత్తుకొనేటట్లు చేయడానికి కథకన్నా ఉత్తమమైన సాధనం వేరొకటి లేదు”. సామాజిక స్పృహగలిగి, సాహితీ విలువలతో కూడిన కథలను రచయిత(త్రు)ల నుండి ‘విశాఖ సాహితి‘ ఆహ్వానిస్తోంది.

ఈ మూడు బహుమతులు కీ.శే. ఆచార్య వెలమకన్ని భరద్వాజ గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేయబడినవి. సాధారణ ప్రచురణకు ఎన్నికైన పది కథల రచయిత(త్రు)లకు ‘విశాఖ సాహితి’ పుస్తకాలు బహూకరిస్తుంది.

సౌలభ్యం కోసం కొన్ని నియమాలు:

  1. కథల నిడివి సుమారు 1000 నుండి 1200 పదాల వరకు ఉండాలి.
  2. కథలను యూనికోడ్ లో కాని, ఎమ్మెస్ వర్డ్ (MS Word) లో కానీ పంపాలి. ఒక రచయిత ఒక కథ మాత్రమే పంపాలి.
  3. కథలు వాట్సాప్ లో గాని, ఈమెయిల్ కి గాని పంపాలి. వాట్సాప్ నంబర్ 8464935739; ఈ మెయిల్: sailisp@gmail.com
  4. ఇతివృత్తం తెలుగువారి జీవన స్రవంతిలోనిదై ఉండాలి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల చిత్రణ వాంఛనీయం.
  5. కథ మొదటి పేజీ మీద ‘విశాఖసాహితి జన్మదిన ప్రత్యేక సంచిక కథల పోటీకి’ అని రాయాలి. రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, రచయిత వివరాలు వేరే పేజీలో ఉండాలి. కలం పేరు ఉపయోగించినప్పటికీ పూర్తి పేరు పేర్కొనాలి.
  6. కథ దేనికీ అనువాదంగాని, అనుసరణగాని కాదని, ఇతర సామాజిక మాధ్యమాలలో ప్రచురింపబడలేదని హామీ పత్రం జత చేయాలి.
  7. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన కథలు ‘విశాఖసాహితి’ జన్మదిన సంచిక (ఏప్రిల్, 2023) లో ప్రచురిస్తాము.
  8. కథలు పంపుటకు ఆఖరి తేదీ: 5, మార్చి 2023; రాత్రి 10 గం.ల వరకు (10 PM, IST).
  9. కథల ఎంపిక విషయంలో సంపాదకవర్గానిదే తుది నిర్ణయం.
  10. మొదటి మూడు బహుమతులు గెల్చుకున్న కథకులు, 4-4-2023 తేదీన జరుగబోవు ‘విశాఖ సాహితి’ వ్యవస్థాపక దినోత్సవ సభకు విచ్చేసి, బహుమతులు స్వీకరించగోరుతున్నాము.
  11. స్వీకరించని కథలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి పంపబడవు.

కార్యదర్శి, విశాఖ సాహితి

Exit mobile version