Site icon Sanchika

‘అద్వైత్ ఇండియా’ – సరికొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా పాఠకులకు అందించబోతున్నాము.

***

మన భారతదేశం హైందవతకు పునాది. ఈ దేశ చరిత్ర కడు ప్రాచీనమైనా విశ్వ  విఖ్యాతి గాంచింది. కానీ మన రాజులలో సఖ్యత కరువైన కారణంగా, ఆఫ్ఘనిస్తాన్ నుండి ముస్లిములు, తరువాతి కాలంలో ఆంగ్లేయులు దేశంలో ప్రవేశించి, మనం రాజుల మధ్యన అంతర్యుద్ధాలను కల్పించి బలహీనులను ఓడించి, బలవంతులను వారి చేతిలో కీలుబొమ్మలుగా చేసికొని, కొందరిని హతమార్చి యావత్ దేశాన్ని వారు పాలించారు.

ఆంగ్లేయులు ఈస్టిండియా కంపెనీ పేర వ్యాపార సంస్థను స్థాపించి, పై విధానంతో వారు మనకు ప్రభువులై, దేశ సంపదను దోచుకొని, వారి స్వదేశమైన ఇంగ్లాండుకు తరలించారు. మన హైందవ అమూల్య గ్రంథాలను దోచుకుని, వారి భాషలోని మార్చించుకొన్నారు. కఠిన కర్మశ పాలనను సాగించారు.

ఆ నిరంకుశమైన పాలనకు వ్యతిరేకంగా మన దేశంలో దేశభక్తి పరాయణులు, స్వాతంత్ర్యవాదులు అయిన ఎందరో వారిని ప్రతిఘటించి ఎదిరించి పోరాడారు. వారి తుపాలకులకు బలైపోయారు.

ఈ కోవకు చెందిన ఆంధ్రావని మహ నాయకులు శ్రీ యుతులు అల్లూరి సీతారామరాజుగారు. ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ నాయకులు. వీరిని ఆంగ్లేయులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.

ఆ తరువాత కాలంలో మన దేశాన్ని ఆంగ్లేయులు ఏ విధంగా పాలించారు, అప్పటి మనవారు ఏ ఏ కష్టాలు నష్టాలను ఏ రీతిగా ఎదుర్కొన్నారు, రామరాజ్యం అని పేరు గాంచిన మన దేశం ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కున్నది, స్వాతంత్ర్య పిపాసతో ఆనాటి మనవారు ఆంగ్లేయులను ఏ రీతిగా ఎదిరించారు, పాలకులైన ఆంగ్లేయులు మనవారిని ఏ రీతిగా హింసించారనే విచారకర సమస్యల ప్రతిరూపమే యీ ‘అద్వైత్ ఇండియా’ నవల.

చదవండి. మన దేశ సుచరిత్రను తెలుసుకోండి, నాడు మనవారిలో లేని సఖ్యతను దేశవాసుల మధ్యన పెంచండి. మనది కుల మత రహిత అద్వైత్ భారత్ అని నిరూపించే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని సూచించే నవల ‘అద్వైత్ ఇండియా’.

***

వచ్చే వారం నుంచే.. చదవండి.

‘అద్వైత్ ఇండియా’.

Exit mobile version