అమ్మలాంటి పార్కు

0
2

[dropcap]ఎ[/dropcap]ప్పుడు నేను వెళ్ళినా ఈ పార్కు అమ్మను గుర్తుకుతెస్తుంటుంది.
ముఖద్వారం అమ్మ పలికే ఆహ్వానంలా అనిపిస్తుంది,
ఈబెంచిలన్నీఅమ్మ ఒడిలా కనిపిస్తాయి.
ఇక్కడి మొక్కల ఆకుల్లో కనబడే చెమ్మతనం
అమ్మకన్నులలోని వాత్సల్యపు తడిని ప్రతిబింబిస్తాయి.
ఈ మట్టి స్పర్శ అమ్మచేతి స్పర్శలా,
ఇక్కడి చల్లదనంఅమ్మ మమతల మాధుర్యంలా,
ఇక్కడి పచ్చదనం అమ్మ వదనంలోని వాత్సల్యంలా,
ఈ వాతావరణం అమ్మఅంతరంగాన్నితెలియజేస్తున్నట్లుగా
ఉంటాయి.
ఈ మౌనం అమ్మ వదనంలోని ఆహ్లాదాన్ని
ఇక్కడి అణువణువు అమ్మ సాన్నిధ్యాన్ని
గుర్తుకు తెస్తూ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here