Site icon Sanchika

అడవి తల్లి ఆవేదన!!

[dropcap]పు[/dropcap]డమితో పాటు పుట్టిన మమ్మల్ని
మీరు పుట్టి నాశనము చేస్తున్నారు
మేము మానవులకు ఎంత చేస్తున్నాము
మేమే లేకపోతే మీకు ప్రాణవాయువు ఉన్నదా?
అలాంటి మా ప్రాణాలు తీస్తున్నారు!!
మేము మీకు ఆశ్రయాలు కలిపిస్తే
భూమి మీద మమ్మల్ని లేకుండా చేస్తున్నారు!!

రోగాలకు ఔషధములు ఇస్తే
మాకే రోగాలు తెప్పిస్తున్నారు!!
మా బిడ్డ లైన అడవి ప్రాణులు
ఆహారము లేక అల్లాడుతున్నాయి
మీరేమో పంచభక్ష  పరమాన్నాలు తింటున్నారు!!
మమ్మల్ని కూకటివేళ్లతో తొలగిస్తున్నారు
మీరు మాత్రం దినదిన వృద్ధి చెందుతున్నారు!!

ఒకటి గుర్తుపెట్టుకోండి!!
మేమే లేకపోతే మీకు కష్టాలు తప్పవు
భూతాపం పెరిగి మీ ప్రాణాలను హరించును
మేము లేకపోతే వర్షము లేదు
వర్షము లేకపోతే ఆహారము లేదు
ఆహారము లేకపోతే
మీ ప్రాణము లేదు
ఔషధములు దొరకక అనారోగ్య పాలగుదురు
క్రూరజంతువులకు ఆహారము లేక మీ నివాసాలకు చేరును
పర్యావరణము దెబ్బతిని ప్రాణాలు పోవును

ఆవేదన ఆలకించండి!!
నాకు ప్రాణం పోయండి
మమ్మల్ని రక్షించండి
మిమ్మల్ని రక్షిస్తాము.

Exit mobile version