Site icon Sanchika

అడుగు అడుగునా

[డా. సి. భవానీదేవి రచించిన ‘అడుగు అడుగునా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]న్ని కథలు రాసిన గానీ
అమ్మ కథే గుర్తుంటుంది

ఎన్ని పరుపులున్నా గానీ
అమ్మ ఒడే బాగుంటుంది

ఎన్ని తారకలున్నా గానీ
అమ్మ నవ్వే మెరుపవుతుంది

ఎన్నిమెట్లెక్కిన గానీ
అమ్మ ప్రేమే దన్నవుతుంది

ఎన్ని కష్టాలోర్చిన గానీ
అమ్మ కొంగే నీడవుతుంది

ఎన్ని పాటలు విన్నా గానీ
అమ్మ జోలే నిద్రవుతుంది

ఎన్ని చిత్రాలు చూసిన గానీ
అమ్మ రూపే చూపవుతుంది

అమ్మ తలపుల పొగిలే భవానీ!
అడుగు అడుగునా అమ్మే ఉంది!

Exit mobile version