కొత్త ఫీచర్ ‘ఐశ్వర్య రహస్యం’ – త్వరలో ప్రారంభం – ప్రకటన

0
2

[dropcap]డా[/dropcap]క్టర్ రాయపెద్ది వివేకానంద్ గారి ‘ఐశ్వర్య  రహస్యం’ అనే రచనని ధారావాహికగా అందిస్తున్నాము.

***

“మీరు ఏ పని చేస్తున్నా నిశ్చయంగా మీరు కోటీశ్వరులు కావచ్చు. సమృద్ధి, అఖండ ఐశ్వర్యాలు ఇక మీ స్వంతం”.

ఈ వేళ ప్రపంచంలో ఉన్న బిలియనీర్ల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితులని చేసిన గొప్ప రేడియో ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా తెలుగు ధారావాహిక ‘ఐశ్వైర్య రహస్యం’ అనబడు ‘ఐశ్వర్యానికై ముప్ఫై రోజుల దీక్ష’.

ఇది చదివి ఈ సూత్రాలని పాటించిన వారు బిలియనీర్లు అవడం తథ్యం.

అతి గొప్ప పుస్తకాలుగా పరిగణింపబడుతున్న ‘సీక్రెట్’, అతి గొప్ప సిద్ధాంతంగా పరిగణింపబడుతున్న ‘లా ఆఫ్ అట్రాక్షన్’ పుస్తకాలకి మూలం ఈ రేడియో ప్రసంగం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అదే విధంగా ఈ వేళ ప్రపంచంలోని ట్రెయినర్లందరికీ మతగ్రంథం లాంటిది ఈ రేడియో ప్రసంగ పాఠం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇండియాలో అతి గొప్ప ట్రెయినర్ సిద్ధార్థ్ రాజశేఖర్ తన వద్దకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ రేడియో ప్రసంగాన్ని రోజు రెండు సార్లు విధిగా వినమని సిఫార్సు చేస్తాడు. అన్నట్టు సిద్ధార్థ్ రాజశేఖర్ ఆదాయం సంవత్సరానికి నాలుగు వందల కోట్లపై మాటే.

కేవలం 2016లో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సిద్దార్థ్ రాజశేఖర్ తనకి ప్రేరణ ఇచ్చిన ఈ రేడియో ప్రసంగాన్ని గూర్చి రచయితకు మొదట తెలియజేశాడు.

అతనికి ఆయన గురువు మల్టీ మిలియనీర్ విక్ ఈ ప్రసంగం గూర్చి మొదటిసారి చెప్పాడు.

ఈ రేడియో ప్రసంగాన్ని ఎర్ల్ నైటింగేల్ మొదటిసారిగా 1956లో ఇచ్చారు. ఇన్సురెన్స్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌ని ఉత్తేజ పరచటానికి యథాలాపంగా ఇవ్వబడ్డ ఈ ప్రసంగం అనుకోకుండా అత్యంత ప్రజాదరణ పొందింది. సంగీతానికి సంబంధించిన రికార్డులు ఎక్కువ అమ్ముడయ్యే ఆ రోజుల్లో ఈ ప్రసంగం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఈ రేడియో ప్రసంగాన్ని ఆధారం చేసుకుని, డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ వ్రాసిన ఈ ధారావాహిక త్వరలో ప్రారంభం.

***

చదవండి.. చదివించండి..

‘ఐశ్వర్య రహస్యం’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here