అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – మాల్దీవ్స్

0
2

[dropcap]ప్ర[dropcap]పంచంలో ఎన్నో అందమైన దీవులున్నాయి. వాటిల్లో కొన్నింటినైనా సందర్శించి పరవశించే అవకాశం మాకు కలిగింది. ఈ వ్యాసంలో మా మాల్దీవ్స్ పర్యటన గురించి వివరిస్తాను.

మాల్దీవ్స్‌ని గేట్‌వే ఆఫ్ ప్యారడైస్ అంటారు. స్వర్గానికి దారి అని అంటారు. నేను మావారు, మా వారి టెన్నిస్ ఫ్రెండ్స్ మూడు జంటలు, ఒక జంట ప్రొఫెసర్ సింగ్ గారు, వారి సతీమణి ప్రొఫెసర్ జ్యోతి గారు, ఆంజనేయులు గారు వారి సతీమణి యశోద గారు కలిసి ప్రయాణం పెట్టుకున్నాం. 40 సంవత్సరాల క్రితం ఈ టూరిజంను ఎందుకో ప్రోత్సహించలేదు కానీ, ఇప్పుడు ఎంతో తక్కువ డబ్బుతో ప్యాకేజీలు ఇచ్చి అందరూ యాత్రికులను ఆహ్వానిస్తున్నారు‌. వివిధ దీవులలో 98 హాలిడే రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు రెండువేల దీవులు ఉన్నాయి. మాల్దీవుల ముఖ్య పట్టణం ‘మాలే’. హుల్ హులే అనే దీవిలో ఉంది. దీనిని ప్యారడైస్ అంటారు. ఇక్కడ అన్ని విదేశాలలోని సముద్రాలలో – ప్రపంచ దేశాలలో సముద్రపు అడుగున ఉన్న సంపదను పోలిస్తే ఇక్కడ ఉన్న విస్తీర్ణమైన స్థలం వేరే ఎక్కడా లేదు అని అంటారు.

బయలుదేరాలి అనుకున్నడు కోవిడ్ టెస్ట్ చేయించుకుని వాటి ఫలితాలు 48 గంటల ముందు మనం ప్రజెంట్ చేస్తే మాల్దీవ్స్‌కి వెళ్లడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మేము ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి 6 గంటలకు విమానాశ్రయంలో ఉన్నాము. 6 గంటలకు బయలు దేరితే 9:30కి మేము బెంగుళూరులో ఉన్నాము. బెంగళూరు నుంచి మళ్లీ మాకు ఫ్లైట్ మాల్దీవ్స్‌కి పది గంటలకి ఫ్లైట్ ఉంది. అక్కడికి మేము 1:00కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే చక్కటి ప్లకార్డ్ పట్టుకొని వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మేము ప్యాకేజీ టూర్‌లో వెళ్ళాము. ఎంతో ఖరీదైన పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నీ కోవిడ్ వల్ల చాలా తక్కువ డబ్బుకి అద్దె ఇస్తున్నారు. ఆ ప్యాకేజీలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా సామాను అంతా ఒక చోటికి చేర్చారు. చేర్చి అక్కడ వాళ్ళు “ఇంకొక ఫ్లైట్లో ఇంకా ఇద్దరు వస్తున్నారు. అందరం కలిసి పడవలో వెళ్దాము” అని చెప్పారు. ఈ లోపల మా సామానంతా ఒక చోట పెట్టి విమానాశ్రయం నుండి బయటికి రాగానే మొత్తం సముద్రం కనిపిస్తుంది. చక్కటి నీలం రంగుతో ఉన్న ఆ సముద్రం వద్ద ఫొటోస్ దిగాము. ఇంత లోపల మమ్మల్ని పదండి పదండి పడవలోకి ఎక్కించారు. పడవల కూర్చోగానే అది బయల్దేరింది. అది స్పీడ్‌గా వెళ్లే పడవ అన్న మాట! మాలో ఉత్సాహం! దాదాపు 40 నిమిషాలు మేము ఆ పడవలో ఉన్నాము.

ఆ పడవలో వాళ్లు తీసుకెళ్ళి – సిటీలో సముద్రం మీద కట్టిన ఒక వంతెనని చూపించారు, చాలా బాగుంది. అది చూసుకుంటూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ మేము పడవలో ప్రయాణం చేశాము. ఈ పడవలో ప్రయాణం చేసినప్పుడు, నీటి తుంపరలు వచ్చి మీద పడుతూ ఉంటే త్రుళ్ళిపడుతూ, ఆస్వాదించాము. మేము చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ… దాదాపు 14 నెలల తర్వాత ఫారిన్ కంట్రీకి బయల్దేరాము, చాలా సంతోషంగా ఎగిరి గంతులేసి ఆనందించాలి అని సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాము. నాకయితే, అది కూడా మేము ప్రేమికుల రోజున, అక్కడికి వెళ్లడం చాలా సంతోషం అనిపించింది. మేము ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాము అనుకోకుండా అదే తేదీకి మేము టిక్కెట్లు బుక్ చేసుకున్నాము, అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళేసరికి కొందరూ కొత్తగా పెళ్లైన వాళ్ళు 10 రోజుల క్రితం పెళ్లి అయిన వాళ్ళు అలా జంటలు జంటలుగా కూర్చొని ఉన్నారు. అయితే నేను వీళ్ళందరితో “ఎంత హాయిగా ఉంది, చేతులు నీళ్లలో పెట్టండి” అని చెబుతూ, పాడుకుంటూ వెళ్తూ చూస్తుంటే ఇద్దరు ముగ్గురు మేం చెప్పినట్టే చేశారు. మేము దిగగానే ఒక ప్రేమికుల జంట మా దగ్గరికి వచ్చింది. వచ్చి వాళ్ళు “మేడం మీరు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఇంత ఎగ్జైటింగ్‌గా ఎలా ఉన్నారు?” అని అంటే, “14 నెలల నుండి ఇంట్లో కూర్చొని కూర్చొని ఒకసారి మనం ఎగిరితే ఎలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అదే ఈ ఎక్స్‌ప్రెషన్” అని చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి దిగిన తర్వాత సెంటర్ అనే హోటల్‌లో దిగాము. దానికి ఒక ‘సి’ అని పెట్టి అక్షరం తోటి అక్కడ వంకాయ రంగులో ఒక ట్యూబ్ ని పెట్టి దాంట్లో లైట్ పెట్టారు, చాలా బాగుంది. అక్కడ ఒక ఫోటో దిగి నడుచుకుంటూ మేము రిసెప్షన్‌కి వెళ్ళాము.

రిసెప్షన్‌కి వెళ్ళే దారి కూడా ఎంత అందంగా ఉందో. అక్కడ ఒక్కొక్క చోట ఐదు నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుంటూ మేము రిసెప్షన్‌కి వెళ్లగానే మాకు ఒక టిష్యూ, ఒక డ్రింక్ ఇచ్చారు. ఎవరికీ ఇష్టమైనది వారికి… మ్యాంగో జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఇలా. అవి తాగాకా, వాళ్ళు మాకు అక్కడి నియమనిబంధనలు ఒక్కొక్కటి వివరంగా చెప్పారు. మాకు అక్కడ కొన్ని రైట్స్ ఉంటాయి అని కూడా చెప్పారు. రోజు బయటికి వెళ్లి చూడొచ్చు అని చెప్పారు. అవన్నీ విని మాకు రూమ్ తాళంచెవి ఇచ్చి ఒక బండిలో అందర్నీ కూర్చోబెట్టారు. మా సామానంతా పెట్టి, సామాను వచ్చే బండి వేరు, మేము కూర్చునే బండి వేరు. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి నెంబర్ ఇచ్చారు. అది నీళ్లలో కట్టిన ఒక ఇల్లు అన్నమాట. అక్కడకి చక్కటి దారి.. పెద్ద రోడ్డు అంత ఉంది. అవి అన్నీ చూస్తూండగా, మమ్మల్ని అక్కడ దించేసి వెళ్లారు. లోపలికి వెళ్లగానే చల్లగా హాయిగా ఉంది. ఎప్పుడో ఏసీ పెట్టి ఉంచారు అన్నమాట, మేము రాగానే విశ్రాంతి తీసుకోవచ్చు అని. అందులోనూ బయటకు రాగానే జెక్వ్సీ ఉంది. పక్కకి రెండు బెడ్స్ ఉన్నాయి. దాని మీద మనము కూర్చుని ఒక బుక్ చదువుకుంటూ సముద్రాన్ని చూస్తూ అలా గడిపేయవచ్చు అన్న మాట! అంత బాగుంది అది.

మేము ఆ రోజు అక్కడ రెండు గంటలు విశ్రాంతి తీసుకున్నాము. మళ్లీ నాలుగింటికి లేచి పరిగెత్తుకుంటూ ‘ఈ రోజు ప్రేమికుల రోజు ఏం చేశారు ఏం చేశారు?’ అనుకుంటూ వెళ్ళాను నేను. అయితే అక్కడ ఏం ఉంది అంటే అన్నీ హృదయం ఆకారంలో ఉన్న బెలూన్స్ ని చక్కగా ఒక వీధి లాగా కట్టేసారు. సముద్రం ఒడ్డున ఇసుక లోని ఒక వీధి లాగా స్తంభాలు పెట్టి ఆ స్తంభాలు కూడా ఎరుపు రంగుతో ఉన్నాయి. హృదయం ఆకారంలో ఉన్న బెలూన్స్ ని అక్కడ అన్నిటికీ కట్టిపెట్టి ఉంచారు. అక్కడే ఒక హృదయం ఆకారంలో ఇసుకలో రాసి ఇసుకని కూడా హృదయం ఆకారంలో ఎరుపు రంగుతో నింపారు. నింపి అందులో ఏం చేశారు అంటే చక్కగా ఉయ్యాల ఊగచ్చు అన్నమాట. ఇంకొక చోటనేమో హృదయం ఆకారం గులాబీ పూల రెక్కల తోటి హృదయం అంతా అలంకరించారు. అవన్నీ చూసుకుంటూ ఇంకొక చోటికి వెళ్ళితే చక్కటి ఒక దారి లాగా ఉండి, ఒక హెడ్జ్‌లో కట్టిన చిన్న గుండ్రటి ఆకారంలో నాలుగు స్తంభాలు, స్తంభాలపైన తెల్లటి బట్టను గోపురం లాగా ఉంచారు. ఇందులో మంచి టేబుల్ వేసి ఆ టేబుల్ మీద అన్నీ ఎరుపురంగులో కుర్చీలు వేసి ఆ తెల్లటి నాప్కిన్స్ పెట్టి చక్కగా అలంకరించారు. అంటే ఇవన్నీను కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి హనీమూన్ జంటల వాళ్లకు ఆహ్వానం పలుకుతున్న విధానమిది. అక్కడ చక్కటి ఫోటోలు దిగుతున్నారు.

సీతాకోక చిలుకలు అన్ని ఒకేసారి చేరాయా అన్నట్టు అందమైన పిల్లలు అందమైన గౌన్లు వేసుకుని తెగ తిరిగేస్తున్నారు. ఒకరు ఫోటోలు ఇంకా ఫోటోలు! అయితే నేను ఉన్న నాలుగు రోజుల్లో ఒక పదివేలు ఫోటోలు తీసుంటారేమో… ఒక్కొక్కరు ఆవిధంగా అందరూ తీసుకుంటున్నారు. అయితే కోవిడ్ కోవిడ్ అని మనం ఇంత భయపడుతుంటే అక్కడికి వెళ్లి చూస్తే జనాలు నిండుగా ఉన్నారు. ప్రతి స్థలం నిండుగా ఉంది. అంటే మాల్దీవ్స్‌లో 2020-2021 వరకు మొత్తం చనిపోయిన కేసులు 68 మాత్రమే, అక్కడ రెండు వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి అంట, ఆ కేసుల్లో చనిపోయింది కేవలం 68 మంది మాత్రమే. మొత్తానికి మాల్దీవ్స్‌లో చాలా కట్టుదిట్టంగా ప్రతి ప్లేసులో శానిటైజర్లు పెట్టారు. మనం భోజనం దగ్గరికి వెళ్తే చేతులకు కూడా గ్లౌజ్ వేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్లే ముందు ఒక టేబుల్ ఇస్తారు. టేబుల్ పైన కూర్చొని మనము మాస్క్ మరియు చేతులకు గ్లౌజ్ లేకుండా ఏది వడ్డించికోవాడనికీ వీలు లేదు. ఈ నియమం ఖచ్చితంగా పాటిస్తారు. ఆ రెండు రోజులు మన భారతీయులు చాలామంది మాస్కులు లేకుండా వస్తున్నారు, మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలి అంటే మళ్ళీ ఇంటి వరకు వెళ్లి మాస్కులు తెచ్చుకొని భోజనం చేస్తున్నారు అన్నమాట, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఏ ఒక్కరికి ఉన్నా, వేరే ఒక్కరికి తగలకుండా తీసుకునే వారి ఈ జాగ్రత్తలు నాకు నచ్చాయి.

తర్వాత చేతికి అయితే గ్లౌజులు తప్పనిసరి, మనం ప్లేట్ పట్టుకున్న తినే వరకు మనం అన్ని వేసుకుని ఉండాల్సిందే. టేబుల్ పైన కూర్చున్నాక అ గ్లౌజ్, తర్వాత ఫేస్ మాస్క్ పక్కకు పెట్టి అప్పుడు భోజనం చేస్తున్నారు. మళ్లీ రెండోసారి వేసుకోవాలి అనుకుంటే కూడా మళ్లీ గ్లౌజ్ వేసుకుని ఫేస్ మాస్క్ వేసుకొని తప్పనిసరిగా వెళ్లాలి. అది చాలా బాగా నచ్చింది. అక్కడ ఒకరు నిలబడి ప్రతిదీ చూస్తున్నారు. ఇంకా మేము పడవల వచ్చినప్పుడు కూడా మాస్క్ ఏమాత్రం ముక్కు కిందికి జారిన కూడా మాకు ఒక్కొక్కరు వచ్చి సలహా ఇస్తున్నారు.

ఈ మాల్దీవ్స్ గురించి చెప్పాలి అంటే మాల దివ్స్. ఇది ఒక సంస్కృత పదం నుంచి పుట్టింది. ఈ సంస్కృత పదంలో మాల అంటే సమూహము. ద్వీపం అంటే ద్వీపం. ద్వీపాల సమూహము‌ అంటే మాల్దీవ్స్. ఇందులో 1022 దీవులు ఉన్నాయి. కానీ ఇందులో మనుషులు జీవించేది మాత్రం 32 మాత్రమే అంటారు. ఇవి కొన్ని సంవత్సరాలకి కనుమరుగవుతాయి అని కూడా అంటున్నారు. అంటే కొన్ని దీవులు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, కొన్నేమో మునిగిపోతూ ఉంటాయి. మాల్దీవ్స్ కూడా ఎప్పుడో ఒకప్పుడు మునిగిపోతుంది అనేది ఒక వినికిడి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఇది ఎంత అందమైన స్థలం అంటే ఇలలో స్వర్గం. ‘ఇదే ఇదే నా మది పాడను పదేపదే’ ఈ పాట ఒక పది సార్లు పాడుకుని ఉంటాను. ఎంత చక్కటి ఇసుక తిన్నెలో. తెల్లటి రేణువుల తోటి. ఆ స్పటిక అంటే ఒక ముక్క రాయి వేసిన కూడా కనిపించే అంత తేట తెల్లని తోటి సముద్రపు అంచున! ఒక మాల వేసి దాని అలా చక్కటి నీలిరంగు నీళ్లు ఆకుపచ్చ నీళ్లు అసలు ఎంత అందంగా ఉంది అంటే సముద్రాన్ని అలంకరించినట్టుగా ఉంది. ఈ దీవిని చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఎంతో అందమైన ప్లేస్ అని చెప్పవచ్చు. దీంట్లో మేము రెండవ రోజు కూడా గడిపాం. మాకు నీళ్లలో ఉన్న ఒక ఇల్లు ఇచ్చారు… దాదాపు ఒక యాభై ఇళ్ళ వరకు ఉంటాయి. అవి వరుసక్రమంలో ఉన్నాయి. అందులో మాకు ఒక విల్లా ఇచ్చారు. ఇందులో మేము లోపలికి వెళ్ళగానే బెడ్రూమ్, బాత్రూమ్, తర్వాత ఫోర్టికలో చక్కగా 2 సోఫాలు వేసి అందులో పడుకునే విధంగా సౌకర్యంగా పెట్టారు.

అంటే సముద్రం చూస్తూ రోజంతా కూడా గడపవచ్చు అన్నమాట, తర్వాత దాని పక్కకి జేక్విసి కూడా పెట్టారు. అంటే ఈ మెట్లు దిగితే సముద్రం లోకి దిగి పోతాము. అందులో మా వారు చాలా చక్కగా స్నాబిలింగ్ చేశారు. నేను కూడా దిగాను కాని స్నాబిలింగ్ ఎక్కువ చేయలేకపోయాను‌‌. ఎందుకు అంటే నాకు చాలా భయం ఎక్కువ. మా వారికి ఈత వచ్చు కాబట్టి సముద్రం మధ్య భాగం వరకు వెళ్ళితే, ఆ పక్కన ఒక కోచ్ విజిల్స్ వేస్తూ వెనక్కి వచ్చేయమని పిలిచారు. ఆయన అప్పుడు వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేశారన్నమాట. ఈ సముద్రం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క చోట నాలుగు వందల ఫీట్లు, ఐదు వందల ఫీట్లు అడుగున వెళ్లిపోతాం. మొదట్లో చక్కగా నడుస్తూ మనకు మోకాళ్లు నడుము వరకు ఉన్న నీళ్ళు టక్కున పెద్ద అగాథం లాగా కూడా ఉంటాయి. ఈ సముద్రంలో వెళ్లేటప్పుడు అందుకని ఆయన పెద్ద విజిల్స్ వేస్తూ వెనక్కి పిలిచారు. ఈయన వచ్చేసారు అన్నమాట అలాగా మేము ఆరుగురం కలిసి అందులో స్నానం చేశాక మళ్ళా స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళాము. ఆ స్విమ్మింగ్ పూల్ సముద్రం రెండు కలిసే విధంగా మనము కనుచూపు మేరలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనకు నీళ్లు నీళ్లు నీళ్లు! ఉన్న ఐదు రోజులు నీళ్లలోనే ఉండిపోయాము‌. అందులో మాకు ఒక అబ్బాయి వచ్చి చక్కటి యోగా నేర్పించారు, ఆ యోగాలోనే ఏరోబిక్స్ డాన్స్ కూడా నేర్పిస్తారు‌. ఇవన్నీ చేస్తూ ఒక గంట గడిపాము. అక్కడి నుంచి మాకు భోజనాలు, బ్రేక్‌ఫాస్ట్. ఒక్కొక్క అందులో మూడు వేరు వేరు రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇటాలియన్ ఉంది, ఒకటి అరబిక్ ఉంది. ఒకటేమో మాల్దీవ్స్ ప్రత్యేకమైన అంటే ఏషియన్ కంట్రీస్ ప్రత్యేకమైనవి ఉన్నాయి‌.

ఇందులో ఎక్కడికైనా మనం వెళ్లి భోజనం చేయవచ్చు. చాలా సంగీతం తోటి చక్కటి భోజనం సరఫరా చేస్తున్నారు‌. ఆ సంగీతంలో ఓలలాడిస్తూ చక్కటి భోజనాన్ని వేడి వేడిగా వడ్డిస్తూ చాలా మంది ఆతిథ్యం ఇచ్చారు. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎక్కడ కూడా పేరు పెట్టడానికి వీలు లేకుండా భోజనం కూడా మన భారతదేశానికి తగ్గట్టుగా అంటే 75% యాత్రికులు అందరూ భారతదేశం వాళ్ళు ఉన్నారు‌…. అందువల్ల మనకి తగ్గట్టుగా వాళ్లు అన్ని ఉప్పు, కారం, మసాలాలు వేసి చక్కటి భోజనాన్ని అందిస్తున్నారు. మనకి ఇంటి మీద ధ్యాస రాదు ఎందుకు అని అంటే మనకి తగిన ఆహారం దొరుకుతుంది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ మేము ఆ 3 రాత్రులు చక్కటి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నాము. అయితే ఒకరోజు ఇక్కడ రాత్రిపూట అక్కడి వాళ్ళని పిలిచి అక్కడ పద్ధతి అక్కడి సంప్రదాయాలు అక్కడి అలవాట్ల తోటి వాళ్లు చక్కటి వాయిద్యంతో, సంగీతంతో పాటల తోటి డాన్స్ వేస్తూ అందరిని మైమరిపించారు. ఆ పాటలోని వాళ్ళు ఎలాగా వ్యవసాయం చేసేది, ఎలా కోసేది, మళ్ళీ అవన్నీ ఎలా ఇంటికి తెచ్చుకునేది, అందరితో కలిసి పిల్లలు సంతోషాన్ని వెల్లడించడం ఇది అంతా ఆ పాటలోని వీళ్ళు పాడుతూ డాన్స్ చేశారు. అలా డాన్స్ వేస్తూ వేస్తూ వాళ్లు అతిథులు అందరినీ ఒక్కొక్కరినే తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు కూడా చేయించి వాళ్లు కూడా చేస్తూ అందరిని సంతోష పెట్టారు.

ఇందులో అందరు భారతదేశం వాళ్ళే ఉన్నారు కాబట్టి హిందీ పాట, హిందీ పాట అని ఒకరు అడిగారు. అందులో ఒకరు మలయాళం పాట పాడారు.‌ వై దిస్ కోలవరి కోలవరి ఢీ అనే పాట కూడా పాడారు. వేరే దేశంలో మన సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. తర్వాత మేము ఆ రోజు రాత్రి మేము వెళ్ళిన రోజు రాత్రి ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవానికి చక్కటి హృదయాకారంలో ఉన్న ఈ అరేంజ్మెంట్స్ అన్నిటిని ఎర్రటి బుగ్గలతోటి వెలిగిస్తూ ఆ మొత్తం సీ-షోర్ ఎర్రగా మారిపోయింది. అయితే ఆ సీ-షోర్‌లో జంటలు అందరూ కలిసి సీతాకోకచిలుక లాగా చక్కటి డ్రెస్సులు, గౌన్లు, పొడవు గౌన్లు వేసుకుని చిన్న చిన్న పిల్లల్లా అలా గెంతుతూ హాయిగా ఆ రోజు రాత్రి అక్కడ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌లో చక్కటి సింగీతం తోటి వీళ్ళు అందరు డాన్స్ చేస్తూ ఫోటోలు తీసుకుంటూ కాలం గడిపారు. మేము ఆ రోజు అరబిక్ భోజనానికి వెళ్ళాము. అరబిక్ భోజనంలో వాళ్లు అన్నీ మనకు కబాబ్స్, తర్వాత సీఫుడ్ ప్లేటర్ అని పెట్టారు. ఈ సీఫుడ్ ప్లేటర్‌ లో సముద్రపు ఆహారాలు… అంటే చేపలు, నత్తలు, తర్వాత రొయ్యలు ఇవన్నీ కలిపి ఒక ప్లేట్ పెట్టి అందరికీ వడ్డించారు. అంటే చక్కగా వేడి వేడి పదార్ధాలు వాళ్ళు వడ్డిస్తూ, మా మూడు జంటలను చక్కగా అరబిక్ స్టైల్ లో కింద కూర్చో పెట్టి… ఒక టేబుల్ వేసి దాని చుట్టూ కూర్చోబెట్టి వడ్డించి పెట్టారు అన్నమాట‌.

కొంతమందికి మామూలు టేబుల్స్ కూడా వేశారు. ఇవి చాలా బాగా అనిపించింది. అది ఒక రాత్రి అయిపోయింది. రెండవ రోజు మాకు ఒక ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కలిపి లైవ్ మ్యూజిక్ తోటి డమరుకం తోటి, తర్వాత బాజాలతోటి చక్కటి సంగీతాన్ని వెస్టర్న్ సంగీతాన్ని వినిపించారు. వాళ్ళు దాదాపు నాలుగు గంటలు పాటలు పాడుతూనే ఉన్నారు. అలా సముద్రం చూస్తూ ఆకాశంలో చందమామను చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడ ఆ పాటలు వింటూ పరవశించాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిజంగా ఐదు రోజులు ఒకటే స్థలంలో ఉండి మేము పొందిన ఆనందం కన్నా మధురమైన ఆనందం మరొకటి ఉంది.

ఒక రోజు సబ్‌మెరైన్ ఎక్కించారు. ఒక పడవలో ఎక్కి సబ్‌మెరైన్ వరకు వెళ్లాలి. సబ్‌మెరైన్ 300 ఫీట్లు వరకు సముద్రం అడుగుకు వెళ్ళిపోతుంది. సముద్రపు అడుగున చేపలు రొయ్యలు తర్వాత రంగురంగుల ఎన్నో వింతయిన సముద్రపు జీవరాశులు అన్నిటిని చూస్తూ ఒకరోజు సగం తిరిగి వచ్చాము. చాలా చక్కటి సబ్‌మెరైన్‌లో మనం – చుట్టూ చూస్తూ పోతుంటే మనల్ని మనము మర్చిపోతాం. ఎక్కడ ఏది కనిపిస్తుందా, మనం ఎక్కడ ఏది మిస్ అవుతామా అని కళ్ళతోటి చూస్తూ ఆనందాన్ని అనుభవించాము. అయితే సబ్‌మెరైన్‍ ట్రిప్ కూడా నేను మా స్నేహితురాళ్ళు ముగ్గురికే. మాకు స్పెషల్‌గా వేసినట్టుగా వేశారు, ఎందుకని అడిగితే, “మీ ముగ్గురు బుక్ చేసుకున్నప్పుడు మీతో పాటు బుక్ చేసుకున్న వారు వేరే యాత్రలకు వెళ్లారు కాబట్టి” అని జవాబిచ్చారు. మాకు అయితే ప్రత్యేకంగా మా ముగ్గురు కొరకే సబ్‌మెరైన్ వెళ్ళినట్టు అనిపించింది. చాలా సంతోషం అనిపించింది.

ఇలా ఎన్నో మధురమైన అనుభూతులను మిగుల్చుకుని ఇళ్ళకి తిరిగి వచ్చాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here