అద్వైత్ ఇండియా-23

0
3

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అద్వైత్ లండన్ వెళ్ళినప్పటి నుంచి ఇంటి పనులన్నీ సీత, సుమతిలు చూసుకుంటూ, సావిత్రిని దగ్గరకు రానివ్వరు. ప్రస్తుతం సెలవలు కాబట్టి – స్కూలు రీఓపెన్ అయ్యేంత వరకూ అన్ని పనులు తామిద్దరం చేస్తామని, సావిత్రిని విశ్రాంతి తీసుకోమని సీత చెబుతుంది. ఆ మాటలు విన్న వసుంధర వాళ్ళు ఆ పన్లు చేస్తారులే, నువ్వు భాగవతం చదువు అని సావిత్రితో అంటుంది. రెడ్డి రామిరెడ్డి గారు వచ్చి అన్నవరంలో తయారు చేయిస్తున్న మహాలక్ష్మి స్వర్ణ విగ్రహం తయారీని పరిశీలించడానికి వెళ్దామని అంటారు. ఎలాగూ అన్నవరం వెళ్తున్నారుగా, మేమూ వస్తాము స్వామి వారి దర్శనం చేసుకుంటామని వసుంధర, సావిత్రి అడుగుతారు. రామిరెడ్డిగారు సరేనంటారు. మర్నాడు టాక్సీలో వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకుని, అక్కడ్నించి స్వర్ణకారుడు చిన్నయ్య ఇంటికి వెళ్తారు. రెండు అడుగుల ఎత్తులో ఉన్న మాత విగ్రహాన్ని చిన్నయ్య చూపించగా, వాళ్ళంతా తన్మయులై, అతడి పనితనాన్ని పొడుగుతారు. అతనికి ఇవ్వవలసిన పైకాన్ని చెల్లిస్తారు రెడ్డి రామిరెడ్డి. విగ్రహాన్ని జాగ్రత్తగా ఒక పెట్టెలో భద్రపరిచి, రాజమండ్రి తీసుకువస్తారు. ప్రతిష్ఠాపనకు మంచి ముహూర్తం చూడమని శాస్త్రి గారిని కోరి రెడ్డిగారు వెళ్ళిపోతారు. సావిత్రి వసుంధరలు స్నానం చేసి భోజనానికి సిద్ధం అవుతారు. శాస్త్రి గారి కోసం సీత వేడినీళ్ళు సిద్ధం చేస్తుంది. వేణ్ణీళ్ళెందుకమ్మా అంటే, ప్రయాణంలో అలసట కలిగి ఉంటుంది కదా, వేణ్ణీళ్ళతో స్నానం చేస్తే పోతుందంటుంది సీత. సావిత్రి, శాస్త్రి గారు సంతోషిస్తారు. – ఇక చదవండి.]

అధ్యాయం 45:

[dropcap]అ[/dropcap]ద్వైత్.. ఇండియా, మేరీ.. మూన్ లండన్ చేరారు. మూన్ తన వూరికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మేరీ.. అద్వైత్ వుండేదానికి చక్కటి గదిని అన్ని వసతులతో ఏర్పాటు చేసింది. ఆండ్రియా ఇండియాలు గదిని చూచి అద్వైత్‌ని లోనికి పిలిచారు.

“సార్!.. ఈ గది మీది.. ఎలా వుందో చూచి మీ అభిప్రాయాన్ని చెప్పండి..” అంది ఇండియా.

పేరుకు అది ఒక గదే అయినా.. సింహద్వారం ముందు హాలు.. సోఫాలు.. వాటి వెనుక వున్న కర్టెన్‌ను తొలగిస్తే.. మంచం పరుపు దిండ్లు.. మంచానికి దోమ తెర.. ఎదుటి వైపున టేబుల్, రెండు కుర్చీలు.. అటాచ్డ్ రెస్ట్ రూం.. సింహద్వారానికి ఎదుటి వైపున మరో ద్వారం.. తలుపు తెరిస్తే విశాలమైన లాన్.. అనేక రకాల పూల మొక్కలు.. అన్నీ క్రమంగా అమర్చబడి నేత్రానందంగా వున్నాయి అద్వైత్‌కు.

“యంగ్ మ్యాన్!.. హౌ డు యు ఫీల్..” అడిగింది మేరీ.

“వెరీ ఫైన్ మేడం..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

ఇండియా అతని ముఖంలోకి చూచింది.

“రియల్లీ..” అంది.

“యస్ ఇండియా!..”

“దిసీజ్ మై ఫాదర్స్ పర్సనల్ రూమ్ ఔట్ హౌస్..” అంది ఆండ్రియా. క్షణం తర్వాత.. “ప్లీజ్ కమ్.. లెటజ్ హ్యావ్ బ్రేక్‌ఫాస్ట్!..”

“ఓకే మేడమ్..”

నలుగురూ మెయిన్ హౌస్‌కు వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. సర్వెంట్ మెయిడ్ వారికి టిఫిన్ అందించింది.

బ్రడ్ స్లయిసెస్.. బాదం.. ఫ్రూట్స్‌ను అద్వైత్ ముందుంచింది.

“ప్యూర్ వెజిటేరియన్..” అంది ఇండియా.

తనూ వాటినే తన ముందు వుంచుకొంది. ఆండ్రియా మేరీలు ఒకరి ముఖాలొకరు చూచుకొని ఇండియా వైపు చూచారు.

వారి చూపులను గమనించిన ఇండియా..

“ఫ్రమ్ టుడే.. వాట్ అద్వైత్ సార్ విల్ యీట్.. ది సేమ్ ఓన్లీ ఐ విల్ యీట్.. యు బోత్ నీడ్ నాట్ వండర్!..” నిర్లక్ష్యంగా తన మనోభిప్రాయాన్ని చెప్పింది ఇండియా.

“దట్ మీన్స్!.. వెజిటేరియన్!..” అండిగింది మేరీ.

“యస్ గ్రానీ!..”

“వై..”

“టు గివ్ కంపెనీ టు మై సార్..” అద్వైత్ ముఖంలోకి చూచింది చిరునవ్వుతో ఇండియా.

టిఫిన్ ముగించి మేరీ.. ఇండియా.. అద్వైత్‍లు కార్లో మేరీ నడుపుతున్న స్కూళ్ళను చూచేదానికి బయలుదేరారు. ఆండ్రియా.. వారికి చెప్పి, వారికంటే ముందు డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళి వస్తానని వెళ్ళిపోయింది.

మేరీ నడిపే పన్నెండు స్కూల్సును వారు వీక్షించారు. కిండర్ గార్డెన్ నుంచి ఎయిత్ వరకూ ప్రతి స్కూల్లో తరగతులు వున్నాయి. దాదాపు మూడువేలా ఆరువందల మంది బాలబాలికలు ఆ స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఆయా స్కూల్ హెడ్ మిసెస్లు వీరికి సగౌరవంగా గుడ్ మార్నింగ్.. ‘బై’ చెప్పి గౌరవించారు. ఇంటికి తిరిగి బయలుదేరారు.

“అద్వైత్ సార్!..” అంది మేరీ.

ముందు సీట్లో కూర్చొని యున్న అద్వైత్ వెను తిరిగి.. “యస్ మేడం!..” అన్నాడు.

“యు హ్యావ్ సీన్ మై స్మాల్ వల్డ్.. హౌ డు యు ఫీల్..”

“ఎక్సలెంట్ మేడమ్.. గ్రేట్ డిసిప్లిన్..”

“మై యాంబిషన్ యీజ్ ఫ్రమ్ టుమారో.. యు హ్యావ్ టు స్టార్ట్ డాన్స్ క్లాసెస్ ఫర్ ద ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ యిన్ ద స్కూల్స్.. ఎవ్విరీ స్కూల్ హెడ్ మిసెస్ విల్ డిస్కస్ విత్ ద బాయిస్ అండ్ గర్ల్స్.. విల్ మేక్ ఎ లిస్ట్ టుడే!..”

“యస్ మేడం, యాజ్ యు విష్!..”

“వుయ్ విల్ కలెక్ట్ సం అమౌంట్ ఫ్రమ్ ఈచ్ స్టూడెంట్.. దటీజ్ ఫర్ యు..” అద్వైత్ సరే అన్నట్లు తల ఆడించాడు.

కారును నడుపుతున్న ఇండియా తన ప్రక్కన కూర్చొని యున్న అద్వైత్ ముఖంలోకి చూచింది. అద్వైత్ నేరుగా రోడ్డును చూస్తూ వున్నాడు. అతని ముఖం ఎంతో గంభీరంగా కనుపించింది ఇండియాకు.

‘గ్రానీ.. ప్రపోజల్ అద్వైత్‍కు నచ్చనట్లుంది. అందుకే తల ఆడించి మౌనంగా వున్నాడు.

‘ఒక్కొక్క పిల్ల పిల్లవాడు డాన్స్ క్లాసుగా అధికంగా ఎంత పే చేయగలరు?.. వ్యూ పౌండ్స్..’

‘అద్వైత్ షుడ్ ఎర్న్ మోర్ మనీ!.. హౌ!..’ ఆలోచించసాగింది ఇండియా.

‘సముద్రాలు దాటి వీరితో నేను వచ్చింది చిన్నపిల్లలకు డాన్స్ నేర్పి వారు ఇచ్చే రెండు లేక మూడు పౌండ్లు తీసుకొనేటందుకా!.. కాదు.. నేను బాగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించాలంటే.. తాను స్వయంగా నాట్య స్కూలును.. తరగతులను ప్రారంభించాలి. యీ విషయాన్ని గురించి లోకల్ పత్రికలలో ప్రచురించాలి. యీ దేశవాసుల అభిరుచులను తెలిసికోవాలి. కేవలం మన ప్రాంతంలోని సంగీతం.. క్రాప్టు టీచర్లలా, ఆ స్కూళ్ళల్లో పని చేయకూడదు. నాది అంటూ నా సంస్థను నేను ఏర్పాటు చేసికోవాలి. నిర్భయంగా నా యీ నిర్ణయాన్ని నేను మేరీ మేడంకు తెలియజేయాలి. నా నిర్ణయాన్ని విని ఇండియా ఏమంటుందో తెలిసికోవాలిది..’ ఆ నిర్ణయానికి వచ్చిన అద్వైత్..

“మేడం!.. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్!..”

“యస్ ప్రొసీడ్!..” అంది మేరీ.

“మియర్ కండెక్టింగ్ డాన్స్ క్లాసెస్ యిన్ యువర్ స్కూల్స్.. యీజ్ నాట్ మై డిజైర్!.. వుయ్ హ్యావ్ టు ఓపన్ ఏ డాన్స్ స్కూలు!..”

“వాట్!..”

“డాన్స్ స్కూలు!.. యిన్ దట్ ఐ అండ్ ఇండియా బోత్ విల్ వర్క్..”

“యు మీన్ సపరేట్ డాన్స్ స్కూల్..” ఆశ్చర్యంతో అడిగింది మేరీ.

“యస్ మేడం!..” అన్నాడు అద్వైత్ ఎలాంటి బెరుకూ లేకుండా

“యస్ సార్, యు ఆర్ రైట్.. వుయ్ విల్ ఓపన్ ఏ డాన్స్ స్కూల్..” ఆనందంగా అంది ఇండియా.

“స్కూల్ నేమ్ యీజ్.. ఇండియా డాన్స్ స్కూల్..” నిశ్చలంగా చెప్పాడు అద్వైత్.

“గ్రానీ!.. వాడ్ డు యుసే!..” అడిగింది ఇండియా.

మేరీ వారి మాటలను విని.. ఆలోచనలో పడింది.

“గ్రానీ!.. హ్యావ్ యు అండర్‌స్టుడ్ వాట్ వుయ్ బోత్ సెడ్..”

“యస్.. యస్!..”

“దెన్ వై ఆర్ యూ కీపింగ్ మమ్!..”

“డార్లింగ్!.. ఐ యాం థింకింగ్ అబౌట్ ద సేమ్!..”

“వాట్ ఎవర్ యు థింక్.. థింక్.. బట్ ఓపనింగ్ డాన్స్ స్కూలు.. విల్ బి హ్యాపెన్డ్ సూన్!..”

“లెటజ్ డిస్కస్ విత్ ఆండ్రియా ఆల్సో బేబీ!..”

“వుయ్ విల్ సర్టెన్లీ డిస్కస్ విత్ మై మామ్, గ్రానీ!..” నవ్వింది ఇండియా. క్షణం తర్వాత.. “సార్.. యువర్ ఐడియా యీజ్ ఎక్స్‌లెంట్.. కంగ్రాచ్యులేషన్స్!..” తన ఎడమచేతిని అద్వైత్ వైపుకు సాచింది.

అద్వైత్ ఇండియా ముఖంలోకి చూచి చిరునవ్వు నవ్వాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసికొని..

“థ్యాంక్యూ వెరీ మచ్ ఇండియా!.. ఫర్ ది సపోర్టు..” అన్నాడు.

వారు.. వారి నిలయానికి చేరారు. వారు చేరిన గంట తర్వాత ఆండ్రియా వచ్చింది. ఇండియా తన నిర్ణయాన్ని తల్లికి తెలియజేసింది. ఆండ్రియా తన తల్లితో ముచ్చటించింది. చివరకు వారు ‘డాన్స్ స్కూలు’ స్థాపించే దానికి నిర్ణయించుకొన్నారు. అద్వైత్ ఇండియాలు గొప్పగా సంతోషించారు.

మూడవరోజు పత్రికల్లో ‘డాన్స్ స్కూలు’ను గురించిన ప్రచురణ జరిగింది.

వారం రోజుల్లో యిరవై అప్లికేషన్స్.. రెండు వారాల్లో నూరు అప్లికేషన్లు వచ్చాయి. పది పన్నెండు సంవత్సరాల నుండి యిరవై ఏళ్ళ వయస్సు వారు కూడా అప్లికేషన్లు పంపారు. వారి ఆవరణంలో వారం రోజుల్లో.. డాన్స్ స్కూల్ హాలు నిర్మాణం అయింది. మంచిరోజున అద్వైత్, ఇండియాలు క్లాసెస్ ప్రారంభించారు.

అధ్యాయం 46:

శ్రీ మహాలక్ష్మమ్మ బంగారు విగ్రహ ప్రతిష్ఠ వారం రోజుల్లో జరగబోతుందనగా.. నరసింహశాస్త్రికి అద్వైత్ వ్రాసిన లేఖ చేరింది. సావిత్రిని పిలిచాడు.

ఆతృతతో వుత్తరాన్ని విప్పారు.. చదవసాగారు.

‘బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాన్నగారికి, కుంకుమ శోభితురాలైన మా అమ్మకు మీ అద్వైత్ ప్రణామాలు. నేను ఇచ్చట అన్ని విధాలా బాగున్నాను. అచ్చట మీరు సీత, అత్తయ్య, పాండురంగ, సుమతి.. భద్రాచలంలో మన రాఘవ క్షేమం అని తలుస్తున్నాను.

నేను యిచ్చట ఆండ్రియా.. మేరీ మేడమ్‍ల సహకారంతో డాన్స్ స్కూలును ప్రారంభించాను. మూడు వేళలా.. వేళకు యాభై మంది బాలబాలికలు నాట్యాభ్యాసానికి వస్తున్నారు. మిమ్మల్ని మనస్సున స్మరించుకొంటూ మీరు నాకు నేర్పిన ఆ కళామతల్లి ప్రతిభను నేను వారందరికీ చిత్తశుద్ధితో పంచుతున్నాను. మీ ప్రియ శిష్యురాలు ఇండియా నాకు సహాయకురాలిగా వర్తిస్తూ వుంది. పిల్లల తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడూ వచ్చి వారి వారి పిల్లల నాట్యశిక్షణను తిలకిస్తూ వుంటారు. అందరూ నన్ను అభినందిస్తూ వుంటారు. వుదయం ఆరు గంటలనుండి ఏడున్నర వరకూ ఒక గ్రూపు పదిన్నర నుంచి పదకొండున్నర వరకూ ఒక గ్రూపు.. సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర వరకూ మరో గ్రూపు నాట్యాన్ని అభ్యసిస్తున్నారు. గడచిన ఐదు వారాలూ.. ఒక వారం తప్ప మిగతా నాలుగు వారాలూ నాలుగు క్షణాలుగా గడిచిపోయాయి.

పాండురంగకు.. సుమతికి.. సీత.. సీతకు నా శుభ ఆశీర్వచనములు. సుమతి ఆరోగ్యంగా వున్నదని తలుస్తాను. పాండూను ఒక్కసారి ఆమెను లేడీ డాక్టర్‍కు చూపించమని చెప్పిండి. మామయ్యగారు (మా తాతగారు) చిన్నాన్నా.. పిన్ని అందరూ క్షేమం అని తలుస్తాను. రాఘవకు జాగ్రర్తగా వుండమని వారానికి ఒక వుత్తరం వ్రాయండి. వాడికి మీ మాట అంటే ఎంత గౌరవమో మీకు తెలిసిన విషయమే!..

నాలుగైదు నెలలలో రావాలనుకొంటున్నాను. రాబోయే ముందు లేఖ వ్రాస్తాను. ప్రతి పది రోజులకు ఒకసారి నేను మీకు వుత్తరాన్ని వ్రాస్తుంటాను. మీరు అలాగే నాకు వ్రాయండి. మన రెండు ప్రాంతాల మధ్య దూరం చాలా ఎక్కువ కనుక ఉత్తరాలు చేరడంలో ఆలస్యం అవుతుంది.

సీత.. సీతకు ఆవేశం అధికం.. కానీ మనస్సు చాలా మంచిది. మనమందరం అంటే ప్రాణం. ఏదైనా పొరపాటు సీత వలన జరిగితే మీరు మన్నించి.. పద్ధతిని నేర్పుతారు గదా!.. అమ్మ.. మీరు సీతను జాగ్రర్తగా చూచుకొంటారని నా నమ్మకం.. పాపం.. తల్లీ తండ్రి లేని పిల్ల.. నా ఆశీర్వాదాలను సీతకు తెలియజేయండి.

ఇట్లు

నమస్సుమాంజలితో

మీ అద్వైత్

వుత్తరం పూర్తిగా చదివేసరికి.. నరసింహశాస్త్రి కళ్ళల్లో కన్నీరు. పై పంచతో కన్నీటిని ఒత్తుకొని.. అర్ధాంగి సావిత్రి ముఖంలోకి చూచారు.

ఆమె కళ్ళనుండి కన్నీరు కారి చక్కిళ్ళపైకి దిగజారాయి. భర్త చూపులను గమనించిన సావిత్రి త్రోటుపాటుతో కన్నీటిని పవిటతో తుడుచుకొంటూ..

“అద్వైత్ వుత్తరం వ్రాశాడని వదినగారికి.. సీతకు సుమతికి.. పాండురంగకు చెబుతానండి..” లోనికి నడిచింది.

“సావిత్రి!.. పాండు బయటికి వెళ్ళి వున్నాడుగా!..”

వెనుతిరిగి సావిత్రి..

“ఆ.. ఆ.. మరచిపోయానండీ!..” అనునయంగా చెప్పి సావిత్రి మౌనంగా లోనికి పోయింది. పెరటి వైపు వుతికిన బట్టలను ఆరవేసి సీత సుమతీలు లోనికి వచ్చారు. వారిని చూచి..

“సీతా!.. ఆది ఉత్తరం వ్రాశాడు.. నిన్ను నేను జాగ్రత్తగా చూచుకోవాలట..” నవ్వింది సావిత్రి.

సీత సుమతీలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు సందేహంగా.

“మీ మామయ్యగారి వద్ద ఉత్తరం వుంది. అడిగి తీసికొని చదువుకో. నీ గురించి నా కొడుకు ఏం రాశాడో.. వాడి మనస్సు ఎలాంటిదో తెలుస్తుంది” ఓరకంట సీత ముఖంలోకి చూస్తూ చెప్పింది సావిత్రి. వంటగదిలోకి వెళ్లిపోయింది. సీత సుమతీలు వరండాలోకి వచ్చారు.

“మామయ్యా!..” మెల్లగా పిలిచింది సీత.

నరసింహశాస్త్రి వెనక్కు తిరిగి చూచారు.

సీత తల దించుకొని.. “బావ..” చెప్పడం ఆపేసింది.

“ఆఁ.. వుత్తరం వ్రాశాడమ్మా. యిదిగో చదువుకో..” అందించారు శాస్త్రిగారు.

ఆ ఉదయాన్నే వసుంధర గోపాలశర్మ గారింటికి వెళ్ళింది.

ఉత్తరాన్ని నవ్వుతూ అందుకొంది సీత. సుమతి ముఖంలోకి చూచింది.

ఇరువురూ సీత గదిలోనికి వెళ్ళిపోయారు. మంచంపైన కూర్చున్నారు.

“చదువు సీతా!.. అన్నయ్య ఏం వ్రాశారో!..” అంది సుమతి సీత ఉత్తరాన్ని చదవసాగింది. సుమతి వింటూ వుంది.

చివరన.. తనను గురించి, తన పేరును రెండు సార్లు వాడి వ్రాసిన మాటలను ఒకటి రెండుసార్లు చదివింది. విచారంగా నవ్వుకొంది.

“ఇలాంటి శిక్ష ఏ దంపతులకూ పడకూడదు సుమతీ!..” ఆవేదనతో మెల్లగా చెప్పింది సీత.

“సీతా!.. అధైర్యపడకు. అన్నయ్య నాలుగైదు నెలలలో వస్తానని వ్రాశాడుగా!.. తప్పకుండా నీ కోసం వస్తారు” అనునయంగా చెప్పింది సుమతి.

“ఆ నమ్మకం మీదనే బ్రతుకుతున్నాను సుమతీ!..” అంది సీత.

సావిత్రి పిలుపు విని ఇరువురూ గది నుండి బయటికి నడిచారు. ఆ రాత్రి అద్వైత్ వ్రాసిన వుత్తరాన్ని గురించి పాండురంగకు చెప్పింది సుమతి.

మరుసటి దినం.. వుదయం ఆరుగంటలకు రాఘవ శ్రీమహాలక్ష్మి విగ్రహం ప్రతిష్ఠ కోసం నరసింహశాస్త్రిగారు వ్రాసిన వుత్తరం ప్రకారం వచ్చాడు.

అందరినీ ఆప్యాయంగా పలకరించాడు. అతని రాక వలన అందరికీ ఎంతో సంతోషం.

సీత అద్వైత్ వ్రాసి లేఖను గురించి చెప్పింది. దాన్ని తీసికొని చదివాడు రాఘవ.

పాండురంగను.. సుమతిని లేడీ డాక్టర్ వద్దకు పరీక్షకు తీసికొని వెళ్ళి రావలసిందిగా చెప్పారు శర్మగారు. ఆ భార్యాభర్తలు బయలుదేరారు. స్వేచ్ఛగా ఇంటి పెద్దల ముందు మాట్లాడుకొనే దానికి వీలుపడని సీత..

రాఘవలు నరసింహశాస్త్రికి సావిత్రికి చెప్పి, పాండురంగ సుమతీలతో బయలుదేరారు.

ఆ భార్యా భర్తలు ఒక రిక్షాలో.. అన్నా చెల్లెలు ఒక రిక్షాలో కూర్చున్నారు.

“అమ్మా సీతా!.. బాగున్నావుగా!..”

“ఆఁ.. నాకేం తక్కువన్నయ్యా!..”

“అత్తకు మామయ్యకు ఎలాంటి అనుమానం కలుగలేదుగా!..”

“ఇంతవరకూ లేదు..”

“నీవు బావ వచ్చేవరకూ జాగ్రత్తగా వుండాలి తల్లీ..” దీనంగా సీత ముఖంలోకి చూస్తూ చెప్పాడు రాఘవ. క్షణం తర్వాత.. “సీతా!.. విషయం సుమతికి తెలుసా!..”

“నాకు ఎవరో ఒకరి అండ అవసరం కదా అన్నయ్యా!.. ఆ కారణంగా చెప్పాను. ‘యీ విషయం మన మధ్యనే వుండాలి’ అని తాను నన్ను హెచ్చరించింది. నేనూ మాంగల్యాలు కనబడకుండా చాలా జాగ్రత్తగా వుంటున్నాను. బావ త్వరగా వస్తే బాగుంటుందన్నయ్యా!..” దీనంగా రాఘవ ముఖంలోకి చూచి చెప్పింది సీత.

“జాబులో వ్రాశాడు కదమ్మా! తప్పకుండా త్వరలోనే బావ వచ్చేస్తాడు. నీవు భయపడకు..” అనునయంగా చెప్పాడు రాఘవ.

వారు హాస్పిటల్‍ను సమీపించారు. రాఘవ డాక్టర‌ను కలసి విషయం చెప్పాడు. సుమతిని డాక్టర్ పరీక్షించింది. అంతా నార్మల్ అని చెప్పి ఓ టానిక్, టాబ్లెట్లు రక్త వృద్ధికి వ్రాసి యిచ్చింది. వాటిని కొనుక్కొని.. నలుగురూ ఇంటికి తిరిగి వచ్చి సావిత్రికి శర్మ గారికి విషయాన్ని చెప్పారు. వారికి సంతోషం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here