[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
[dropcap]‘ఆ[/dropcap]ర్కిటిక్ కౌన్సిల్’ ఒక ప్రాంతీయ సంస్థ. ఇది రష్యా, అమెరికా, స్వీడన్, ఫిన్‌లాండ్, నార్వే, కెనడా, డెన్మార్క్, ఐస్‍లాండ్‌ల పరస్పర సహకారం, సమన్యాయంలతో పని చేస్తుంది. రష్యాతో తెగతెంపులతో ఆ సహకారానికి గండి పడింది.
రష్యాను ఒంటరిని చేయడంతో పర్యావరణానికి సంబంధించిన పరిశోధనలకు అవరోధం ఏర్పడింది. అక్కడే హైడ్రాలజీ, పెర్మాఫ్రాస్ట్ వంటి అంశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేసేవారి రీసెర్చ్‌కి అవరోధం ఏర్పడిందని గ్లేసియాలజిస్ట్ ఆండ్రూ హడ్సన్ అంటున్నారు. రష్యా ఆర్కిటిక్‌లో సగానికి పైగా కవర్ చేస్తోంది. ఆర్కిటిక్‌లో పరిణామాలు యూరప్, కెనడా, U.S భాగాలనూ ప్రభావితం చేస్తాయి.
పెర్మాఫ్రాస్ట్ రష్మాలో చాలా అధిక మొత్తంలో ఉంది. భూమండలం మొత్తానికి అది టైమ్ బాంబ్ వంటిదని శాస్త్రజ్ఞుల అంచనా. పర్యావరణానికి సంబంధించి ఇంత కీలకమైన భాగస్వామ్యం ఉన్న రష్యాతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంతో శాస్త్రజ్ఞల నడుమ పరిశోధనలకు సంబంధించిన డేటా మార్పిడి ఆగిపోయింది.
వాతావరణం లోనికి వివిధ మానవ ప్రేరిత కార్యకలపాల ద్వారా విడుదల అవుతున్న హరితగృహవాయువుల వలన ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం ప్రస్తుతం ప్రధానమైన తీవ్రమైన సమస్య. వాతావరణంలోని CO2 ను సమీకరించి భద్రపరచడం ద్వారా దానివలన కలుగుతున్న దుష్ప్రభావాలను కొంతమేరకు తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే కేప్చర్ చేయబడిన CO2 ను ఎట్లా హానిరహితంగా నిర్వహించాలన్నది శాస్త్రజ్ఞుల ముందు ఉన్న చాలా పెద్ద ప్రశ్న. సుగర్‍కు CO2 ను విచ్ఛిన్నం చేయగల శక్తి ఉంది. కార్బన్ మోనాక్సైడ్ వివిధ రకాలైన రసాయనాలను తయారు చేయగల బిల్డింగ్ బ్లాక్. ఇది ఒక వినూత్నమైన/విలక్షణమైన కేటలిస్ట్. అతి శక్తివంతమైన, హానికారకమైన హరితగృహవాయువులను వినియోగ యోగ్యమైన, విలువైన ఉత్పత్తిగా మార్చడంలో సహకరిస్తుంది.
మోలిబ్‍డెనమ్ (Molybdenum) కార్బైడ్ అతి దృఢమైన సిరామిక్ మెటీరియల్. ఇది విస్తారంగా లభిస్తుంది. ఖర్చు తక్కువ. ఎక్కువ విలువైనదీ కాదు. మోలిబ్‍డెనమ్, సుగర్‍ల సమన్వయంతో కేప్చర్ చేసిన CO2 ను పనికొచ్చే రీతులలోనికి మార్చడానికి నార్త్ వెస్టర్న్ యానివర్శిటీ వంటివి పరిశోధనలు చేస్తున్నాయి.
డా. మార్క్ లిటిల్ – హెరియట్ వాట్ యూనివర్శిటీకి చెందిన మెటీరియల్ సైంటిస్ట్. ఈయన పోరస్ మెటీరియల్స్‌పై విస్తారంగా పరిశోధనలు చేస్తున్నారు. CO2, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ వంటి వాటిని వేగంగా నిల్వ చేయగలిగే విధానాలను రూపొందించే దిశగా పరిశోధనలు/కృషి చేస్తున్నారు. తన పరిశోధనలతో భాగంగా ఆయన అణువులు కొత్త పోరస్ మెటీరియల్ లోనికి తమను తాము ఎలాగ సమీకరించుకుంటాయో కంప్యూటర్ మోడల్‌లో అంచనా వేశారు. ఈ పోరస్ మెటీరియల్ చెట్ల కంటే వేగంగా CO2 ను శోషించుకుంది. సౌతాంప్టన్, లివర్‍పూల్, లివర్‍పూల్ యూనివర్శిటీ, చైనా, ఇంపీరియల్ కాలేజీ వంటివి ఈ పరిశోధనలలో పాలు పంచుకుంటున్నాయి. అతిపెద్ద ఉపరితల వైశాల్యంతో 2D బోరాన్ నిర్మాణం చేపట్టబడింది. ఇది పవర్ ప్లాంట్స్ వెలువరించే ఉద్గారాలను (గ్రీన్‌హౌస్‍గ్యాసెస్) శోషించుకోగలదు.
ఐస్‌లాండ్ లోని ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన ఒక మోడల్ నేరుగా గాలిలో నుండి కార్బన్‌ను విడదీసి బంధించగలదు. ఈ ప్లాంట్, ‘A.G. Mammoth – C.A.R. Plant’ ఏడాదికి సుమారుగా 36000 టన్నుల కార్బన్‍ను కేప్చర్ చేయగలదు. డైరక్ట్ ఎయిర్ కేప్చర్ – ‘DAC’ టెక్నిక్‍తో అభివృద్ధి చేయబడిన మోడల్ అది. ఆవిష్కారల సంగతి అలా ఉంఛితే ఉద్గారాల విడుదలను నియంత్రించ గలిగితేనే ఏ పరిష్కార మార్గాలైనా సత్ఫలితాలనీయగలవన్నది మాత్రం నిష్ఠుర సత్యం.