అమ్మ కడుపు చల్లగా-28

0
3

[box type=’note’ fontsize=’16’] “కంటికి కనిపించని అణుకాలుష్యం ప్రాణల శరీర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ప్రాణికోటిలో, వాటి జన్యువ్యవస్థలో పెను మార్పులకు కారణం కాగలదు” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

రేడియో ధార్మిక కాలుష్యం:

[dropcap]పౌ[/dropcap]ర అవసరాలైనా, సైనిక అవసరాలైనా వినియోగించడం మొదలుపెట్టాకా అణుశక్తి అణుశక్తే. దానికి విధ్వంసమా, వినియోగమా అన్న భేదం లేదు. మన్‌హట్టన్ మానసపుత్రిక ఫాట్‌మన్ అయినా, ఛెర్నోబిల్ ప్రమాదమైనా, పుకుషిమా ఘటన అయినా మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. గాలి, నేల, నీరులను కలుషితం చేసి వదిలాయి. ప్రాణహాని చెప్పనే అక్కరలేదు. ఇక్కటికీ బాధితులు తమ స్వస్థలాలకు రాగల వాతావరణం లేదు. ఆ ప్రాంతాలు నివాసయోగ్యం కావటానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు.

కంటికి కనిపించని అణుకాలుష్యం ప్రాణుల శరీర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ప్రాణికోటిలో, వాటి జన్యువ్యవస్థలో పెను మార్పులకు కారణం కాగలదు. గత శతాబ్ది ప్రథమార్థంలో నెవడా వద్ద జరిగిన అణు పరీక్షలో పాలుపంచుకొన్న లక్షా డెబ్బైవేల మంది సైనికోద్యోగులలో రికార్డు స్థాయిలో కేన్సర్ కేసులు నమోదయ్యాయి. 1965లో విద్య, ఆరోగ్య సంక్షేమ శాఖ తయారు చేసిన నివేదిక బయటపడిపోవటంతో నెవడా అణుపరీక్షల పరిసర ప్రాంతాలలో పాతికమందికి పైగా లుకేమియాతో మరణించారన్న విషయం బయటపడింది.

1978లో మాజీ సైనికోద్యోగులలో లుకేమియాకు కారణం రేడియో ధార్మికతకు గురి కావడమేనని అమెరికన్ కాంగ్రెస్ ముందు శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు. ‘అట్టా’ మెడికల్ స్కూల్‍కి సంబంధించిన ఒక ప్రొఫెసర్ జరిపిన అధ్యయనాలు అణుపరీక్షా కేంద్రానికి గాలివాలులో వున్న పరిసర ప్రాంతాలలోని చిన్న పిల్లలలో లుకేమియా ప్రమాదం జాతీయ సగటుకు రెండున్నర రెట్లు అధికంగా ఉందని వెల్లడించాయి. ప్రమాణాలను నిర్లక్ష్యం చేసినట్టు రుజువు చేసే రికార్డులను సెనెటర్ కెనడీ కాంగ్రెస్‍కు సమర్పించటం జరిగింది. ప్రత్యేక అధ్యక్ష కమిటీ అణుపరీక్షలు స్ధానికులలో కేన్సర్‍కు కారణమయ్యాయని నిర్ధారించటమే కాకుండా నష్టపరిహారం చెల్లించాలనీ (1980లో) సూచించింది.

అనతికాలంలోనే నెవడావాసులు Vs ప్రభుత్వం కేసులో ‘అట్టా’లోని జిల్లా కోర్టు ప్రజల పక్షాన తీర్పు చెప్తూ రేడియో ధార్మికతకు, ప్రజల కేన్సర్‌కు గల సంబంధాన్ని గుర్తించి నష్టపరిహారం చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించటం జరిగింది.

‘మన్‌హట్టన్’

1942లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కేంద్రం వాషింగ్టన్ లోని ‘హాన్‌ఫర్డ్’ పట్టణం. నాగసాకిపై ప్రయోగింపబడిన ‘ఫాట్‌మన్’కు ప్లుటోనియంను అందించినది ఈ పట్టణంలోని రియాక్టర్లే. అమెరికా న్యూక్లియర్ కార్యక్రమాలకు అనుగుణంగా ‘హాన్‌ఫర్డ్ కాంప్లెక్స్’ విపరీతమైన వేగంతో విస్తరించబడింది. అవసరాలకు తగినంత ప్లుటోనియం ఉత్పత్తి జరిగిందని బావించటం జరిగాకా, ‘బి’ రియాక్టర్ ఉత్పత్తిని నిలిపివేయటం జరిగింది. మిగిలినవన్నీ క్రమంగా మూతబడ్డాయి. 1986లో  మిగిలిన ప్లాంట్ల్స్, ‘ఎన్’ రియాక్టర్లు సైతం పూర్తిగా నిలిపివేయబడ్దాయి.

అయితే మన్‍హట్టన్ పరిసర ప్రాంతాలలోని నిత్యావసరాలు సైతం రేడియో ధార్మికతతో కలుషితమైపోయాయి. ఫలితంగా స్త్రీలలో గర్భస్రావాలు, వికలాంగ శిశువుల జననాలు, చిన్నపిల్లలు బోన్ కేన్సర్‍తో మరణించటం, పశువుల్లో సైతం వైకల్యాలు వంటి దుష్పరిణామాలెన్నో! కారణం – పాలు, కూరగాయలు వంటివి కూడా రేడియో ధార్మిక కాలుష్యానికి గురి కావడం.

అయితే విచిత్రం ఏమిటంటే 1980 వరకు తాము అత్యంత ప్రమాదకరమైన అణు ఆయుధ కర్మాగారాలతో సహజీవనం చేస్తున్నామన్న సంగతి అక్కడి ప్రజలకు తెలియనే తెలియదు. కరేన్ స్టీల్ అనే ఔత్సాహిక జర్నలిస్టు వ్రాసిన ఒక వ్యాసం సంచలనం రేపింది. అది ఒక ప్రైవేటు కంపెనీ ఆ కాంప్లెక్స్‌లో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టడంలో గల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ వ్రాసిన వ్యాసం. తన వ్యాసం రేపిన సంచలనంతో ఆమెలో ఆసక్తి మరింత పెరిగి తన అధ్యయనాన్ని మరింత శ్రద్ధాసక్తులతో సాగించడం జరిగింది. కాకతాళీయంగా అదే సమయంలో ‘Heal’ వంటి సంస్థల ఆరాలూ తీవ్రమయ్యాయి. ‘హీల్’ 1984 నుండి ‘D.o.E’ ని ఆ కాంప్లెక్స్‌కు సంబంధించిన పత్రాలను వెలువరించవలసిందిగా కోరుతోంది.

ఆఖరుకు ‘ఎన్విరాన్‍మెంట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్’, ‘హీల్’ వంటి సంస్థల భగీరథ ప్రయత్నాల అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ 1986లో ఆ పత్రాలను బహిర్గతం చేసింది.

డి.ఓ.ఇ. వెల్లడి చేసిన ఆ పత్రాలు మతులు పోగొట్టే వాస్తవాలను బయటపెట్టాయి. 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆ కాంప్లెక్స్ నుండి అయోడిన్-137 వాతావరణంలోకి వదిలిపెట్టబడింది. 1949లో ప్రయోగం నిమిత్తం రేడియో ధార్మిక పదార్థాలను పరిసర ప్రాంతాల లోనికి నిర్భీతిగా వెలువరించటం జరిగింది. అయితే పత్రాలలో పేర్కొన్న ‘గ్రీన్ రన్’ అన్న సంకేతానికి వివరణ మాత్రం లభించలేదు.

అయితే స్టీల్ అంతటితో వదలలేదు. R.T.I. ను ప్రస్తావిస్తూ కోర్టుకు వెళ్ళారు. ఆమె పోరాటం ఫలితంగా బహిర్గతం అయిన పత్రాలు కాంప్లెక్స్ లోని రియాక్టర్ల నుండి వెలువడిన అణుధార్మిక వ్యర్థాలను వాతావరణంలోకి విచక్షణా రహితంగా వదిలివేసినట్లు వెల్లడించాయి. వ్యవహారమంతా వీధి కెక్కడంతో ఫెడరల్ గవర్నమెంట్‌కు రంగంలోకి దిగక తప్పలేదు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలోని రేడియో ధార్మిక సంబంధిత అంశాలు, సమస్యల అధ్యయనం, నష్టపరిహారానికి అర్హులైన వారి సంఖ్య మదింపు, ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం మున్నగు వాటి నిమిత్తం సాలీనా 5 మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది.

U.S. పర్యావరణ శాఖ, DoE పై ఆరోపణలన్నీ నిరాధారాలని వాదించాయి. అయితే ప్రజలు R.T.I. ను ఆశ్రయించి సంబంధిత డాక్యుమెంట్లను పొందాక తమ వాదనలను ఉపసంహరించుకోక తప్పలేదు. పై సంఘటన కొలరాడో, సవాన్నా వంటి మిగిలిన చాలా అణు కర్మాగారాల జాతకాలు వెల్లడి కావడానికి కారణమైంది. న్యూమెక్సికో లోని యురేనియం గనుల పరిసరాలలో రేడియో ధార్మిక వ్యర్థాలను వదిలివేయడమూ వివాదాస్పదమైంది. ఆ నేపథ్యంలో U.S. ప్రభుత్వానికి తన అణు విధానాన్ని సమర్థించుకునే అవకాశమే లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here