[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
ఉన్న అటవీ వ్యవస్థలను రక్షించుకోవడం తక్షణ కర్తవ్యం
[dropcap]వాం[/dropcap][dropcap][/dropcap]కోవర్ లోని పురాతన అరణ్యాలలో 80% చెట్టు ఇప్పటికే కొట్టివేయబడ్డాయి. ‘ఏన్షియంట్ ఫారెస్ట్ అలయెన్స్’ సహ వ్యవస్థాపకుడు టి.జె. వాట్ – ప్రమాదంలో ఉన్న పురాతన అటవీ వ్యవస్థలన్నింటిని సంరక్షించుకోవాలని, ప్రపంచం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇది యుద్ధ ప్రాతిపదికన చేపట్టవలసిన చర్య అనీ ఆయన అన్నారు. ఈ పురాతన అటవీ వ్యవస్థలు శతాబ్దాల పరిణామక్రమంలో సహజ సిద్ధంగా రూపుదిద్దుకున్నవి. ఈ వ్యవస్థల వైవిధ్యం మనం చేపడుతున్న ‘అడవుల పెంపకం’లో ప్రక్రియలో అసాధ్యం.
ప్రపంచంలోనే సహజసిద్ధమైన అద్భుతంగా భావించబడే అది పెద్ద వృక్షం మన దేశంలోని ‘ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్’ (హౌరా) లో ఉంది. 80 అడుగుల పొడవైన ఈ వృక్షం రమారమి 3 ½ ఎకరాలలో విస్తరించి వుంది.
250 సంవత్సరాల వయసు గల ఈ మర్రిచెట్టు ప్రపంచంలోనే అత్యంత విశాల ఛత్రఛాయ గలిగిన చెట్టు.
కెనడాలోని ‘ఫసిఫిక్ రిమ్ నేషనల్ పార్క్ రిజర్వ్’ లో ఉన్న 182 అడుగుల పొడవున్న వృక్షం మ్రాను చుట్లు కొలత 19 అడుగులు.
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా విరాజిల్లుతున్న వృక్షం ‘జయంట్ సెక్వోయియా’. 52,500 ఘనపుటడుగుల పరిమాణం గల ఈ వృక్షం సెక్వోయియా నేషనల్ పార్క్‌లో ఉంది. ఈ జాతి వృక్షాలు అగ్నిప్రమాదాలు/కార్చిచ్చుల బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతోంది.
ప్రపంచంలోనే అతి పొడవైన యూకలిప్టస్ చెట్టు ఆస్ట్రేలియాలో ఉంది. ఈ యూకలిప్టస్ చెట్టును ‘సెంచూరియన్’ గా వ్యవహరిస్తారు. పుష్పించే వృక్షాలలో ఇది అతి పొడవైనది. కలప అతి దృఢంగా ఉండే చెట్ల లోనూ ఇదే పొడవైనది. ఇది 2019 నాటి కార్చిచ్చుల నుండి వెంట్రుకవాసిలో బయటపడింది.
4,854 సంవత్సరాల పురాతనమైన ‘బ్రిస్టల్ కోన్’ ట్రీ – అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో రక్షింపబడుతోంది. కాలిఫోర్నియాలోని తూర్పు ప్రాంతాలలో అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలో సైతం నిలదొక్కుకొని మనగలుగుతున్న ఈ చెట్లు తమ బెరడులో 90% పోగొట్టుకొన్నప్పటికీ బ్రతకగలగడం విశేషం. ఈ చెట్ల కలప దృఢంగా ఉండే ‘రెసిన్’తో కూడి ఉంటుంది. సంక్షోభాలను కట్టుకొని నిలబడగల బ్రిస్టల్ కోన్ చెట్లలోని ఈ విశిష్టత వాటిని దీర్ఘాయష్షు గల వృక్షాలుగా నిలుపుతోంది.
పొడవు అధికంగా ఉండే చెట్లజాతులు అధికంగా ఉన్న రాష్ట్రం అమెరికా లోని కాలిఫోర్నియా.
పైన్ కుటుంబానికి చెందిన సిడార్ చెట్లు సాధారణంగా 100 నుండి 300/400 సంవత్సరాలు బ్రతుకుతాయి. వీటి కలప చక్కని ఎరుపురంగును కలిగి ఎండి దృఢంగా ఉంటుంది. త్వరగా చెడిపోదు. అట్లాస్, సైప్రస్, లెబనీస్ సిడార్, డియోడర్ వంటి ఉపజాతులున్న ఈ సిడార్‍లలో ఎర్రని వర్ణాని కలిగి ఉండి, సువాసనతో ఉండే కలపని సుగంధ ద్రవ్యాలలో వాడతారు. అటువంటి ‘సిడార్’ జాతిలో అతిపురాతనమైన వృక్షం వయసు 100 సంవత్సరాలు. దాని ఎత్తు 150 అడుగులు, చుట్టుకొలత 17 ½ అడుగులు. ఇలా పరిసరాలకు, వాతావరణానికి తగినట్లుగా ప్రాణులు చిన్న చిన్న సర్దుబాట్లుగా మనగలగడానికి చేసే ప్రయత్నాలలో భాగం గానే వ్యవస్థలలోనూ వైవిధ్యాలు రూపుదిద్దుకుంటాయి.
ఐ.రా.స. ‘ట్రిలియన్ ట్రీస్’ ఉద్యమం మాజీ శాస్త్రీయ సలహాదారు Thomas Crowther చెట్లు నాటడం అన్న విధానం అనుకున్నంత సత్ఫలితాలను ఈయలేదని, కనుక ఆ ప్రక్రియను ఆపివేసి మరింత మంచిదానిని ఎంచుకోవాలనీ అంటున్నారు. 2019లో ఆయన భూమి 12 ట్రిలియన్ చెట్లను భరించగలదని వాతావరణ సమస్యలన్నిటికీ పచ్చదనం అతి సులభమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నాం కాబట్టి ట్రిలియన్ చెట్లను పెంచడాన్ని ఉద్యమంగా భావించి చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆయన అధ్యయనాలు వెలువరించిన ఫలితాలకు అప్పట్లో విశేషమైన స్పందన వచ్చింది. “ట్రిలియన్ చెట్లను నాటడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలమని అనుకున్నాం. చక్కటి పరిసరాలను రూపొందించుకోలగుతామని భావించాం. కానీ అలా జరగలేదు. ‘చెట్టు నాటడం’ అన్న ప్రక్రియను ఉద్గారాలను తగ్గించణానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకొన్నారు. అనుకున్న రీతిలో జీవవైవిధ్యమూ పెంపొందలేదు. కర్బన ఉద్గారాలూ తగ్గలేదు. అందువలన ఆ ప్రక్రియను అక్కడితో ఆపివేసి ఉన్న అరణ్యాలను సంరక్షించుకోవడంపై శ్రద్ధ పెట్టాలి” అని ఆయన అన్నారు. మొన్న క్లయిమేట్ సమితిలో మాట్లాడుతూ Crowther – సంపదను ఇండిజినస్ సమూహాలకు అందించడం ద్వారా – ఉన్న అడవులను వాటితో సహజీవనం చేస్తునవారి ద్వారానే, సహజరీతిలోనే అభివృద్ధి చెంది విస్తరించేలా కృషి చేసేలా నిధులను, సహాయ సహకారాలను అందించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత అధిక మొత్తంలో కార్బన్ డై యాక్సైడ్‍ను శోషించుకోగలుగుతాయి. అది వివేకవంతమైన చర్య అవుతుందని అన్నారు.
‘షెల్’ వంటి కంపెనీలు వందల మిలియన్ డాలర్లు – అడవులను పెంచి అభివృద్ధి చేసేందుకు కేటాయించాయి. ఎలాన్ మస్క్ మిలియన్ డాలర్స్ విరాళంగా ఇచ్చారు. అయినా ఉద్గారాలు నియంత్రణలోకి రాలేదంటే మనం మరింత మంచి దారిని ఎంచుకోవాలి అని ఆయన పిలుపు నిచ్చారు.
Images Source: Internet