Site icon Sanchika

అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – సేషెల్స్

[dropcap]ప్ర[/dropcap]పంచంలో ఎన్నో అందమైన దీవులున్నాయి. వాటిల్లో కొన్నింటినైనా సందర్శించి పరవశించే అవకాశం మాకు కలిగింది. ఈ వ్యాసంలో మా సేషెల్స్ పర్యటన గురించి వివరిస్తాను.

ముఖ్యంగా పర్యటకరంగము మీద ఆధారపడి ఉన్న ఒక చిన్న దేశం సేషెల్స్. ఇది ఒక ద్వీపము కాదు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో సుమారు 115 ద్వీపాల సమూహము. పచ్చని వృక్షసంపద, అందమైన పూస మరియు అనేక రకాల సముద్ర జీవులు నివసిస్తూ ఉంటాయి. సీషెల్స్ యొక్క ప్రధాన ద్వీపాలు కెన్యాకు 1,600 కిమీ దూరములోను, మడగాస్కర్‌కు ఈశాన్యంగా 1.100 కి.మీ దూరములో ఉన్నాయి. దీని రాజధాని విక్టోరియా. ఇది మహే ద్వీపంలో ఉంది. ఇది అయిదు సంవత్సరాల కాలపరిమితి గల 35 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీ అధ్యక్ష పాలనలో ఉంటుంది. ఈ దేశము 25 పరిపాలనా విభాగములుగా విడగొట్టబడి అధ్యక్ష పాలనా నిర్వహణలో ఉంది. దీని జనాభా 2020 జనాభా లెక్కల ప్రకారము 98,500. దీని వైశాల్యము 452 చ.కి.మీ. పురుషులలో 91.4% స్త్రీలలో 92.3% అక్షరాస్యత కలిగి ఉన్నారు. వ్యవసాయము, చేపల వేట, మరియు అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన వృత్తులు. మిశ్రమ ఆర్ధికాభివృద్ధి గల ఈ దేశ ఆర్ధికాభివృద్ధి ముఖ్యంగా పర్యాటకరంగముపైననే ఆధారపడి ఉన్నది. జనాభాలో మూడు వంతులు రోమన్ కాథలిక్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. మిగిలిన ఒక్క భాగము ఇతర క్రైస్తవులు, హిందువులు మరియు ముస్లిమ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ప్రజలు రాజధాని నగరమైన విక్టోరియాలోనే జీవిస్తుంటారు. ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయము విక్టోరియా నగర సమీపమున కలదు అక్కడ నుండి వేరువేరు ద్వీపములకు విమాన రవాణా సౌకర్యం కలదు. రోమ్, లండన్, పారిస్, బాంకాంగ్, ఇంకను మరికొన్ని ఇతర దేశములకు విమాన ప్రయాణ సౌకర్యం కలిగి ఉంది. రైలు మార్గములు లేవు.

ఇంత అందమైన ఆ షెషెల్స్ దేశములో పర్యటించడానికి మేము కెన్యా(Kenya) నైరోబి(Nirobi) షేషెల్ల్స్ (Shey shells) ఫ్రాసిలిన్(Praslin) లాడీగు(Ladigue) ఎంచుకున్నాము. ఆ ప్రదేశాలు చూడడానికి మేము రెండు జంటలు. మేమిరువురము ఒక జంట వేరొక జంట భార్యా భర్తలిరువురూ డాక్టర్స్. అతను దుబాయ్‌లో జాబ్ చేస్తారు. భార్య హైదరాబాద్ లోనే ఉంటారు. మా రెండు జంటలకు ఒక బిజినెస్ ఉమెన్ శోభ అని వారి తరువాత, డాక్టర్ అల్క అనే అమ్మాయి జతకలిసారు. అందరం కలిసి మేము ఆరు మందిమి. మా గ్రూపులో ఉన్న సబిత అనే వాళ్ళ అమ్మాయి చెన్నయ్‌లో ఉంటుంది, అందువల్ల మాకు కరెక్ట్ టైం కి తను ఒక ప్యాకేజీని బుక్ చేయగలిగింది‌. మొదట ముంబాయి వెళ్ళి ముంబాయిలో ఒక రాత్రి ఉండి, అక్కడి నుండి మేము 2015 సెప్టెంబరు 5వతేదీన హైలాండ్‌కి వెళ్ళాము‌‌. నైరోబి కెన్యా ఇవన్నీ చూసిన తర్వాత, సేషల్స్‌కి వెళ్ళాము. అయితే ఆరుగురం కలిసి మేము ఒక ప్యాకేజీని బుక్ చేసుకున్నాము‌. ఆరుగురం కలిసి వెళ్లినందుకు అక్కడ లోకల్ గా బుక్ చేసినందుకు మాకు ఆ ట్రిప్ చాలా చాలా తక్కువకి మాట్లాడుకోవడం జరిగింది. మేము ఒక పెద్ద ఓపెన్ టాప్ వ్యాన్ మాట్లాడుకున్నాము. దాని పేరు ల్యాండ్ క్రూయెసర్ ఇది బ్లాక్ కలర్‌లో ఉంది. చక్కటి జీప్ అది ఎక్కితే ఎంత సంతోషం అనిపించింది అంటే నాకు ఏనుగు ఎక్కినంత సంతోషం అనిపించింది. నేను ఈ ప్రయాణానికి వెళ్లే ముందే ఒక ట్రెక్కింగ్ చేస్తూ చేస్తూ అడవిలో జారి పడ్డాను. ఆ జారీ పడ్డందుకు నేను కూర్చుంటే అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. అందుకని నేను వెళ్లే ముందే అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేశాను. డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే ముందు సీట్లో కూర్చొని ఒక మెత్తటి దిండు వేసుకొని మీరు ప్రయాణం చేయవచ్చు అని చెప్పారు. నేను అలాగే అందర్నీ ఒప్పించి ముందు సీట్లో ఒక దిండును వేసుకొని ఆ ప్రయాణమంతా సాగించాను. మిగిలిన అందరూ నా పరిస్థితి గమనించి నాకు సహకరించారు.

మేము అక్కడికి చేరుకోగానే ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. హోటల్ నుంచి ఒక కిలోమీటర్ నడవగానే మాకు చక్కటి సేషెల్స్ సముద్రం కనిపిస్తుంది. సేషెల్స్ సముద్రాన్ని పసిడి కిరణాల గిలిగింతకు ఎగిసిన కడలి కెరటాల కేరింత ఆ కేరింతలకి చిరుగాలి అలికిడికి ఆ కేరింతలతో మమేకమై చిగురాకుల తుళ్ళింతలతో ఒళ్లంతా జల్లంత అయ్యి ఆ సముద్రపు ఒడ్డున మేము కూర్చుంటే ఆ అలల తోటి మా శరీరం అంతా పులకింతల్తె ఆకాశ వీధిలో అందాల చందమామతో పరవశించే పాలపుంతలమై ఆ రోజు రాత్రి మేము సేషెల్స్‌లో సాయంత్రం పూట ఆ సముద్రంలో గడిపాము. ఇది అందమైన శ్వేత వర్ణపు ఇసుకతోనిండిన క్రీరాలు ఈ షల్స్‌కి ఎంతో అందాన్ని తెచ్చి పెడతాయి.

అది మాకు 20-25 రోజుల ట్రిప్ అది. నైరోబీలో మూడు రోజులు తర్వాత మస్తెమారా రెండు రాత్రులు అలాగా ఎన్నో ప్లేసెస్‌కి వెళ్ళాం. అవన్నీ చూస్తూ చూస్తూ ఒక ప్యాకేజీ టూర్ లాగా మాట్లాడుకొని ఆ వాహనాన్ని సపరేట్గా మాట్లాడుకుని మాకు మేమే హోటల్స్ ని బుక్ చేసుకొని వెళ్ళాము. అయితే ఇక్కడ మాకు ఎంత అదృష్టం అంటే మేము కెన్యా వెళ్ళినప్పుడు కెన్యాలో చక్కటి కొంగలు సముద్రతీరంలో అన్ని వేల కొంగలని ఒకే సారి చూడటం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. తర్వాత ఇక్కడ అన్ని చోట్లా మాకు టెంట్ హౌస్ అద్దెకు ఇచ్చారు. ఆ టెంట్ హౌస్‌లో మొదటి రోజు పడుకున్న రోజు మీకు రాత్రి పూట జంతువులు కూడా మీ టెంటులోకి రావచ్చు భయపడకండి, వాటిని మీరు ఏం చేయకుంటే అవి కూడా మిమ్మల్ని ఏం చేయవుఅని చెప్పారు. అదే రాత్రి అక్కడ నివసించే గిరిజనులు వారి భోజనమని చెప్పి వాళ్లే వండు కొచ్చి మాకు అందరికీ భోజనం పెట్టి చక్కగా వాళ్ళ పాటలు పాడుతూ డప్పుల దరువులతో వాళ్ళ తీరు అయిన నృత్యం చేశారు. అక్కడ చలిగా కూడా ఉంది. చలి మంట వేసి వీరు ఆ చలిమంట చుట్టూ నృత్యం వేశారు. అక్కడ గిరిజనులు వాళ్ళు ఒక తోలుతో కుట్టినవి , గంటలు, పూసలతో కుట్టిన వస్త్రాలు వేసుకున్నారు. పైన మాత్రం ఒక ఎర్రటి గొంగళి లాంటి దుప్పటి క్రాస్‌గా వేసుకున్నారు. ఒక చేతిలో పెద్ద ఎదురు కర్రని పట్టుకున్నారు. వీరే అక్కడ మాకు ఉన్న రెండు రాత్రులు వాళ్ళ భోజనాలు పెట్టారు. ఈ అడవిలో పడుకున్నప్పుడు ఆ టెంట్ హౌస్‌లో రాత్రిపూట బాగా దోమలు ఉంటాయి అనుకుంటాను అందుకోసం దోమ తెర కూడా వేసి ఉంచారు. మాకు దోమలు కుట్టకుండా కూడా ఆయింట్మెంట్ ఇచ్చారు ఇది వాడండి మీకు మంచిది అని చెప్పారు. మేము కూడా కొన్ని కొనుక్కొని వెళ్ళాము. అది అంతా ఆ కాళ్లకు చేతులకు రాసుకుని పడుకున్నాము రాత్రి. పొద్దున్నే లేచే సరికి అంత చిన్న దాంట్లో కూడా వేడి నీటి సౌకర్యం ఉంది. ఎలా సప్లై పెట్టుకున్నారో నాకు ఐడియా లేదు కానీ వేడి నీళ్ళు ఇచ్చారు చిన్ని బాత్ రూమ్ కూడా ఉంది అందులోనే స్నానం చేసిన, తర్వాత రోజు ఉదయం వాళ్లతో కలిసి ఆడవి అంత అలా అలా తిరిగాము. ఏనుగులు జింకలు అన్ని పక్కపక్కనే తిరుగుతూ కనిపించాయి. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో మాకు గట్టి రొట్టె అంటే బన్ గాని కాస్త గట్టిగా ఉంది. బ్రెడ్ ఆ బ్రెడ్ లోకి తినడానికి మటన్ని సూపు లాగా చేశారు, కాఫీ ఇచ్చారు. ఇవి మా బ్రేక్‌ఫాస్ట్. ఆ రోజు అలా బ్రేక్‌ఫాస్ట్ తినివేసి మేము కెన్యాలో జంతువులను అన్ని చూస్తున్నప్పుడు జంతువుల వలస అనేది ప్రపంచంలోని అతి ప్రసిద్ధి కెక్కిన జంతు వలస ఒక నాచురల్ వింత. ఆ వింత మాత్రం నిజంగా అసలు కళ్ళకు అద్దినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు కళ్లు మూసుకున్నా కూడా. ఒక లక్ష బీస్‌లు అంటే బర్రెల లాగానే ఉంటాయి కానీ బీస్ అంటారు ఇక్కడ బీస్ అన్ని ఒక దగ్గరికి చేరి వాటిలో అవి మాట్లాడుకున్నట్లు ఉంటుంది . వాటిలో ఒకటి నీటిలోకి తొంగి చూసి “అక్కడ మొసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళకూడదు”. అని చెప్తే మిగతావన్నీ వింటాయి. మళ్లీ అది ఒకసారి తొంగి చూస్తుంది ఆ ఇప్పుడు మొసళ్ళు లేవు చూద్దామని నీటిలోకి దూకుతుంది. దానివెనుక మరొకటి దానివెనుక మరొకటి అలా ఉదయం పది గంటలకి మొదలయిన ఆ వలస సాయంత్రం మూడు గంటల వరకు కొనసాగింది. ఈ మూడు గంటల వరకు అవి మాటి మాటికి ఆ నీటిలోకి తొంగిచూడటం జరుగుతుంది. ఆ ప్రవాహం ఒక నది. ఆ నదిలో చాలా మొసళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఈ బీస్ కి ఇక్కడ ఉన్న మైదానం నుంచి నదికి అటు వైపున ఉన్న మైదానం పచ్చగా కనిపిస్తుందట.

“అక్కడ పచ్చగా కనిపిస్తుంది అక్కడ పచ్చిగడ్డి చాలా ఉంది మనం అక్కడికి వెళ్లి తిందాము” అని చెప్పేసి వాటిలో అవి మాట్లాడుకుంటాయన్నమాట. మాట్లాడుకొని ఆ నది దాటి అటు వైపుకు వెళ్లిపోతాయి. అయితే ఈ నది దాటే సమయంలో అది కూడా ఒకటే సారి మన వికటకవి తెనాలి రామకృష్ణుడు గారు చెప్పినట్టుగా “మేక తోక తోక మేక” అని బీస్ తోక బీస్ తోక అని మనం పాడుకోవాలి. అలాగా ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెనుక ఒకటి జంప్ చేస్తూ వెళుతుంటాయి. అంటే మూకుమ్మడిగా లక్ష ఒక్కసారి దిగవు. అవి ఒక లైన్ లాగా కట్టి చక్కగా దూక్కుతాయి. అవి దూకే సమయంలో చాలా మొసళ్ళు కూడా దాక్కొని ఉంటాయి. బీస్‌ని ఎప్పుడు పట్టుకుందామని, మేము చాలా ఉత్సాహంగా చూస్తున్నాము. ఆ సమయంలో ఒక మొసలి వచ్చి ఒక చివరి బీస్ అంటే బర్రెను పట్టుకుంది. అది పట్టుకుంటే కూడా మిగతావి అన్ని వచ్చి దాన్ని విడిపించుకొని టక టక పైకి ఎక్కేసి వెళ్లిపోయాయి. ఇప్పుడు అది పట్టుకుందో మిగతా బర్రెలు అన్ని ఆగిపోయాయి. గట్టు మీద అటు వైపుకు వెళ్లిన బర్రెలు అన్ని మిగిలిన వాటి కొరకు చూస్తూ ఉంటాయి. ఈ ఒడ్డున ఉన్న బర్రెలు కూడా ఎప్పుడు వాటికి ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు దూకుదామాని ఎదురు చూస్తుంటాయి. నిజంగా ఆ జంతుజాలం యెక్క కదలికలు ప్రవర్తన చూస్తుంటే చాలా ఆనందముగా ఉంటుంది. వాటిలో అవి మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒక ఊరు పెద్ద చెబితే మిగిలిన వారు విన్నట్టుగా ఆ ఊరి పెద్ద చెప్పగానే దూకినట్టుగా మనం చక్కగా చూడవచ్చు. అవి నిజంగా మాట్లాడుకుంటున్నాయా అన్నంతగా ఎంత బాగానో అనిపిస్తుంది.

ఇదే విధంగా నేను ఈ మధ్య కాలంలో కవిని అనే ఒక అడవికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మూడు ఏనుగులు ఉన్నాయి, ఆ మూడు ఏనుగులు మా వ్యాన్ ఒకదానికి అడ్డంగా ఉన్నట్టుగా ఉంది అయితే అది నిలబడిపోయి ఇంకొక ఏనుగుని పిలిచింది. ఏనుగు పిలవగానే ఇంకొక ఏనుగు వచ్చి చాలా సేపు మా వెకిల్ ముందుకు పోతుంది ఏమో అని ఎదురు చూస్తున్నాయి. మేము ఒక పది నిమిషాలు ఆగి ఈ లోపల మూడవ ఏనుగు వచ్చింది అక్కడే ఆగిపోయింది. సరే మాకు అర్థమయింది దాని భాష మా వెకిల్ కాస్త 400 గజాల పైకి తీసుకు వెళ్లగానే అవి మూడు ఇంకొక వైపుకి వెళ్లిపోయాయి. ఈ లోపల ఆ ఇంకొక్క వైపుకి వెళ్లి ఆ చిన్న ఏనుగుని ఆ తొండం తోటి ఆ చెవిని ఇలా తాకుతూ దీని కడుపు తోటి దాని కడుపులో రాస్తూ చక్కగా ఒక స్పర్శతోటి ఆ మూడు ఏనుగులు మాట్లాడుకుంటున్నాయి. నువ్వు భయపడకు మేము ఉన్నాము అని అసలు అవన్నీ నిజంగా మనం వీడియో చూస్తూ దాని భాష అర్థం చేసుకుంటే నిజంగా మనుషుల కంటే ఎక్కువ ఆ స్పర్శ దానికి అది ఎంత చక్కగా హాయిగా తల ఊపుతూ సంతోషంగా అట్లా హగ్ చేసుకున్న విధంగా చక్కటి ఆకృతిగా మాకు కనిపించాయి‌‌. ఇదే భాష ఆ రోజు కెన్యాలో కూడా ఆ బీస్ అన్ని మాట్లాడుకుని అవి అలా పరిగెత్తుకొని చక్కగా దాంట్లోకి వెళ్లిపోవడం అనేది ప్రపంచంలోనే అతి వింతైన ఒక సందర్శన ఇది‌‌. ఆ జంతువులు వలస వెళ్ళే విధానము చూసేందుకు నెలలు తరబడి ఎంతోమంది విదేశీయులు అక్కడ తిష్ఠ వేస్తారుట, కొంతమంది చూడకుండానే వెళ్ళిపోతారట. కానీ మా అదృష్టం ఏంటో మేము వెళ్ళిన టైంకి అదే రోజు మధ్యాహ్నంకి వలస వెళ్ళటం ప్రారంభమైనది. అసలు మేము ఎంత అదృష్టవంతులం అని మురిసిపోయాము. మేము మా ఆరుగురము అదేరోజు చక్కటి పులులు సింహాలు ఆ సింహాలు ఒకదాని వెంబడి ఒకటి నాలుగు సింహాలు నీళ్లు తాగటము ఒక చోట ఒక జింకను పట్టుకొని అవి తినటం. జీబ్రాలు కూడా గుంపులు గుంపులుగా మా వాహనము వెంబడి పరిగెత్తడం ఎంతో వింత అయిన అనుభూతికి లోను అయిపోయాము. మా వారు అయితే ప్రపంచంలో ఎప్పుడూ అయినా జంతు ప్రేమికులు కచ్చితంగా కెన్యాకి మాత్రం వెళ్లి ఆ జంతువులు మాట్లాడుకున్న భాషలని విని అవి తిరిగే స్థలాన్ని చూసి తప్పక తరించాలి అని చెబుతారు. ఆయనకు చాలా ఇష్టం కెన్యా అంటే, అలాగే ప్రతి ఒక్క జంతువు చూసాము. మేము అక్కడ ఏ ఒక్క జంతువు కూడా మిస్ కాలేదు. మేము అక్కడ అలాగా ఆరు రోజులు ఆ అడవులలో ఉన్నాము.

పిమ్మట మేము షిషేల్స్ చేరుకున్నాము. అక్కడ వివిధ రకాల పక్షి జాతులను చూసాము, ప్రపంచంలో 200 మాత్రమే మిగిలిన పక్షులు మాగిఫి రూబిస్ 30 మాగ్ఫి పక్షులు,30 ఇక్కడి దీవులలో పెంచుతున్నారు.బ్రుష్ వార్చ్‌లర్ అనే జాతికి చెందినవి ఇక్కడ కనిపిస్తాయి. 231 ట్యూటెయిల్స్ అన్నమాట. 25000 చిన్ని తాబేళ్ళని 2010-2011 ఈ సముద్రంలో విడిచిపెట్టారు.60 పెద్ద తాబేళ్ళను సంరక్షించారు. అయితే కోలిన్ ఇన్‌ల్యాండ్‌లో 10 మంది యాత్రికులను మాత్రమే ఒక్క రోజుకి లోనికి రానిస్తారు. ఒక్క కుటుంబం మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఉండి ఈ అడవి సంపదను కాపాడుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఈ దీవిలో ఒకరోజు రాత్రి విల్లా తీసుకొని ఉన్నారు. ఇది చాలా ఖరీదులో ఉందని నేను మావారు మరియు డా; అల్కా మాహే నుండి పొద్దున ఆరు గంటలకు బోట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఫారెస్ట్ లోకి వెళ్ళాము. చక్కటి కట్టెతో చేసిన బొమ్మలు రెస్టారెంట్‌కి బయట పెట్టారు‌. అవి చూస్తూ సీషొర్‌కి వెళ్ళాము. అక్కడ రెండు తాటి చెట్ల నడుమ పెద్ద ఉయ్యాల ఉంది. అది ఊగుతూ నింగిలోకి ఎగిరి “నింగి నేల ఒకటాయెలే” అని ఆనంద డోలికల్లో ఊగిసిలాడము. ఇది దక్షిణ భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల 365 రోజులు వాతావరణం పరిస్థితి ఒకేలా ఉంటుంది, కొద్దిగా చల్లగా మధ్యాహ్నం మాత్రము వేడిగా ఉంటుంది.

కోజిన్ దీవి 115 దీవులలో ఒక్కటి. ఇది సేషెల్స్ కి 18 మైళ్ళు ఉంది. ఇది అతి పెద్ద దీవి. సేషెల్స్ మాహే (Mahe) ఇది సేషెల్స్ మెయిన్ ల్యాండ్ ప్రాసిలిన్‌కి 3 మైళ్ళ దూరంలో ఉంది. పొద్దున్నే మేము మాహే నుండి ప్రాసిలిన్‌కి బోట్లో వెళ్ళాము. ఇక్కడికి వెళ్లడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ దిగగానే ఒక కీలె(Keeley) కుటుంబం ఇక్కడ ఈ ప్రకృతిని కాపాడుతూ వస్తున్నారు‌. 1992లో ఈ దీవిలో అడుగు పెట్టి ఇక్కడ ఈ జంతువుల సంరక్షణ మరియు అడవులను కాపాడుతూ ఒక ప్రాజెక్ట్ చేశారు. మేము ఇక్కడికి రాగానే ప్రాసిలిన్‌లో ఒక చిన్ని ప్రైవేట్ హౌస్ లో పేయింగ్ గెస్ట్ గా దిగాము. ఇందులో సైకిల్స్ ఉన్నాయి ఆ ప్రాంతం కూడా తిరగడానికి మా వారు సైక్లింగ్ చేశారు, నేను వాకింగ్ చేస్తూ ఈ ప్రాజెక్టు లోకి అడుగు పెట్టాము. ఇక్కడ తాబేళ్ళ కొరకు అన్ని రకాల జంతువులకి వేరువేరుగా కొన్ని ప్రదేశములు ఏర్పాటు చేసి అవి తిరగడానికి తగ్గట్టుగా ఆ ప్రదేశాలని చక్కటి హోటల్ అనిమల్స్ లాగా తీర్చిదిద్దారు‌‌. 2010లో దీనికి world’s Green Destination Travel Award  లండన్‌లో ఇచ్చారు. దీనిని చాలా విచిత్రంగా తీర్చిదిద్దారు‌. కొన్నిచోట్ల సీల్ బర్డ్స్, పచ్చటి తాబేలు పెద్ద తాబేలు ఉన్నాయి. అన్నిటికీ పెద్ద పెద్ద కొండల మధ్య నీటిలో తిరిగే విధంగా ఆ నీటిని ఆ కొండల చుట్టూ పారుతూ ఈ తాబేళ్ళను ఉంచారు.

1602 లో వాస్కోడిగామ “Tres Iramaos” అని ఈ దీవిని తన మ్యాప్ లో చిత్రీకరించారు.అదే పెద్ద పర్వతాలని మాహేలో (Trois Freres) అని పిలుస్తారు.

మేము కో కో డీ మార్‌కి వెళ్ళాము. కో కో డీ మార్ అనేది ఒక హోటల్ మరియు మ్యూజియం. ఇందులో అతి అరుదైన కొబ్బరికాయ చూశాము. లాడిగు ప్రాసిలిన్లో ఇది దొరుకుతుంది. ప్రపంచం మొత్తంలో ఎక్కడ మీకు ఈ రకము కొబ్బరికాయ కనపడదు కిడ్నీ షేప్‌లో ఉంటుంది. నేను మా వారు ఆ కొబ్బరి కాయ తీసుకోని ఫొటోస్ దిగాము. ఇది అమ్మరు, ఎక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయడానికి వీలులేదు. తనదైన అభివృద్ధితో ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. ఇక్కడ లిరిఫండ్ కూడా తీసుకొని తీసుకుంటున్నారు. నేచర్ డెవలప్మెంట్ గురించి ప్రకృతి సంపద వింతలు విడ్డూరాలలో ఈ కొబ్బరికాయని కూడా చేర్చవచ్చు. ఇంత అద్భుతమైన ప్రదేశములన్నీ తిరిగి చూసిన పిమ్మట మధురమైన ఎన్నో జ్ఞాపకాలు మదిలో నిక్షిప్తం చేసుకొని బరువైన హృదయముతో భారతదేశమునకు తిరుగు ప్రయాణమైనాము.

Exit mobile version