Site icon Sanchika

అలనాటి అపురూపాలు-96

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

‘బెన్ హర్’ (1959) ఘనతలు:

కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. వాటి ఘనతల గురించి చాలా కాలం గొప్పగా చెప్పుకుంటారు. అలా చరిత్రలో నిలిచిపోయిన ‘బెన్ హర్’ సినిమా గురించి తెలుసుకుందాం.

‘బెన్ హర్’ చిత్రం క్రీస్తు జీవిత కాలంలో సాగుతుంది. కథా నాయకుడు, యూదుల రాజు ‘బెన్ హర్’ (చార్ల్‌టన్ హెస్టన్) తన రోమన్ నేస్తం మెసాలా చేతిలో మోసపోతాడు. బానిసగా మారాల్సి వస్తుంది, అయితే అతను తిరిగి అధికారం సాధించాకా, రోమన్ సామ్రాజ్యంపై పగ తీర్చుకోవాలనుకుంటాడు.

నటీనటులు:

చార్ల్‌టన్ హెస్టన్ – జుడా బెన్ హర్

స్టీఫెన్ బాయిడ్ – మెసాలా

జాక్ హాకిన్స్ – క్వింటస్ యారియస్‌

హాయా హరారీత్‌ – ఈస్తర్‌

హ్యూ గ్రిఫిత్‌ – షేక్‌ ఇల్దెరిమ్‌

మార్తా స్కాట్‌  – మిరియమ్‌

~

ఒరిజినల్ ట్రైలర్‌ని ఈ లింక్‌లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=SCJfUi3V3r4

~

‘బెన్ హర్’ విశేషాలు:

పురస్కారాలు:

‘బెన్ హర్’ చిత్రం 1960లో 11 విభాగాలలో ఆస్కార్ అవార్డులు పొందింది.

1960లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అవార్డులు –

  1. ఉత్తమ చిత్రం – ‘బెన్ హర్’
  2. ఉత్తమ దర్శకుడు – విలియం వైలర్
  3. ఉత్తమ కథానాయకుడు – చార్ల్‌టన్ హెస్టన్
  4. ఉత్తమ సహాయకనటుడు – హ్యూ గ్రిఫిత్‌
  5. ఉత్తమ కళాదర్శకుడు – విలియం ఎ హార్నింగ్, ఎడ్వర్డ్ సి కార్ఫాగ్నో, హ్యు హంట్
  6. ఉత్తమ ఛాయాగ్రాహకుడు – రాబర్ట్ సర్టీస్
  7. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ – ఎలిజబెట్ హాఫెన్‍డన్
  8. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – ఎ. ఆర్నాల్డ్ గిలెప్సీ
  9. ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ – రాల్ఫ్ ఇ వింటర్స్
  10. ఉత్తమ సంగీతం – మిక్లాస్ రోజ్సా
  11. ఉత్తమ సౌండ్ – ఫ్రాంక్లిన్ మిల్టర్

ఇవి కాక 1960 సంవత్సరానికి గాను విలియం వైలర్‌కి డైరక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా – ఉత్తమ దర్శకుడిగా పురస్కారమిచ్చింది.

1960 సంవత్సరానికి ఈ సినిమాకి బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) వారి ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది.

అదే ఏడాది ఈ సినిమాకి బెస్ట్ డ్రామా, బెస్ట్ డైరక్టర్‌గా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు లభించాయి. అలాగే ఉత్తమ సహాయనటుడిగా స్టీఫెన్ బాయిడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.

‘బెన్ హర్’ ప్రభావం:

ఏ కాలంలోనైనా అతి గొప్ప చారిత్రక సినిమాలలో ఒకటిగా ‘బెన్‍ హర్’ పరిగణింపబడుతోంది. బైబిల్ ఆధారిత సినిమాలు నేడు అంత ప్రజాదరణ పొందకపోయినా, ‘బెన్ హర్‌’ని ఒక క్లాసిక్‍గా భావిస్తారు. ఎందరో సినీ అభిమానులకి అది ఇష్టమైన సినిమా. ఆ రోజుల్లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమా. ముందెన్నడూ లేని విధంగా 11 ఆస్కార్ అవార్డులు పొందిన సినిమా. టైటానిక్ అనే సినిమాకి తిరిగి అన్నే ఆస్కార్ అవార్డులు సాధించడానికి 38 ఏళ్ళు పట్టింది. ‘బెన్ హర్‍’ చిత్రం చార్ల్‌టన్ హెస్టన్‌కి మరపురాని పాత్ర దొరికిన చిత్రంగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో ఆయన నటించిన రథం పందాల సన్నివేశాలు వల్ల ఈ సినిమా హాలీవుడ్‍లో ఓ క్లాసిక్‍గా పరిగణించబడుతుంది.

చివరగా, 1970లలో ఈ సినిమాని టీవీలో ప్రసారం చేసినప్పుడు, అది వెంటనే ఆ కాలంలో ప్రదర్శితమైన సినిమాల్లో అత్యధిక రేటింగ్స్ పొందిన చిత్రంగా నిలిచింది. ‘బెన్ హర్’ మాయ ఎంతలా పని చేసిందంటే, దీన్ని 2016లో మరోసారి రీమేక్ చేశారు.

Exit mobile version