[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత్రి ‘శ్రీమతి అంగులూరి అంజనీదేవి’ రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
***
కలలో కూడా ఊహించని ఆ విపత్తుకి అయన మనసంతా పుండులా తయారైంది. ఆయన్ని చూడగానే సత్యవతి ఏడుపు ఆగలేదు. మౌనంగా చూడటం తప్ప ఆయనేం మాట్లాడలేదు. సత్యవతిని ఓదార్చటం నివేధ పని అయింది.
ఆ రాత్రంతా ఆ ఇంట్లో ఎవరూ నిద్ర పోలేదు. మనోవ్యధతో మానసిక నరకం చూసారు.
***
తెల్లవారి ఆ అడ్వకేట్ కోర్టులో బెయిల్ పేపర్‌ని మూవ్ చేసాడు. ఆ కోర్టులో పోలీసుల తరుపున గవర్నమెంట్ లాయర్ బెయిల్ ఇవ్వనని గట్టిగా వాదించాడు. ఆ వాదోపవాదాలు జరిగేవరకు సాయంత్రం ఐదు దాటింది. జడ్జి గారు బెయిల్ ఇవ్వలేదు.
తర్వాత రోజు ఆదివారం కావటం వల్ల సోమవారం సాయంత్రానికి బెయిల్ వచ్చింది.
బెయిల్ వచ్చిన తరువాత హరనాథరావు బెయిల్ పేపర్ పట్టుకుని సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. అక్కడ జైలు అధికారులకు చూపించాడు.
***
ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.