డా. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు 2022, 2023 – ఇందూరు అపురూప అవార్డ్స్ 2021, 2022, 2023 – వివరాలు

0
2

[dropcap]ని[/dropcap]జామా‌బాద్‌ జిల్లాకి చెందిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, విదుషీమణి, మహిళా శ్రీకృష్ణదేవరాయలు – బడి – గుడి – సాహిత్యాలకి అసమాన సేవలను అందిస్తున్న డా. అమృతలత (ఆర్మూర్) వివిధ రంగాలకి చెందిన ప్రముఖులకి అపురూపమైన పురస్కారాలను అందజేస్తున్నారు.

2013 సంవత్సరం నుండి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను, అపురూప పురస్కారాలను అందజేస్తున్నారు (12-5-2103న మొదలుపెట్టారు). ఇందూరు అపురూప అవార్డులను కూడా నిజామాబాద్ జిల్లా ప్రముఖులకు అందజేస్తున్నారు (20-10-2013న మొదలుపెట్టారు).

వచ్చే నెల మార్చి 5వ తేదీన 2022, 2023 సంవత్సరాలకి అమృతలత జీవన సాఫల్య పురస్కారాలని; 2021, 2022, 2023 సంవత్సరాలకి ఇందూరు అపురూప పురస్కారాలను అందజేయబోతున్నారు.

  • 2022 సంవత్సరానికి గాను ఆచార్య మసన చెన్నప్ప, శ్రీ సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీ బ్నిం గార్లకు
  • 2023 సంవత్సరానికి గాను శ్రీ సింహ ప్రసాద్, డా. రాధేయ, శ్రీ దాస్యం సేనాధిపతి గార్లకు

అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు.

ఇందూరు అపురూప అపురూప అవార్డులను 2021 సంవత్సరానికి శ్రీ కందకుర్తి యాదవరావు, తాళ్ళ లక్ష్మీనారాయణ గౌడ్, మేడిచర్ల ప్రభాకరరావు, అఖిలాండేశ్వరి గార్లకు; 2022 సంవత్సరానికి చిన్నికృష్ణుడు, వి. ప్రభాదేవి, లలితావర్మ, డా. గణపతి అశోకవర్మ గార్లకు; 2023 సంవత్సరానికి గాను పొద్దుటూరి మాధవీలత, డా. బాలాష్టు మల్లేశ్, రచ్చ నరేష్, కళాగోపాల్ గార్లకు అందజేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా డా. ఏనుగు నరసింహారెడ్డి పాల్గొంటున్నారు. ప్రముఖ రచయిత్రులు శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, శ్రీమతి కిరణ్ బాల తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి వేదికగా నిజామాబాద్ జిల్లా లోని మామిడిపల్లి, ఆర్మూర్ రోడ్ లోని ‘శ్రీవారి అపురూప కళ్యాణ మండపం’ నిలవనుంది.  మామిడిపల్లిలో డా. అమృతలత గారి చేత నిర్మింపబడిన శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఈ కళ్యాణ మండపం నిర్మితమయింది.

నా తరఫునా, సంచిక అంతర్జాల పత్రిక పక్షాన నిర్వాహకులకు, పురస్కార గ్రహీతలకు, పురస్కార ప్రదాతలకు అభినందనలు అందజేస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here