[dropcap]అ[/dropcap]క్షరమాల తెలుగు అక్షరమాల
తేట తెలుగు మాటల లక్షల మాల
అ అనగా అమ్మ.. ఆ ఆనగా ఆవు
ఇ అనగా ఇల్లు.. ఈ అనగా ఈశ్వరుడు.
అమ్మ నుండి ఆది.. ‘అనాది’
అర్థం చెప్పు అమ్మనుడి
తెలుగమ్మనుడి ఇదే కదా వెలుగు గుడి
నీదే కదా తెలుగుబడి
…………………… ‘అక్షరమాల’
అక్కా.. అక్కా.. అక్కా..
వాన కోయిల నోట తేట తెలుగు మాట
మాట మీద మాట జానా తెలుగు మాట
ఉత్తుత్తి గువ్వల నోట (ఉత్తుత్తి.. ఉత్తుత్తి..ఉత్తుత్తి)
సవాలక్ష పక్షుల స్వచ్ఛమైన పలుకులు
ప్రకృతి మాతకు పాటల ఆహారం
మన అమ్మనుడిదంట కమ్మని తెలుగుదంట..
నీ యాస నీదంట నీ భాష నీదంట
నీ భావం గొప్పదంట నీ బతుకు భలే అంట
……………………… ‘అక్షరమాల’
అదిగో అదిగో ఆటలతోట
ఇదిగో మాటల మూట
అదిగదిగో వెతల పుట్ట కథలా
చెట్టు కళాచారం పెంచిన చెట్టు
కవి గో కులాన్ని కాచిన చెట్టు
కాలంతో కరచాలనం చేసిన చెట్టు
రాశుల రాశుల కాసుల చెట్టు
అక్షర లక్షల మాలల చెట్టు
మన అమ్మనుడిదంట
కమ్మని తెలుగుదంట
……………………… ‘అక్షరమాల’
తెలుగు చదవకుంటే
తెలివి పెరగదు అంతే
తెలివి పెరగకుంటే
బండి నడవదంతే
బతుకు బండి నడవదంతే
నీ జీవితమిక అంతే
అక్షరాలే మార్పు
అక్షరాలే కూర్పు
తెలుగు అక్షరాల నేర్పు నేర్పు
నేర్పు నేర్పు నీ బిడ్డలకు తెలుగు అక్షరాల నేర్పు
……………………….. ‘అక్షరమాల’