అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!! – త్వరలో – ప్రకటన

1
2

[dropcap]త[/dropcap]న పాటలతో సినిమాలను సూపర్ హిట్‌లుగా నిలిపిన ఏకైక గేయ రచయిత అతడు.

సంగీత దర్శకులను తన ఇంటికి రప్పించుకుని తనకు నచ్చిన బాణీ కడితేనే పాట రాసే గేయ రచయిత అతడు.

ఆ గేయ రచయితకు నచ్చకపోతే సంగీత దర్శకులనే కాదు, నాయికా నాయకులనూ మార్చేసేవారు.

సినిమా స్క్రిప్టు నచ్చితేనే పాటలు రాస్తాడతడు.

తాను చెప్పినట్టు చేసి, ఆడమన్నట్టు ఆడే నిర్మాతలతోనే పనిచేసేవాడతడు.

ఆయన కవితలనేకం సినిమా పాటలుగా మారి సూపర్ హిట్ అయ్యాయి.

ఆయన జీవితం ఆధారంగా ఓ డజను సినిమాలు రూపొందాయి.

నిజజీవితంలోనూ, ఆయన ప్రేమకోసం ఎంతగా తపించేవారంటే, ఆయన తాగి పారేసిన సిగరెట్ పీకలు దాచుకునేవారు.

ప్రేమిస్తున్నామని వెంటపడేవారికి, ప్రేమ పనికిరానిదని పాటలు రాసి అంకితమిచ్చాడతడు.

రచయితలకు విలువలేని సినీ ప్రపంచంలో తన పాటే శాసనంగా రారాజుగా నిలిచిన గేయ రచయిత అతడు.

క్లబ్బు డాన్సు పాటల్లో అంతులేని తాత్వికతను గుప్పించి మెప్పించాడు. ప్రేమ గీతాల్లో లైగింకతను ప్రదర్శించి అలరించాడు. క్షణకాలమే మన స్నేహాలన్నీ అంటూ రొమాంటిక్ గీతాలు రాశాడు.

ఎవరినీ గౌరవించని సినీ ప్రపంచంలో, ఎవరినీ లెక్కచేయకుండా, నచ్చినట్టు రాసి, నచ్చినవారితోనే పనిచేసి తన మాట చెల్లించుకున్న ఏకైక గేయ రచయిత.. అందమైన గీతాలకు మాహిర్ అనిపించుకున్న సాహిర్!!!!

దిలీప్ కుమార్, గురుదత్ వంటి కళాకారుల సినిమాలను విశ్లేషించిన పి. జ్యోతి సంచిక పాఠకులకోసం వారం వారం అందిస్తున్న సాహిర్ లూధియాన్వీ పాటల విశ్లేషణ శీర్షిక

అందమైన గీతాల  రచనకు  మాహిర్సాహిర్!!!

వచ్చేవారం నుంచే ఆరంభం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here