[dropcap]న[/dropcap]వమాసాలు నిను కడుపున మోసే తల్లి,నీ బరువు తను
మోయలేనెమో అని తలచి
నిను దూరం చేసి ఉంటే…..
నీకు జన్మనిచ్చు సమయాన
తన ప్రాణాలకే ప్రమాదం అని
తలచి ఉంటే,రాగలవా! నీవు
తల్లి గర్భం నుండి భూ మాత
ఒడిలోకి, ఈ ప్రపంచము లోకి
కనీ పెంచి,నీ అభివృద్దే ధేయంగా, కష్టాలను సయితం
భరించి ఉండక పోతే, కాగలవా!
నీవు… ఓ డాక్టర్, యాక్టర్, లాయర్, ఇంజినీర్… ఎవరైనా…
ప్రపంచాన్ని శాసించే వారైనా…
చరిత్ర పుటల్లోకి ఎక్కిన వారైనా
రాజకీయ నాయకులయినా,
ఓ… తల్లికి బిడ్డలన్న సంగతి
మరువక నేస్తమా!
సృష్టి కి మూలం స్త్రీ మూర్తి యని, స్త్రీ లను గౌరవించని
సంస్కృతి వ్యర్ధమనీ
తెలుసుకో మిత్రమా!
భూమాత లాంటి తల్లిని
విడనాడితే, రావా భూకంపాలు
తల్లి కంట కన్నీరొలికితే
కావా! అవి సునామీలు…
తల్లి ఆకలి తీర్చకుంటే
ఆమె ఆకలి మంటలు కావా!
దహించే అగ్ని జ్వాలలు
ఎవరి తల్లిదండ్రులను, వారు
అక్కున చేర్చుకొని, బిడ్డలవలె
ప్రేమతో ఆదరిస్తే, అభిమానిస్తే
పులకించదా! ప్రకృతి మాత
పరవశించదా! ధరణి మాత
ఆనందించదా! భారత మాత.