Site icon Sanchika

అమ్మ కడుపు చల్లగా-22

[box type=’note’ fontsize=’16’] ఉష్ణోగ్రతలు 2° సెల్సియస్ పెరగడం వల్ల సంభవించబోయే ముప్పు ఏమిటో ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

ప్రణాళికలే తప్ప ఆచరణలు ఏవి?:

[dropcap]ప్ర[/dropcap]పంచ వాతావరణ సంస్థ మరికొన్ని సైన్స్ సంస్థలతో కలిసి చేపట్టిన అధ్యయానాల అనంతరం ఇటీవల విడుదల చేసిన నివేదిక 2050 నాటికి 120 కోట్ల ప్రజలు వాతావరణ సంక్షోభాల కారణంగా నిర్వాసితులు కాగల ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ప్రస్తుతం భూఉపరితల ఉష్ణోగ్రతలు 4° సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే భూమండలంపైని అనేక జీవరాసులు తుడిచిపెట్టుకుపోతాయి. మానవజాతి ఈ మహా ఉపద్రవానికి అతీతంగా మనగలగదనుకోవడం భ్రమే. గణనీయమైన స్థాయిలో జనాభాకూ ఈ ముప్పు తప్పదు.

ప్రమాదాన్ని పసికట్టాకా, I.P.C. నివేదికలు వెలువడడం ప్రారంభించిన తర్వాత కూడా ప్రపంచదేశాలు సమస్య తీవ్రతను ఏ మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా కర్బన ఉద్గారాలను, విషవాయువులను వాతావరణంలోకి వదులుతూనే ఉండటమే ప్రస్తుత అత్యవసర పరిస్థితికి కారణం.

ప్రస్తుతం వాతావరణంలోని కర్బన ఉద్గారాల మొత్తంలో 60 శాతానికి పైగా ప్రమాదాన్ని గుర్తించాకా, వెలువరించినవే. ఇప్పటికే వాతావరణంలో కర్బన ఉద్గారాలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి. 1° సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం చాలా తేలిక. 2° సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రమాదం అన్న అంచనాలు నిన్న మొన్నటివి కాదు. శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నవే.

ఏమిటీ ఈ 2° సెల్సియస్ ముప్పు?

సముద్రాలతో సహా ప్రాంతాలవారీగా భూమండలం మొత్తం మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలించి అధ్యయనం చేసి సగటు చేసే వచ్చినదే ఈ 2° ఉష్ణోగ్రతల పెరుగుదల అంచనా. అంతే ఈ 2° సగటుకు ఉష్ణమండలాలలో ఉష్ణోగ్రతలు 6° వరకూ కూడా ఉండగల అవకాశాలూ కారణం.

ఉష్ణోగ్రతలు 15°కి చేరితేనే 350 మిలియన్ ప్రజలు బాధితులు అవుతారు. విపరీతమైన కరువు ఏర్పడుతుంది. అదే 20° సెల్సియస్ సగటుకు 4వందల మిలియన్ ప్రజలు ప్రర్యావరణ సంక్షోభాలకు గురి అవుతారు. కారణం ఆర్కిటిక్ మొత్తం ఇంచుమించు కరిగిపోతుంది. 14 శాతం ప్రపంచం 37 శాతానికి మించిన అత్యధిక ఉష్ణోగ్రతలకు గురికావడం జరుగుతుంది.

గ్లేసియర్ల విస్తీర్ణం అసాధారణ వేగంతో తగ్గిపోతుంది. ప్రపంచంలోని ఇతర గ్లేసియర్ల కంటే మన హిమాలయాలలో ఆ వేగం మరింత ఉధృతంగా ఉంది. గతంలో 28 వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో వున్న గ్లేసియర్లు – ఇప్పుడు – 2000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువకు తగ్గిపోయాయి. సుమారు 500 ఘనపు కిలోమీటర్ల మంచు కరిగిపోయినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. కోట్లాది ప్రజలు మంచినీటి కోసం అల్లల్లాడే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. నాగరికత, ప్రగతి పేరుతో విచ్చలవిడిగా శిలాజ ఇంధన వనరులను మండించిన కారణంగా వాతావరణంలోకి విపరీతమైన స్థాయిలో ఉద్గారాలు విడుదల కావడం, తద్వారా వాతావరణ వ్యవస్థలపై నిరంతర ఒత్తిడి తాలూకు దుష్ప్రభావాలే ఇవన్నీ.

అదే ఈ ప్రకృతి వైపరీత్యాల ఎమర్జెన్సీకి కారణం.

Exit mobile version