అదృష్టవంతులు

0
2

[box type=’note’ fontsize=’16’] “ఏ పని నైనా సాధించాలంటే దానికి ముందు ప్రణాళిక కావాలి. లేకుంటే అనుకున్న పని ప్రణాళిక ప్రకారం సాగక ముందు చేయాల్సింది వెనుక, వెనుక చేయాల్సింది ముందూ చేస్తూ ఎంత కష్టపడ్డా పనిలో విజయం సాధించలేకపోతూ వుంటారు” అంటున్నారీ వ్యాసంలో ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు [/box]

పద్యము (భారతము నుండి):

హయముల జంపి సూతుదెగటార్చి
పతాక ధరిత్రి గూల్చి ద,
ప యుతము గాగ వాని ఘన
బాహులు రెండును ద్రుంచి యెంత యున్.
రయమున ధేరు చక్కడిచి రాజు
లు రాజ తనూజలుంగడున్
భయమున దూలిపోవబలు భల్ల
హతిం దల డొల్ల చేసినన్

భావము:

భారత యుద్ధంలో అభిమన్యుడు ముందుగా శల్యుని తమ్ముని గుఱ్ఱాలను చంపివేశాడు. వెను వెంటనే సారధిని కండతుండేలుగా నరికి వేశాడు. ఆ పయిన పతాకను నేలకు కూల్చాడు. అటు పిమ్మట వింటిని వెక్కసంగా లాగుతున్న వాని రెండు బాహువులు దేహం నుండి తొలగి పడేట్టుగా ఖండిచాడు. ఎంతో వేగేంతో రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. రాజులూ రాజుల కొడుకులూ పారిపోతూ వుండగా వారు తలను ఒకగట్టి బల్లెం దెబ్బతో దొర్లుకుంటూ పోయేట్టుగా తెగనరికాడు.

అందువల్ల మనం గ్రహించే ముఖ్యమైన రాజనీతి ఏమంటే ఏ పని నైనా సాధించాలంటే దానికి ముందు ప్రణాళిక కావాలి. లేకుంటే అనుకున్న పని ప్రణాళిక ప్రకారం సాగక ముందు చేయాల్సింది వెనుక, వెనుక చేయాల్సింది ముందూ చేస్తూ ఎంత కష్టపడ్డా పనిలో విజయం సాధించలేకపోతూ వుంటారు.

ఫ్రాన్స్ దేశం స్వయంప్రతిపత్తి కలిగిన దేశంగా, మంచి ప్రాశస్థ్యం కలిగిన దేశంగా ప్రాచీన యూరప్ చరిత్ర వెల్లడిస్తోంది. ‘చిలీ’ లోని ‘కోపియాపో’ అనే గ్రామం ‘శాన్‌ఓస్‌’కు దగ్గరగా వుండేది. అది రాగి, బంగారు గనులకు చాలా ప్రాశస్త్యం కలిగి భూగర్భ వనరులకు పెట్టింది పేరు. ఇక్కడ గనులు సుమారు 2040 అడుగుల లోతు కలిగి ఉండేవి. “చెలీన్” అనే కంపెనీ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ కార్మికులకు ఉపాది అవకాశాలను అందజేస్తూ వుత్పత్తి రంగంలో చాలా అభివృద్ధి సాధించారు.

భూగర్భ గనులతో వుత్పత్తులను వెలికి తీయడానికి రెండు మార్గాల ద్వారా పని నిర్వహిస్తూ వుంటారు. మొదటిది కార్మికులు నడక మార్గము ద్వారా లోనికి ప్రవేశించి వారి పని నైపుణ్యాలతో వుత్పత్తుల వెలికితీతలను నిర్వహిస్తూ వుంటారు. రెండవది హలేజ్ రోప్ మార్గము ద్వారా ఖనిజమూలాల్ని ఉపరితలానికి చేర్చడానికి టబ్బుల ద్వారా, రోప్ మార్గము ద్వారా హాలర్ సహాయంతో వెలుపలికి బంకర్ల ద్వారా లోడింగ్ చేయబడుతూ ఖనిజ సేకరణ జరుగుతుంది. ఇందులో పని చేసే వారి ఉద్యోగ ధర్మాలను బట్టి వేరు వేరు పేర్లతో పిలవబడుతుంటారు. క్రింది స్తాయి నుంచి పై అధికారి వరకూ చూస్తే.

బదిలీ వర్కర్ (స్థిర వుద్యోగికి బదులుగా పని చేసే వ్యాక్తి), ఫిల్లర్ (ఖనిజాన్ని మోసి నింపే స్థిర వుద్యోగి) షాట్ ఫైరర్ (కొండల్ని మందు గుండు సామాగ్రి దగాయించి పేల్చే వ్యక్తి) సర్థార్ (ఓ జిల్లా ఖనిజ సంపదకు పని పాట్లు చేయించే సూపర్‌వైజర్, ఓవర్‌మెన్ ఓ షిప్ట్‌లో పని చేయించే కార్మిక అధికారి, హెడ్ ఓవర్‌మెన్ (షిప్ట్‌లో పని చేసే అందరి సూపర్‌వైజర్ల పై అధికారి), అండర్ మేనేజర్ (రెండవ తరగతి గని యజమాని), సేఫ్టీ అండర్ మేనేజర్ (రక్షణ వ్యవహారాల శాఖ 2వ తరగతి యజమాని), మైన్ మేనేజర్ (సర్వ అధికారాలు ధ్రువీకరింపబడిన మైను యజమాని) ఉంటారు. వీరిలో మరో ముఖ్య అధికారి మైన్ సర్వేయర్. ఈతడు గనిలో ఏ రోజుకా రోజు ఎంత మేర తవ్వాలో నిర్ధేశించి తెల్ల రంగుతో గుర్తులు విధించి మైను సెఫ్టీ విషయాలు ఎప్పటికప్పుడు ప్లాను ద్వారా విశదీకరించే మైను అధికారి. మైనులో ఎప్పటికప్పుడు ఇనుప గర్డర్లతోను, కర్ర దుంగలతోను ఉపరి రక్షణ ఎప్పటికప్పుడు నిర్వహింపబడుతూ వుంటూంది. ఎందువలన అంటే భూగర్భ గనులలో ‘పని’ కార్మికుల దిన దినగండం. అరవై సంవత్సరములకు ఉద్యోగ విరమణ. సూక్తి. కార్మికులకు కంఠోపాఠం.

ఆ మైన్‌లో ఓ దుర్ధినం 33 మంది సాధారణ విధి నిర్వహణకు భూగర్భానికి పంపబడ్డారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎక్కడ నుండో పెద్ద హాహాకారాలు, కొండ కుప్పకూలిన శబ్దం. క్రింద కార్మికులు పైకి పరుగులు తీయడానికి అరుపులు. కానీ అధికారుల నిర్లక్ష్య వైఖరి. వెంటనే ఓ పెద్ద ఉదృతమైన శబ్ద వాతావరణం. ఒక వేళ బండ కూలి పడితే ఏ ఒక్కడు మిగిలి బట్టకట్టేది లేదు.

కాని భగవంతుని అనుగ్రహ వీక్షణాల వల్ల కూలింది ఓ కొండ చూర మాత్రమే. అందువల్ల ఘోరకలి తప్పింది. పై 33 మందిలో శాన్ భెస్ అనే 20 సంవత్సరాల వయుస్కుడు మాత్రం కుర్రాడు. మిగిలిన వాళ్ళంతా వయసు మళ్ళిన నడిమ మధ్య వయస్సు వాళ్ళు. దాదాపు 70 పని దినాలు పోయిన పిదప వారందరూ రక్షింపబడి ఉపరితలానికి తీసుకురాబడినారు.

2042 అడుగులలోతు నుండి 33 మందిని క్లిష్ట పరిస్థితులలో క్షేమంగా పైకి భూమట్టానికి చేర్చడం అసలు జరిగే పనేనా.

అసలు వాళ్ళు ఏ పరిస్థితులలో అందరూ ఒక్కు చోట గుమిగూడి వుండగలిగారు.

చిమ్మచీకటిలో బురద మట్టి గులాయిలో అసలు వాళ్ళు బ్రతికి వున్నారా లేక తనువులు చాలించారా అనేది ప్రపంచం నలుమూలలా లక్ష డాలర్ల ప్రశ్న.

మొదటి వాళ్ళని రక్షించడానికే చిలీలో ఏ రకంగా రక్షణ ప్రారంభిచాలి ఇది ప్రపంచంలో ఓ మరువలేని విషాద ఘట్టం. 70 రోజులు 33 మంది ప్రణాలును ఫణంగా పెట్టి రక్షించుకోడానికి పడ్డ అవస్థలు.

ఒక వైపు యునైటైడ్ స్టేట్స్ ఆటామిక్ రిసెర్ట్ సెంటర్ వారి సహాయ సహకారాలు, మరో ప్రక్క అన్ని జీవిత భీమా సంస్థలు ముఖ్యంగా చిలీ ప్రాంతం వాళ్ళు 33 మందిని రక్షించాలని ఏక త్రాటిపై చేతులు కలిపి సహాయ సహకారాలను అందించారు.

ప్రపంచం నలుమూలలా అందరూ రూఫ్ కూలిపోయాక ఆ 33 మంది బ్రతకడం అసాధ్యం అని భావించారు.

చిలి ప్రపంచదేశాలలో పటంలో ఓ చిన్న గ్రామం లాంటిది. వీళ్ళకి గల కొద్దిపాటి మానవ వనరులతో వీళ్ళని రక్షించడం సాధ్యమా.

అవును సాద్యమే.

చిన్న విషయం మానవ వనరులలో వుండవచ్చుగానీ మానవ హృదయాలలో కాదు. మానవ ఆలోచనా శక్తికి చిన్నతనం వుండదు.

ఇంకా అక్కడి వాళ్ళందరూ వాళ్ళని రక్షించగలం అనే ధృఢ విశ్వాసంతో వున్నారు.

ఉపరితలంలో గాలి లోపలికి చొప్పించడానికి ఆ గని ప్రదేశానికి పై భూభాగంలో పెద్ద కంత త్రవ్వారు.

సాధారణంగా భూగర్భ ప్రాంతాలలో పని చేసే జంక్షన్లలో తినుబండారాల నిల్వలు సర్వసాధారణం. క్రమేపి గాలిని చొప్పించడానికి మరొక కంత.

ఒకటి గాలి లోపలికి, మరి యొకటి గాలి బైటకి పోవడానికి.

17 రోజుల గడిచాక ఒక గని కార్మికుడు తన భార్యకు ఓ వుత్తరం రాశాడు. తాను క్షేమంగా వున్నానని తెలియబరుస్తూ గాలి పైకి పోయే కంత ద్వారా ఆ కాయితాన్ని ఉపరితలానికి పంపించాడు. గాలి ఫోర్స్ వల్ల ఆ చీటీ బైటకి చేరింది.

ఈ చీటీ ప్రపంచానికి 33 మంది బ్రతికి వున్నారనే భావన ఓ నోటీసులా అందింది.

28 అంగుళాల వెడల్పు గల ట్యూబ్‌ని పైకి ఎక్కే నిచ్చెనలతో బాటు పైకి క్రిందకు కదలికకు పంపబడింది. దీని ద్వారా సర్ఫేస్‌కు అండర్‌గ్రౌండ్‌కి ఓ లింక్ ఏర్పడగలదు. కార్మికులలో పూర్తి నమ్మకం ఏర్పడి చావుకి తల వంచకూడదని నిర్ణయానికి వచ్చారు. నిజానికి వాళ్ళు మృత్యుముఖాన ఉన్నారు. వాళ్ళు అలా వూహించడానికి వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి. వాళ్ళంతా ఓ నిర్మాణాత్మక నిర్ణయానికి వచ్చేశారు. వాళ్ళు 17 రోజులు వంటరిగా ఆ మైన్‌లో ఒక్కరుగా జీవించారు. ఇదే ప్రాణం అంటే తీపి అనడానికి ఓ కమ్మని ఉదాహరణ. ఒక వైపు ప్రపంచపు నలుమూలల నుండి ఈ 33 మందికి అండ మరో వైపు ఈ కార్మికుల కుటుంబాల శ్రయోభిలాషులు, చిలీ ప్రజలు, అన్ని రాజకీయపార్టీలు ఏకమై ఈ కార్మికుల రక్షణ విషయంలో ఒక్కమాటగా నిలిచారు.

ప్రజల మొదటి ప్రతి చర్య ప్రారంభమైంది. చీకటిని ఛేదించడానికి కేవ్‌ల్యాంప్స్ ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్‌తో పంపారు. ఆక్సిజన్ సిలిండరు పంపారు. గ్లూకోస్ డిస్‌క్లోస్ పాకెట్లను, బిపితో భాధపడుతున్న మరియు బ్లడ్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులు సరఫరా చేశారు. కొందరు దంతవ్యాధులకు మందులు, గుండె జబ్బుల నివారణకు మందులు ఇలా అన్ని రకాల వాళ్ళకి వాళ్లు జెప్పిన వెంటనే కావలసిన మందులు నివారణలు పంపబడ్డాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య స్థితి తెలుసుకోడానికి వాళ్ళ బ్లడ్ యూరిన్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షలకు పంపి ముందులు సకాలంలో అందిచేవాళ్ళు. చర్మ వ్యాధుల నివారణకు పై పూత ఆయింట్‌మెంట్లు తదితర నివారణ మందులు పంపబడ్డాయి. సమాచారం వ్యవస్థను మొరుగు పరచి వారి వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం అందించేవారు.

వారికి ఉత్సాహాన్ని కాలక్షేపానికి, జీవితం మీద ఆశ చిగురించడానికి వీడియోలు, సినిమాలు తదితర సీడీలు ఏవి కావాలన్నా క్షణాలమీద అందజేసేవారు. అనేక స్లోగన్లు, ప్లెక్సీలు హెల్త్‌కి సంబంధించినవి అందజేసేవాళ్ళు.

ఇంకో విషయం.. ఓ కలర్ మరియి నల్ల కళ్లజోళ్ళ కంపెనీ ‘ఒక్లే’ వారు 35 జతల కళ్ళ జోళ్ళు ఒక్కొక్కటీ 200 డాలర్ల ఖరీదువి ఫ్రీగా పంపించారు. ఈ కార్యక్రమం వల్ల వాళ్ళ కంపెనీకి 10 రోజులు న్యూస్ ఛానల్ పబ్లిసిటీ. ఇదే ప్రచారానికి వాళ్ళకి 40 మిలియన్ల డాలర్ల వ్యయమయ్యేది. దీనికి ఆ కంపెనీకి కేవలం 20 మిలియన్ల ఖర్చు మాత్రమే అయ్యింది.

ఒక వైపు 33 మంది రెస్కూ ఆపరేషన్ మరోక వైపు ప్రపంచ పటంలోని దేశాల ప్రజల ఉత్కంఠల మధ్య 33 మంది క్షేమంగా బైటకు రాగలిగారు. ఐకమత్యమే బలం అని మరొకసారి ఋజువైనది.

గీతా ప్రవచనంగా-

ఒక వ్యక్తి యొక్క కష్టాలకీ కన్నీళ్ళకి స్పందిస్తే ఇతరులు వాళ్ళ మిత్రులైనా బంధువులైనా తెలిసిన వాళ్ళైనా వాళ్ళ సేవా తత్పరత అనే ఆధ్యాత్మకతకు హిమాలయ శిఖరమంత ఎత్తుకు ఎదిగిన మనస్సు కల్గిన వారవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here