[dropcap style=”circle”]వి[/dropcap]ళంబి నామ సంవత్సర (2018) ఉగాది కవితల కూర్పు ఈ పుస్తకం. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకి చెందిన బస్తి యువక బృందం 53 కవితల ఈ కవితా సంకలనాన్ని ప్రచురించారు.
***
***
“పన్నెండేళ్ళు – పన్నెండు కవితా సంకలనాలు. కాల ప్రవాహంలో కొత్త గొంతుకలను వినిపిస్తూ, కొత్త స్వరాలను పరిచయం చేస్తూ, కొత్త హృదయాలను ఆలింగనం చేసుకుంటూ నేడు మీ చేతుల్లో ఓ అందమైన పుష్పగుచ్చంగా నిలిచింది ‘అనప పువ్వులు’.
గతంలో లాగే ఈ ఏడు కూడా బస్తీ యువక బృందం ద్వారా వెలువడిన ఈ కవితా సంకలనం కొత్త భావాలు సువాసనలతో కొత్త స్వరాల కలవాలతో ఉగాదికి ఆత్మీయంగా స్వాగతం పలికింది. దీనిలో అనుభవజ్ఞులైన కవులతో పాటు, కొత్త కవులూ ఉన్నారు. వస్తు వైవిధ్యంతో పాటు, వస్తువును, కవితా నిర్మాణం సమన్వయాన్ని సాధించడంలో వర్ధమాన కవులు పరిణతి ప్రదర్శించారు. కాని తెలంగాణ మాండలికం కవితలు, జానపద సాహిత్యం తొలిసారిగా చోటు చేసుకోవడం గమనార్హం” అన్నారు టి.ఆర్. శ్రీనివాస ప్రసాద్ తమ ముందుమాట “కాంతి జలపాతంలా కవిత్వం”లో.
***
128 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-
ప్రతులు – డా. ఎన్. వసంత్, బస్తి యువక బృందం, 2/1097, బస్తి, ఆవులపల్లి రోడ్డు, హోసూరు, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు -635109 – వద్ద లభ్యం.