ఐహికం

0
2

[శ్రీ దేశరాజు రచించిన ‘ఐహికం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]మాజు చేసేట్టు
నుదిటిపై ఆ మచ్చేంటి?

ఏళ్ల తరబడిన నీ పెదవుల తడి కేక

ఏం తప్పు చేసావని
ఈ సాష్టాంగ నమస్కారాలు?

ఒళ్లంతా ప్రణయ సలపరపు మోక

పైకి చూస్తూ
ఆ ప్రార్థనలేమిటి?

ఇహపు ఇచ్ఛల చెవిలో నెమలి ఈక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here