అమ్మ కడుపు చల్లగా-13

0
3

[box type=’note’ fontsize=’16’] వాతావరణం నుంచి కార్బన్ డై యాక్సైడ్‌ను సంగ్రహించి భద్రం చేయగల అవకాశాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

[dropcap]వా[/dropcap]తావరణంలో మార్పుల వల్ల అంతుచిక్కని క్రొత్త రోగాలు వస్తాయి. నివారణ కనుగొనే లోపున జరగవలసిన వినాశనం జరిగిపోతుంది. చంటిపిల్లల మరణాలలో 20 శాతానికి పర్యావరణమే కారణమని ఇప్పటికే అధ్యయనాలు చెప్తున్నాయి. పర్యావరణ వైపరీత్యాల కారణంగా కోట్ల మంది నిర్వాసితులు కావడాన్నీ చూస్తూనే ఉన్నాం. పంటల దిగుబడులూ తగ్గిపోతాయి.

నైట్రస్ ఆక్సైడ్, క్లోరిన్ వంటివి సుమారు వంద సంవత్సరాల వరకూ వాతావరణంలో ఉండిపోతాయి. కారణం పర్యావరణంలో వీటి విధ్వంస ప్రక్రియ ఒకసారితో ఆగదు. గొలుసుకట్టుగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ అంశాలన్నీ శాస్త్రీయంగా పరిశీలించిన శాస్త్రజ్ఞులు 40 సంవత్సరాలుగా రానున్న ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. అభివృద్ధి పేరిట విచక్షణారహితంగా దూసుకుపోతున్న దేశాలు/మనుషుల ముందు ఆ హెచ్చరికలన్నీ చెవిటికి శంఖం ఊదిన మాదిరి నిష్ఫలమయ్యాయి.

మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లగల స్థాయిలో పర్యావరణ విధ్వంసం జరిగిపోయాకా, ఇప్పుడు ఒక్కొక్క దేశం మెల్లగా కళ్ళు తెరుస్తోంది. ఆలస్యంగానైనా ఇదీ ఒక మంచి పరిణామమే. ఆ పరిణామ ఫలితంగానే –

స్వీడన్, నార్వేలు ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ‘హరిత ఛత్రం’ దిశగానూ అదే విధానం అవలంబిస్తున్నాయి. థాయ్‌లాండ్, జపాన్, స్వీడన్, ఆస్ట్రేలియాలు వ్యర్థాల రీసైకిలింగ్ దిశగాను గట్టిగా కృషి చేస్తున్నాయి.

2050 నాటికి ‘ఉద్గారాల తటస్థత’ (Net Zero) సాధించే దిశగా జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ కసరత్తు చేస్తున్నాయి. చైనా కనీసం 2060 నాటికైనా ఆ లక్ష్యాన్ని సాధించాలన్న చిత్తశుద్ధితో ముందుకు పోతోంది.

యునైటెడ్ కింగ్‍డమ్ రమారమి ఒక లక్షా 20000 కోట్ల రూపాయలతో ఒక హరిత ప్రణాళికను రూపొందించింది. 58.2 కోట్ల పౌండ్లతో ‘కార్పస్ ఫండ్’నూ ఏర్పాటు చేసింది. తయారీదార్ల సహకారంతో 2030 నాటికి డీజిల్ కార్ల నిషేధం తీసుకురానుంది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకై 130 కోట్ల పౌండ్లు కేటాయించింది. యూరోపియన్ యూనియన్‍లో నిన్న మొన్నటి వరకు డీజిల్ కార్ల వాడకం విస్తృతంగా ఉండేది. ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది (దాదాపుగా నాలుగో వంతు). ఆ స్థానాన్ని విద్యుత్‍వాహనాలు లేదా హైబ్రీడ్ వాహనాలు భర్తీ చేస్తున్నాయి.

విద్యుత్ బ్యాటరీలకు ఆధారమైన లిథియం, కోబాల్ట్ వంటివి కొన్ని దేశాలలోనే లభ్యమవుతాయి. ఆ దేశాలపై చైనా ఆధిపత్యం నడుస్తోంది. ఆ కారణంగా ప్రత్యామ్నాయాల దిశగాను వేట సాగుతోంది. పవన, అణు విద్యుత్తుల దిశగానూ అడుగులు చురుకుగా పడుతున్నాయి. 2030 నాటికి కనీసంగా ఒక కోటి టన్నుల కార్బన్ డై యాక్సైడ్‌ను వాతావరణం నుంచి సంగ్రహించి భద్రం చేయగల అవకాశాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం రానున్న సంవత్సరాలలో పారిస్ ఒప్పందంపై సమీక్ష జరిగే వరకు ప్రస్తుత లక్ష్యాలకే కట్టుబడి ఉంటుంది. రిలయన్స్, టాటా, మహీంద్రా వంటి పెద్ద సంస్థలూ Net Zero కై 9 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here