Site icon Sanchika

అదే పాట ప్రతీ చోట…

~

అవును అదే పాట…. అదే గొంతు…. వినిపిస్తూనే వుంది

నా చెవుల్లో నా మదిలో ఎక్కడెక్కడో అన్నిచోట్లా నిరంతరంగా ఒక ఝరిలా

మనిషి శాశ్వతం కాదు కానీ ఆ మనిషిలోని ప్రతిభ ఏదైనా స్థిరంగా ఉండిపోతుంది

ఇంతమంది రసజనుల గుండెల్లో చోటు దక్కించుకోడం ఎంతమందికి సాధ్యపడుతుంది

అది గాయకుడు ఒక్క బాలుగారికి దక్కిన గొప్ప అదృష్టం.

ఆయనకు మాత్రమే కాదు వినేవారికి పాట అంటే ఇష్టపడే వారికీ

పాటతో బాధను మరిచిపోయేవారికీ పాటతో ఉత్సాహం పొందేవారికి

పాటతో ఆరాధన చేసేవారికి పాటను సందేశంగా పంపేవారికి ఒక సాంత్వన.

ఉద్యోగంలో ఒత్తిడి జీవితంలో వచ్చే సమస్యల ఒత్తిడి విభేదాల ఒత్తిడి

ప్రతివాళ్ళు ఎదురుకొంటూ సతమత మవుతూ చిరాకుతో ఉంటే

ఒక బాలూ పాట ఔషధమై వారిని సేదతీర్చుతుంది.

మనిషికి జీవితంలో వచ్చే అన్నిదశలకు ఆయన పాడిన పాట వుంది

దాన్ని వింటూ గుర్తుకు తెచ్చుకుంటే ఎంత హాయి సంతోషం తోడు అనిపిస్తుంది

పాటతో మనిషిలో ఎంతటి మార్పు తీసుకురావచ్చో ఎన్ని ఉదాహరణలో.

అనుభవించిన ప్రతి ఒక్కరికి తెలుసు ‘పాడుతా తీయగా’ వింటూ నిద్రపో హాయిగా

‘స్వరాభిషేకం’ చేస్తున్నాం ఆ జల్లులో తడవండి నిలువెల్లా చల్లగా

ఝుమ్మను నాద నినాదాలు దివిలో విరిసిన పారిజాతాలు సిరి మల్లి పూలు ఎన్ని సుగంధాలో.

ఒకటికాదు వేవేల నవరస భరితాలు మదిని కొల్లగొట్టు మధుర గీతాలు

చెప్పేకొద్దీ వూరే ఊటలు ఆ మహాగాయకుడి గొంతులో మంత్రజాలాలు

మైమరిపించే ఇంద్రజాలాలు భక్తులకు అభిమానులకు తనివితీరని

మనసునిండని అనుబంధాలు మరపురాని రసగుళికలు గుప్త నిధులు

దటీస్ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యంగారు.

(సరిగా రాసేనా? అమ్మో తప్పువస్తే దిద్దువారు గద్దిస్తారు.)

Image Courtesy: Internet

Exit mobile version