[box type=’note’ fontsize=’16’] “మనకు ప్రేమానురాగాలు పంచి నిలువెత్తు మనిషిని చేసి, ఇంకా ఏదో చేయాలని పరితపించే త్యాగశీలి అమ్మ” అంటూ అమ్మ గొప్పదనం వివరిస్తున్నారు కయ్యూరు బాలసుబ్రమణ్యం ఈ కవితలో. [/box]
[dropcap]మ[/dropcap]నకు జన్మనిచ్చి తనకు పునర్జన్మనిచ్చుకుని
జీవానికి రూపాన్నిచ్చే అపురూప అనురాగ దేవత
నిత్యం కోవెలలో కొలిచే దైవం- అమ్మ
మనకళ్ళల్లో ఆనందం కోసం తనకళ్ళు కాయలుకాసేలా
మన కోసం నిరంతరం శ్రమించే శ్రమైక జీవి
ఎన్ని జన్మలెత్తిన ఋణం తీర్చుకోలేని అమృత మూర్తి -అమ్మ
మనకు ప్రేమానురాగాలు పంచి నిలువెత్తు మనిషిని చేసి
తను రోగిల బారిన పడినా చలించని సహనశీలి
గర్భగుడిలో నిత్యం వెలిగే దీపం – అమ్మ
మనం ఎంతఎత్తు ఎదిగిన చిన్నపిల్లలే అనుకుని
ఇంకా ఏదో చేయాలని పరితపించే త్యాగశీలి
కంటికి రెప్పలా కాపాడే ప్రేమ మూర్తి -అమ్మ