[dropcap]స[/dropcap]మాజంలో జరుగుతున్న సమస్యలపై 68 కవితాత్మక స్పందనలున్న పుస్తకం ఇది.
“ప్రతి కవితలో రచయిత సరళమైన పదములను ఉపయోగించి సామాన్య ప్రజానీకానికి అర్థమగు రీతిలో, చిన్న చిన్న పదములతో హృదయమును ఆకట్టుకొనుచున్నవి. రచయిత తన కవిత్వములో మనస్సులో చొచ్చుకునే విధంగా మనిషిలో మార్పులు దోహదపడే వీరి కవితలు స్పష్టంగా అగుపడుచున్నవి. అందులో కాసుల కష్టాలు, లక్షణం, ప్రాణం తీసిన ఫోను, ఉద్యమకారుడు, దుశ్చర్యలు, విద్యాబోధన, వితంతు, చదుల, కల్తీ నకిలీలు, మా ఊరు.. మొదలగు కవితలలో రచయిత తన కవిత్వంలో వాస్తవములను బద్దలు కొట్టినట్టు, ఉన్నది ఉన్నట్టు తెలిపినారు” అని కె. కృష్ణారెడ్డి ‘సందేశం’ తెలిపారు
“ఇతని కవిత్వం స్వచ్ఛమైన జలధారలా, చల్లని గాలి లాగా, పరిశుభ్రమైన ప్రవాహం లాగున్నది” అని ‘కమ్మని కవితల అమ్మ మాట’ అనే ముందుమాటలో డా. ఉదారి నారాయణ రాశారు.
“రచనల ద్వారా పల్లె పేదలను, దళిత కులాలను, వారి బాగోగులను పాఠకుల దృష్టికి తీసుకువచ్చి వారి పట్ల తనకున్న ప్రేమాభిమానాలను, సమాజానికి ఉండవలసిన బాధ్యతలను గుర్తు చేశారు” అని సాహిత్య రత్న డా. జి.ఆర్. కుర్మె రాశారు.
***
(సమాజంలో జరుగుతున్న సమస్యలు)
(కవితా రూపం)
రచన: కమ్మల నర్సిములు
పేజీలు: 68
వెల: రూ. 70/-
ప్రతులకు:
కె. రవీందర్,
ఇంటి నెంబరు 3-188/7, టైలర్స్ కాలనీ,
ఆదిలాబాద్.
సెల్: 8978367494