Site icon Sanchika

అద్దంలో బొమ్మ

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అద్దంలో బొమ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]దుః[/dropcap]ఖమైనా మరి సంతోషమైనా
చీకటి వెలుగుల కవిత్వం
పోషించే పాత్రలు మనిషిలో ఎన్నో

నవ్వులన్నీ పువ్వుల గుబాళింపు
బాధలన్నీ వెతల పోహళింపు
అద్దంలో భావోద్వేగాల కన్నీళ్లు

అద్దంలో బొమ్మ నిజమేనా
ఔనో కాదో తేల్చేది
అద్దం ముందుండే నిజ రూపమే కదూ

మనసున్నా లేకున్నా అద్దంలో అందం
చొరవున్న చెట్టూ పుట్టా రాయి
కదిలీ కదిలించే కవలలు

ఒక మనిషి బొమ్మలు రెండు
అద్దం ముందర నిజం అద్దంలో
నీవైనా నేనైనా వస్తువైనా దృశ్య ప్రతిబింబం

Exit mobile version