అమ్మ కడుపు చల్లగా-43

0
2

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

[dropcap]2[/dropcap]021లో సముద్రమట్టాలు 1993లో కంటే పెరిగాయని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. కరుగుతున్న మంచు కారణంగా లవణీయత లోనూ మార్పులు వచ్చి సముద్ర జలాల సాంద్రతలోనూ మార్పులు వస్తున్నాయి. సముద్ర జలాల ప్రవాహ విద్యుత్తులోనూ మార్పుల ఫలితంగా ఉష్ణోగ్రతలు సముద్రజలాల ద్వారా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి వాతావరణం మరింత వేడెక్కడానికి కారణం అవుతున్నాయి.

2022లో జరిగిన అధ్యయనాలు – పరిశోధనలు – 2025 నాటికి ‘గల్ఫ్ స్ట్రీమ్’ వ్యవస్థ సాంతం దెబ్బ తినగలదని సూచిస్తున్నాయి. ‘AMOC’ వ్యవస్థ ఉత్తర ధ్రువ ప్రాంతాలకు చేరే వేడి సముద్ర జలాలు అక్కడ చల్లబడి ఇంకి శక్తివంతమైన అట్లాంటిక్ కరెంట్‍లకు కారణం అవుతుంది. కానీ గ్రీన్‌లాండ్ హిమశిఖరాల నుంచి కరిగివచ్చే నీటికి మరొకొన్ని ప్రాకృతిక పరిణామాలు జతపడి అట్లాంటిక్ కరెంట్స్‌ను బలహీనం చేస్తున్నాయి.

సాధారణంగా మధ్యధరా సముద్రం మీద నుండి వచ్చే చల్లని గాలులు యూరప్ దేశాలకు ఉపశాంతి వంటివి. ఈ ఏడాది గ్లోబల్ వార్మింగ్‍కు తోడు ఎల్‍నినో ప్రభావం కూడా జతపడడంతో యూరప్ లోనూ మామూలు కంటే 10-15 సెల్సియస్‍ల నడుమ  ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవువుతున్నాయి. సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా ప్రభావం చూపుతున్నాయి. మధ్యధరా జలాలపై నమోదవుతున్న 25 – 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు యూరప్ ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆ కారణంగా వేడి గాలులు వీచే సమయమూ గణనీయంగా పెరిగిపోతోంది.

NOAA డేటా ప్రకారం 1960తో పోలిస్తే అమెరికా లోని 50 ప్రముఖ నగరాలలో ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడుతున్న వేడి గాలుల సీజన్ నెలన్నరకి పైగా పెరిగిపోయింది. ఫీనిక్స్ అరిజోనాలో జాతీయ వాతావరణ శాఖ వేడిగాలులు మరొక వారం కొనసాగగలవనీ, ఉష్ణోగ్రతలు 29-47 డిగ్రీల సెల్సియస్ ఉండగలవనీ హెచ్చరికలు జారీ చేసింది.

సముద్రమట్టాలు పెరుగుతూ పోతే –

ప్రస్తుతం ఉన్న రీతిలోనే సముద్రమట్టాలు పెరుగుతూ పోతే భూమండలం మీద కొన్ని తీరప్రాంతాలు సముద్రంలో మునిగిపోతాయని శాస్త్రజ్ఞులు ఎంతో కాలంగా ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

వారి అంచనా ప్రకారం –

చైనా తీరప్రాంతం 43 మిలియన్లు – వారికి ముప్పు. బంగ్లాలో 32 మిలియన్లు నిరాశ్రయులు కానున్నారు. భారతదేశంలో 27 మిలియల్న మంది ప్రభావితం అవుతారు. చిన్నా, చితకా, పెద్ద ఇలా – 12 దీవులతో కూడిన మాల్దీవులలో 77% కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. 1,20,000 జనభా గల కిరిబాటి సైతం 2/3 భూమిని కోల్పోతుంది. జకార్తా చాలా స్పీడ్‍గా సముద్రంలో కలిసిపోతున్నట్లు ఎర్త్ ఆర్గనైజేషన్ డేటాలు చెప్తున్నాయి. అమెరికాలో న్యూయార్క్ నగరం ముంపుకు గురికానుంది.

ఈ ప్రకృతి విపరిణామాలన్నింటికీ కారణం మానవుల స్వార్థపూరిత కార్యకలాపాలే. అభివృద్ధి పేరుతో భూగర్భ జలలాను విచక్షణా రహితంగా తోడివేయటం జరుగుతోంది. వివిధ పారిశ్రామిక కార్యకలాపాలకై వినియోగించబడిన స్వచ్ఛమైన భూగర్భ జలాలు విషపూరితాలై నదులలోను, తద్వారా సముద్రంలోను కలుస్తున్నాయి. ఆ కారణంగా సముద్రమట్టాలు కొంత మేరకు పెరుగుతున్నాయి. పర్యవసానం గురించి ఆలోచించక చేస్తున్న ఇటువంటి కార్యకాలాపాల కారనంగా భూమి సమతౌల్యత సైతం దెబ్బతింటోంది. సంక్లిష్టమైన ప్రకృతి వ్యవస్థలు దెబ్బతినడంలో ఆశ్చర్యం ఏముంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here